ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో రికార్డు స్థాయిలో

సుమారు 5 కోట్ల కోవిడ్ పరీక్షలు

గడిచిన 2 వారాల్లోనే 1.33 కోట్లు

Posted On: 07 SEP 2020 6:30PM by PIB Hyderabad

పెద్ద సంఖ్యలో రోజువారీ కోవిడ్ పరీక్షలు జరిపిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం పరీక్షలు జరిపే సామర్థ్యం రోజుకు 11.70 లక్షలు పైబడింది. దీంతో ఇప్పటివరకు దేశంలో పరీక్షించిన కోవిడ్ శాంపిల్స్ దాదాపు ఐదు కోట్లకు  (4,95,51,507) చేరాయి. గడిచిన 24  గంటల్లో 7,20,362  పరీక్షలు జరిగాయి. ఇలాదేశవ్యాప్తంగా పరీక్షల వేగం, విస్తృతి పెంచినకారణంగా గత రెండు వారాల్లోనే 1,33,33,904  పరీక్షలు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అంతర్జాతీయంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగా మెరుగవుతూ వస్తున్నాయి. తగిన సౌకర్యాలు కల్పించటం వలన పరీక్షలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వమ్ ఇచ్చిన సూచన ఫలితంగా మొట్టమొదటిసారిగా అడిగిన వెంటనే పరీక్షలు జరిపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.  ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు పరీక్షల విధి విధానాలను కూడా సరళతరం చేయటం గమనించవచ్చు.

 

రోజువారీ సగటు పరీక్షల సంఖ్య అదే పనిగా పెరుగుతూనే వస్తోంది. ఆగస్టు మూడో వారంలో రోజువారీ సగటు లక్షలు ఉండగా ఈరోజుకు ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారం గడిచేసరికి 10  లక్షలకు చేరింది. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ సకాలంలో బాధితులను గుర్తించటం, దాని ఫలితంగా మెరుగైన చికిత్స అందించటం సాధ్యమవుతున్నాయి. తీవ్ర లక్షణాలున్నవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయటానికి, స్వల్ప లక్షణాలున్నవారిని ఐసొలేషన్ లో ఉంచి చికిత్స పర్యవేక్షించటానికి వీలు కలుగుతోంది. ఈ చర్యల ఫలితంగా వేగంగా కోలుకోవటానికి, మరణాల సంఖ్య కనీస స్థాయికి పరిమితం చేయటానికి మార్గం సుగమమైంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 



(Release ID: 1652108) Visitor Counter : 188