రక్షణ మంత్రిత్వ శాఖ
ఇరాన్ రక్షణ శాఖ మంత్రితో భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమావేశం; ఆఫ్ఘాన్ అంశం సహా ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సహకారంపై చర్చలు
Posted On:
06 SEP 2020 1:39PM by PIB Hyderabad
విదేశీ పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఇరాన్ రక్షణ మంత్రి, బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ హతామీతో సమావేశమయ్యారు. తెహ్రాన్‌లో శనివారం ఈ సమావేశం జరిగింది. మాస్కో నుంచి దిల్లీ పయనమైన రాజ్‌నాథ్ సింగ్, ఇరాన్ అభ్యర్థన మేరకు తెహ్రాన్‌లో ఆగి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సహృద్భావ వాతావరణంలో మంత్రులిద్దరి మధ్య చర్చలు జరిగాయి. భారత్-ఇరాన్ మధ్య ప్రాచీన కాలం నుంచి ఉన్న సాంస్కృతిక, భాష పరమైన, నాగరికత బంధాలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వంపై చర్చించారు. ప్రాంతీయ భద్రతపై అభిప్రాయాలను పరస్పరం పంచుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
***
(Release ID: 1651780)
Visitor Counter : 252