నీతి ఆయోగ్

కొత్త కల్పనలు చేసే అటల్ అంకుర సంస్థలకు సాధికారత కల్పించడం కోసం ఫ్రెష్ వర్క్స్ తో అటల్ వినూత్న కల్పనా కార్యక్రమం (అటల్ ఇన్నోవేషన్ మిషన్ - ఎ ఐ ఎం) భాగస్వామ్యం

Posted On: 07 SEP 2020 2:25PM by PIB Hyderabad

ఇండియాలో కొత్త కల్పనలు చేసే వారికి మరియు పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన మద్దతు ఇవ్వడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్,
నీతి ఆయోగ్, సాఫ్ట్ వేర్ కంపెనీ ఫ్రెష్ వర్క్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.  

ఎ ఐ ఎం పోర్టుఫోలియోలో ఉన్న సంస్థలు మరియు అంకుర సంస్థల సామర్ధ్యం పెంచడంతో పాటు అంకుర సంస్థలలో వినూత్నతకు పాటుపడే వారి  ప్రయత్నాలను, పారిశ్రామికతను  వృద్ధిచేయడం  ఈ భాగస్వామ్యం లక్ష్యం.  

ఈ భాగస్వామయం ద్వారా ఫ్రెష్ వర్క్స్ సంస్థ ఎ ఐ ఎం మరియు దాని పరిధిలో ఉన్న లబ్ధిదారులకు  వారి వారి అవసరాలకు అనుగుణంగా అంకుర సంస్థలు తమ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను నియంత్రణలో ఉంచుకొని సమర్ధవంతంగా పనిచేసే
అధికారం కల్పిస్తుంది.  లబ్ధిదారులకు వివిధ రకాల సాఫ్ట్ వేర్;    ఫ్రెష్ సేల్స్ -  అమ్మకాల సి ఆర్ ఎం సాఫ్ట్ వేర్,  ఫ్రెష్ డెస్క్ - కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్ వేర్,   ఫ్రెష్ చాట్ -  కస్టమర్లకు సందేశాలు పంపే సాఫ్ట్ వేర్ ,  ఫ్రెష్ రిలీజ్ --  అగైల్ ప్రాజెక్ట్ మేనేజిమెంట్ సాఫ్ట్ వేర్,  ఫ్రెష్ కాలర్ -  క్లౌడ్ టెలిఫోనీ సాఫ్ట్ వేర్,   ఫ్రెష్ మార్కెటర్ - మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్,  ఫ్రెష్ టీమ్ -  హెచ్ ఆర్ మేనేజిమెంట్ సాఫ్ట్ వేర్,  ఫ్రెష్ సర్వీస్ --  మరియు ఐ టి సర్వీస్ మేనేజిమెంట్ సాఫ్ట్ వేర్.  

భాగస్వామ్యం గురించి విడుదల చేసిన ప్రకారణ ప్రకారం ఫ్రెష్ వర్క్స్ సంస్థ అంకుర సంస్థలకు చేదోడు వాదోడుగా ఉంటుంది.  
అంటే వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి వీలుగా అమ్మకాలలో, మార్కెటింగ్ లో  మరియు కస్టమర్లు క్లౌడ్ టెక్నాలజీ వినియోగించడంలో మద్దతుగా ఫ్రెష్ వర్క్స్ క్రియాత్మక శిక్షణ ఇస్తుంది.

ఫ్రెష్ వర్క్స్ సంస్థకు నైపుణ్యం ఉన్న రంగాలలో అంకుర సంస్థలను తీర్చిదిద్దడానికి వీలుగా కంపెనీ నిపుణుల చక్షుష లేక భౌతిక సమయాన్ని కేటాయించి శిక్షణ ఇస్తారు.  

ఎఐఎం తో కలసి అధ్యయన గోష్టులు ,  శిక్షణ పర్వాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై వివిధ వెబినార్లు నిర్వహిస్తారు.  

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఐఎం డైరెక్టర్ శ్రీ ఆర్. రమణన్ మాట్లాడుతూ  "మా  ప్రోది సంస్థలకు (ఇన్క్యుబేటర్లు)  మరియు అంకుర వ్యవస్థకు ఇది మహత్తరమైన అవకాశం. తద్వారా వారి వినూత్న కల్పన యాత్ర మరింత సాధికారమవుతుంది.  ఫ్రెష్ వర్క్స్ తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.  ఇది మా లబ్ధిదారులకు ఉత్తేజకరమైన వినూత్న యాత్ర.  దేశవ్యాప్తంగా  అంకుర సంస్థల ప్రపంచం సమర్ధవంతంగా పనిచేయాలన్నదే మా ప్రాధమిక లక్ష్యం"  అన్నారు.  

ఫ్రెష్ వర్క్స్ డైరెక్టర్ (సాంకేతిక భాగస్వామ్యాలు)  రాజీవ్ రమణన్ మాట్లాడుతూ  "సవాళ్లతో కూడిన ప్రస్తుత తరుణంలో ఎస్ ఎం ఈ / ఎం ఎస్ ఎం ఈ సంస్థలకు మరియు అంకుర సంస్థలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి.  వారికి అవసరమైన సాధనాలను మరియు మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా వారు శాశ్వత కస్టమర్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించడానికి మేము ఎదురుచూస్తాము"  అన్నారు.  

చక్షుష కార్యక్రమంలో  ఎఐఎం,  నీతి ఆయోగ్ మరియు ఫ్రెష్ వర్క్స్ అధికారులు;  ఎఐఎం ప్రోది కేంద్రాలు,  అంకుర సంస్థలు, ఎఐఎం మద్దతు ఇచ్చిన స్కూళ్ళ నుంచి, ఉపదేశకులు, దరఖాస్తుదారులు  కూడా హాజరయ్యారు.  

వినియోగదారులకు సేవలందించే అన్ని రకాల వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధార సాఫ్ట్ వేర్ సేవలు అందించే సంస్థ ఫ్రెష్ వర్క్స్ .  కస్టమర్లను సులభంగా,  శాశ్వత ప్రాతిపదికన గెలుచుకోవచ్చు.  ఉపయోగ సౌలభ్యంతో పాటు పెట్టుబడిపై సత్వర రాబడిని ఇస్తుంది.  

***


(Release ID: 1652063) Visitor Counter : 198