ఆర్థిక సంఘం
తన ఆర్థిక సలహా మండలితో చర్చలు జరిపిన - పదిహేనవ ఆర్థిక కమిషన్
Posted On:
04 SEP 2020 5:59PM by PIB Hyderabad
పదిహేనవ ఆర్ధిక సంఘం (XV ఎఫ్.సి) తన సలహా మండలి మరియు ఇతర ప్రత్యేక ఆహ్వానితులతో 2020 సెప్టెంబర్ 04వ తేదీన ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించి మరియు కమిషన్ పరిష్కరించాల్సిన వివిధ సమస్యలపై చర్చించింది. XV ఎఫ్.సి. చైర్మన్ శ్రీ ఎన్.కె. సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ధిక సంఘం సభ్యులందరితో పాటు, కమీషన్ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు, ఇతర ఆహ్వానితులుగా హాజరైన - డాక్టర్ అరవింద్ వీరమణి; డాక్టర్ ఇందిరా రాజరామన్; డాక్టర్ డి.కె. శ్రీవాస్తవ; డాక్టర్ ఎమ్. గోవిందరావు; డాక్టర్ సుదీప్తో ముండ్లే; డాక్టర్ ఓంకార్ గోస్వామి; డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్; డాక్టర్ ప్రణబ్ సేన్; డాక్టర్ శంకర్ ఆచార్య - తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొంత మంది విశిష్ట మేధావుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, కమీషన్ రేపు తిరిగి మరో సారి సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశంలో జి.డి.పి. వృద్ధి, కేంద్రం మరియు రాష్ట్రాల పన్ను సరళీకరణ, జి.ఎస్.టి. పరిహారం, ఆర్థిక ఏకీకరణ వంటి సమస్యల గురించి చర్చించారు. మరి కొన్ని నిర్దిష్ట సమస్యలైన - ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయానికి సంబంధించి, పెట్టుబడి పునరుజ్జీవనం, ఆర్థిక వ్యవస్థ యొక్క పునర్వినియోగీకరణ మరియు ప్రభుత్వ ఆర్థిక వనరులపై దాని ప్రభావం, రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి; జి.ఎస్.టి. వసూళ్ళలో అభివృద్ధి చెందుతున్న పోకడలు, జి.ఎస్.టి. సాంకేతిక వేదిక మెరుగుదలతో దానికి గల సంబంధం వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
ఆర్ధిక సంఘం అసాధారణమైన అనిశ్చితుల పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందని సలహా మండలి అభిప్రాయపడింది. రాష్ట్రాలకు పన్ను పంపిణీ, ఇతర బదిలీలు, రుణాలు మరియు ఆర్థిక ఏకీకరణ మార్గం ద్వారా తగ్గిన ఆదాయ వనరుల మధ్య ఖర్చుల వెసులుబాటు పట్ల సూక్ష్మమైన విధానాన్ని అనుసరించాలని సలహా మండలి సూచించింది. ముఖ్యంగా 2021-22 నుండి 2025-26 వరకు ఉన్న 5 సంవత్సరాలను పరిగణలోకి తీసుకునే సందర్భంలో, కమిషన్, సాంప్రదాయేతర విధానాలతో ఆలోచించవలసి ఉంటుందని కూడా, సలహా మండలి సభ్యులు భావించారు. ఆదాయ పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉన్న మిగిలిన నాలుగేళ్లకు భిన్నంగా 2020-21 ఆధార సంవత్సరాన్నీ, 2021-22 మొదటి సంవత్సరాన్నీ చూడాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
త్రైమాసిక అంతర్నిర్మిత పరంగా ప్రస్తుత సంవత్సరంలో జి.డి.పి. వృద్ధి, మరియు తరువాతి సంవత్సరాల్లో వచ్చే వృద్ధి పునరుజ్జీవనంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రారంభ సంవత్సరాల్లో జి.డి.పి. కి సంబంధించి సాధారణ ప్రభుత్వ రుణం బాగా పెరిగే అవకాశం ఉందని సలహా మండలి అభిప్రాయపడింది. అయితే, తరువాతి సంవత్సరాల్లో దానిని తగ్గించడానికి ప్రయత్నించడం దీని ఉద్దేశ్యం. ప్రారంభ సంవత్సరాల్లో, న్యూమరేటర్‌పై పెరిగిన ఆదాయ-వ్యయ అసమతుల్యత మరియు న్యూమరేటర్‌పై జి.డి.పి.పై క్రిందికి ఒత్తిడి కారణంగా, ఈ నిష్పత్తి, ప్రభావితమవుతుంది.
చర్చలు విలువైనవనీ, చేసిన సూచనలను కమిషన్ తన దృష్టికి తీసుకుందనీ, చైర్మన్ పేర్కొన్నారు. పదిహేనవ సంఘం దాని సలహా మండలితో పాటు అంతర్జాతీయంగా, జాతీయంగా నెలకొన్న పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తోందని, ఆయన తెలియజేశారు.
*****
(Release ID: 1651441)