ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వ్యాధి విజృంభణ, అత్యధిక కేసులు, ఎక్కువ మరణాలు నమోదవుతున్న 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమావేశాలు
వ్యాధి వ్యాప్తిని అరికట్టి, మరణాలను 1% కన్నా తక్కువకు తీసుకురావడానికి కఠినమైన నియంత్రణ చర్యలు, ఆర్టి-పీసీఆర్ పరీక్ష పూర్తి వినియోగం చేపట్టాలని రాష్ట్రాలకు సూచన
Posted On:
06 SEP 2020 11:34AM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి తీరును సూచించే పథాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వ్యాధి వ్యాప్తి, కేసులు సంఖ్య ఎగబాకుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభావవంతంగా చర్యలు తీసుకునేలా ఆరోగ్య శాఖ నిరంతరం ఆయా ప్రాంతాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, సంక్షోభ నిర్వహణ చర్యలపై అధిక దృష్టి పెట్టింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఆరోగ్య కార్యదర్శులతో కోవిడ్ నిర్వహణపై చర్చించారు. వాటి పరిథిలో ఉన్న 35 జిల్లాల్లో పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించారు.
ఈ 35 జిల్లాలు... పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, 24 దక్షిణ పరగణాలు; మహారాష్ట్రలో పూణే, నాగ్‌పూర్, థానే, ముంబై, ముంబై సబర్బన్, కొల్హాపూర్, సంగ్లి, నాసిక్, అహ్మద్‌నగర్, రాయ్‌గడ్, జల్గావ్, సోలాపూర్, సతారా, పాల్ఘర్, ఔరంగాబాద్, ధూలే, నాందేడ్; గుజరాత్‌లో సూరత్; పుదుచ్చేరిలో పాండిచేరి; జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్; ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలు.
డిజిటల్ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులతో పాటు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ప్రభావిత జిల్లాల ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
కేంద్ర కార్యదర్శి మాట్లాడుతూ, కొమొర్బిడ్ వ్యాధిగ్రస్తులు,వృద్ధ జనాభాపై దృష్టి సారించే క్రియాశీల కేసులులను గుర్తించే విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా అంటు వ్యాధి అణచివేత, అరికట్టడం, చివరికి విచ్ఛిన్నం చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు; ప్రభావిత ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను పునఃపరిశీలించడం, బలోపేతం చేయడం;పాజిటివిటీ రేట్లను 5% కన్నా తక్కువకు తగ్గించడానికి పరీక్ష గతిని పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఈ జిల్లాల్లో కోవిడ్ -19 ప్రస్తుత స్థితిపై రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు సమగ్ర విశ్లేషణ చేశారు. వారు నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘా కార్యకలాపాలు, మరణాల రేట్లు, వారపు కొత్త కేసులు, మరణాల పరంగా పోకడలు మొదలైన అంశాలను సవివరంగా అందించారు. వచ్చే ఒక నెల వరకు వివరణాత్మక రోడ్‌మ్యాప్‌లు, కార్యాచరణ ప్రణాళికలను కూడా వారు చర్చించారు. జిల్లాలో నిర్వహించిన ఆర్టీ-పిసిఆర్, రాపిడ్ యాంటిజెన్ పరీక్షల వివరాలు, యాంటిజెన్ పరీక్షల నుండి రోగలక్షణ నెగటివ్ లను తిరిగి పరీక్షించడం, పరీక్షా ప్రయోగశాల వినియోగం, ఆసుపత్రిలో చేరడం, ఆక్సిజన్ అందుబాటు ఉన్న పడకలు, ఐసియు పడకలు, వెంటిలేటర్ మొదలైన వాటి బెడ్ ఆక్యుపెన్సీల వివరాలను కేంద్రంతో ఆ రాష్ట్రాలు పంచుకున్నాయి.
నిర్దిష్ట ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు / యుటిలకు సూచించారు:
1. కఠినమైన నియంత్రణ చర్యలను అమలు చేయడం, సామాజిక దూర చర్యలను అనుసరించడం ద్వారా సంక్రమణ వ్యాప్తిని పరిమితం చేయడం, కఠినమైన పెరి-మీటర్ నియంత్రణ, ఇంటింటికీ కేసులను చురుకుగా గుర్తించడం.
2. జిల్లాల వ్యాప్తంగా పరీక్షలను పెంచడం ద్వారా సకాలంలో వ్యాధిగ్రస్తులను గుర్తించడం, ఆర్టీ-పీసీఆర్ పరీక్ష సామర్థ్యం ఐచ్ఛిక వినియోగం
3. ఇళ్లల్లో ఐసొలేషన్లలో ఉన్నవారి ప్రభావవంతమైన పర్యవేక్షణ వ్యాధి, వ్యాధి తీవ్రతరం అయితే ముందుగా గుర్తించి ఆస్పత్రులకు తరలించడం
4. వైద్య సహకారం అవసరమయ్యే రోగులకు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా ఆస్పత్రిలో చేర్చడం, ముఖ్యంగా సహ-అనారోగ్య, వృద్ధుల కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ.
5.ఆరోగ్య సంరక్షకులు సంక్రమణ బారిన పడకుండా కాపాడటానికి ఆసుపత్రులలో సమర్థవంతమైన సంక్రమణ నియంత్రణ చర్యలను అనుసరించడం.
6. మహమ్మారిని అంతే కాఠిన్యంతో ఎదుర్కోడానికి తమ ప్రయత్నాలను కొనసాగించడానికి జిల్లా నిర్దిష్ట ప్రణాళికలను సిద్ధం చేసి, నవీకరించే కార్యక్రమం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చేపట్టడం.
*****
(Release ID: 1651766)
Visitor Counter : 228