రైల్వే మంత్రిత్వ శాఖ
ఈనెల 12వ తేదీ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
మే 12వ తేదీ నుంచి నడుస్తున్న 30 రాజధాని తరహా రైళ్లు, జూన్ 1వ తేదీ నుంచి నడుస్తున్న 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లకు ఇవి అదనం
ఈనెల 10వ తేదీ నుంచి టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం
ఇవన్నీ పూర్తిగా రిజర్వేషన్ రైళ్లు
Posted On:
05 SEP 2020 9:48PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోం శాఖతో సంప్రదింపులు జరిపిన రైల్వే మంత్రిత్వ శాఖ, ఈనెల 12వ తేదీ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. క్రింద ఇచ్చిన పట్టికలో పేర్కొన్న ప్రకారం ఈ రైళ్లు నడుస్తాయి. ఇవన్నీ పూర్తిగా రిజర్వేషన్ సీట్లున్న రైళ్లు. టిక్కెట్ల బుకింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది మే 12వ తేదీ నుంచి నడుస్తున్న 30 రాజధాని తరహా రైళ్లు, జూన్ 1వ తేదీ నుంచి నడుస్తున్న 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లకు (మొత్తం 230) ఇవి అదనం.
రైళ్ల రాకపోకల వివరాల పట్టిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 1651763)