సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

మానసిక ఆరోగ్య పునరావాసం కోసం 13 భాషల్లో 24 గంటలూ పనిచేసే ఉచిత టెలిఫోన్ సర్వీసు "కిరణ్" (1800-599-0019) ప్రారంభించబడింది

Posted On: 08 SEP 2020 1:36PM by PIB Hyderabad

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం కోసం మరియు వారికి సహాయాన్ని అందించడానికి, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, మానసిక అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్న సంఘటనల దృష్ట్యా, 13 భాషలలో 24 గంటలు పనిచేసే మానసిక ఆరోగ్య పునరావాస ఉచిత టెలిఫోన్ సర్వీస్ "కిరణ్" (1800-599-0019) ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన,  డి.ఈ.పి.డబ్ల్యూ.డి., ప్రారంభించింది.  కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌ చంద్ గెహ్లాట్ నిన్న వెబ్‌కాస్ట్ ద్వారా పోస్టర్, బ్రోచర్ మరియు సమాచార పుస్తకంతో పాటు ఈ ఉచిత సహాయ టెలిఫోను సర్వీసును ప్రారంభించారు.

హెల్ప్‌ లైన్ ఈ విధంగా పనిచేస్తుంది : భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ టెలికాం నెట్ ‌వర్క్ నుంచైనా, ఏదైనా మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుండి 1800-599-0019 ఉచిత నెంబరును ఫోన్ చెయ్యాలి. స్వాగత సందేశం తరువాత, సరైన బటన్‌ను నొక్కడం ద్వారా భాషను ఎంచుకోండి; భాషను ఎంచుకున్న తర్వాత, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఎంచుకోండిభాషా ఎంపిక తరువాత, రాష్ట్రం / యుటిని ఎంచుకోండి, అప్పుడు, మీరు స్థానిక లేదా కావలసిన రాష్ట్ర హెల్ప్‌ లైన్ కేంద్రానికి అనుసంధాన మౌతారు.  మానసిక ఆరోగ్య నిపుణుడు సమస్యను పరిష్కరించడానికి లేదా బాహ్య సహాయానికి (క్లినికల్ సైకాలజిస్ట్ / రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ / సైకియాట్రిస్ట్) సూచించడానికి లేదా అనుసంధానం చేయడానికి సహాయ పడతారు.  

ఈ ఉచిత సహాయ టెలిఫోన్ సర్వీసు, రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులు బి.ఎస్.‌ఎన్.‌ఎల్. యొక్క సాంకేతిక సమన్వయంతో పనిచేస్తుంది.  8 జాతీయ సంస్థలతో సహా 25 సంస్థలు ఈ ఉచిత సహాయ టెలిఫోన్ సర్వీసు ‌లో పాల్గొంటున్నాయి.  దీనికి 660 మంది  క్లినికల్ / రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు మరియు 668 సైకియాట్రిస్టులు మద్దతు ఇస్తున్నారు.  హెల్ప్ ‌లైన్ ‌లో ఉన్న 13 భాషలు : హిందీ, అస్సామీతమిళంమరాఠీఒడియా, తెలుగు, మళయాళం, గుజరాతీపంజాబీ, కన్నడ, బెంగాలీ, ఉర్దూ మరియు ఇంగ్లీష్.

మానసిక అనారోగ్యం ఒకరి భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.  సహాయం కోరడం అనేది చాలా సానుకూలమైన చర్య, ఇది ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని పొంపొందిస్తుంది.  ప్రారంభ స్క్రీనింగ్, ప్రథమ చికిత్స, మానసిక మద్దతు, బాధ నిర్వహణ, మానసిక క్షేమం, సానుకూల ప్రవర్తనలను ప్రోత్సహించడం, మానసిక సంక్షోభ నిర్వహణ వంటి లక్ష్యాలతో ఈ హెల్ప్‌ లైన్ మానసిక ఆరోగ్య పునరావాస సేవలను అందిస్తుంది.  ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భయాందోళనలు, సర్దుబాటు రుగ్మతలు, మానసిక బాధల అనంతరం ఎదురయ్యే ఒత్తిడి రుగ్మతలు, మాదకద్రవ్య దుర్వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు, మహమ్మారి ప్రేరిత మానసిక సమస్యలు, మరియు మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు సేవ చేయడం దీని లక్ష్యం. వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వేతర సంస్థలు, తల్లిదండ్రుల సంఘాలు, వృత్తిపరమైన సంఘాలు, పునరావాస సంస్థలు, ఆసుపత్రులు లేదా దేశవ్యాప్తంగా మద్దతు అవసరం ఉన్నవారికి 13 భాషలలో 1 వ దశ సలహా, కౌన్సెలింగ్ మరియు రిఫరెన్సు అందించడానికి ఇది లైఫ్ లైన్ గా పనిచేస్తుంది.

ప్రారంభ స్క్రీనింగ్; ప్రథమ చికిత్స; మానసిక మద్దతు; బాధ నిర్వహణ; మానసిక శ్రేయస్సు; విపరీత ప్రవర్తనలను నివారించడం; మానసిక సంక్షోభ నిర్వహణ మరియు మానసిక ఆరోగ్య నిపుణులకు సూచించడం వంటి లక్ష్యాలతో ఈ హెల్ప్ ‌లైన్ సేవలందిస్తుంది.  అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓ.సి.డి); ఆత్మహత్య; నిరాశ; పానిక్ ఎటాక్ (లు) సర్దుబాటు లోపాలు; పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ మరియు పదార్థ దుర్వినియోగంతో పాటు ఆందోళనకు సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఈ హెల్ప్ ‌లైన్ అంకితం చేయబడింది.  బాధలో ఉన్న వ్యక్తులు; మహమ్మారి మానసిక సమస్యలు మరియు మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ప్రేరేపించడం వంటి సేవలను ఈ హెల్ప్‌ లైన్ అందిస్తుంది. 

ఈ హెల్ప్‌ లైన్ సేవలను, బహుళ వైకల్యాలతో ఉన్న వ్యక్తుల జాతీయ సాధికార సంస్థ (ఎన్.‌ఐ.ఈ.పి.ఎం.డి), చెన్నై మరియు జాతీయ మానసిక ఆరోగ్య పునరావాస సంస్థ (ఎన్.‌ఐ.ఎం.హెచ్.‌ఆర్), సెహోర్ సమన్వయం చేస్తున్నాయి.  భారతీయ క్లినికల్ సైకాలజిస్టుల సంఘం  (ఐ.ఎ.సి.పి),  భారతీయ సైకియాట్రిస్టుల సంఘం (ఐ.పి.ఎ) మరియు  భారతీయ సైకియాట్రిక్ సామాజిక కార్యకర్తల సంఘం (ఐ.పి.ఎస్. డబ్ల్యూ.ఏ) సభ్యులు హెల్ప్‌ లైన్ ‌కు వృత్తిపరమైన సహాయాన్ని అందిస్తున్నారు. 

*****



(Release ID: 1652446) Visitor Counter : 372