ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒక్కరోజులో అత్యధిక రికవరీలను నమోదు చేసిన భారత్
ఒకే రోజులో 70,000 మందికి పైగా కోవిడ్ రోగుల డిశ్చార్జ్
నాలుగింట మూడోవంత దాటేసిన కోవిడ్-19 రికవరిలు
దేశంలో 31,00,000 దాటిన మొత్తం రికవరీల సంఖ్య
Posted On:
05 SEP 2020 6:02PM by PIB Hyderabad
కోవిడ్-19 నియంత్రణకు భారత్ చేపట్టిన టెస్ట్, ట్రాక్ మరియు ట్రీట్ వ్యూహం స్పష్టమైన ఫలితాలను చూపుతోంది. భారత రికవరీ రేటు తాజాగా రికార్డు స్థాయిని తాకింది. తాజాగా ఒకే రోజులో 70000 మందికి పైగా రోగులను కోవిడ్ నుంచి బయటపడ్డారు. ఇది సరికొత్త రికార్డు స్థాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు రికవరీలు 70,072 గా నమోదయ్యాయి. కోవిడ్-19 రోగులు ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో ఆసుపత్రులు, ఇంటి ఐసోలేషన్ నుండి కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం. దీంతో తాజాగా రికవరీ రేటు 77.23 శాతంగా నిలిచింది. మరణాల రేటు నేడు మరింతగా తగ్గి 1.73 శాతానికి చేరింది. టెస్టింగ్ ద్వారా ముందస్తుగా గుర్తించడం రోజువారీ సంఖ్యను నివేదించడానికి ఇది దారితీసింది.
అయితే నిఘా & రోగులతో దగ్గరగా మెదిలిన వారిని గుర్తించడంతో పాటు రోగులను సకాలంలో మరియు తగిన క్లినికల్ ట్రీట్మెంట్ పై దృష్టి పెట్టడంతో వారు త్వరగా కోలుకున్నారు. అధిక సంఖ్యలో రికవరీలుండడం మరియు తగ్గుతున్న మరణాలతో భారతదేశం యొక్క గ్రేడెడ్ స్ట్రాటజీ తగు విధంగా పని చేసినట్లు నిరూపితం అవుతోంది. క్రియాశీల కేసుల (846,395) కన్నా భారతదేశం 22.6 లక్షలకు పైగా రికవరీలను నమోదు చేసింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు మొత్తం సానుకూల కేసులలో 21.04% మాత్రంగానే ఉన్నాయి. మొత్తం రికవరీల సంఖ్య నేడు తాజాగా 31 లక్షలు (31,07,223) దాటింది. మొత్తం రికవరీలలో 60 శాతం మేర ఐదు రాష్ట్రాలలో నమోదు అయ్యాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్యలో మహారాష్ట్ర గరిష్టంగా 21 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత తమిళనాడు (12.63 %), ఆంధ్రప్రదేశ్ (11.91%), కర్ణాటక (8.82%) మరియు ఉత్తర ప్రదేశ్ (6.14%) ఉన్నాయి.
కోవిడ్-19కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు మరియు సలహాదారులకై ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు oMoHFW_INDIA వెబ్‌సైట్లను సందర్శించండి.
కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక సంబంధిత ప్రశ్నలను technquery.covid19[at]gov[dot]in కు మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva కు పంపొచ్చు.
COVID-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) వద్ద కాల్ చేయండి. COVID-19 లోని రాష్ట్రాలు / యుటీల హెల్ప్ లైన్ సంఖ్యల జాబితా కూడా ఈ కింది వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1651667)
Visitor Counter : 225