రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
04 SEP 2020 4:56PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ దేశవ్యాప్తంగా గల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఒక సందేశం ఇస్తూ, “దేశవ్యాప్తంగా గల ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆధునిక కాలపు గొప్ప గురువులలో ఒకరు, పూర్వ రాష్ట్రపతి, మహోన్నతులు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మనం ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకుంటాం.
వారు గొప్ప తత్త్వవేత్త. ఉపాధ్యాయుడంటే కేవలం విద్యనేర్పేవారు మాత్రమే కాక,విద్యార్ధులలో నైతికతను నింపి వారికి విలువలను బోధించే మార్గదర్శి అని ఉపాధ్యాయుడి పాత్రను ఆయన నిర్వచించారు.
పరిపూర్ణమైన పట్టుదల , సహనంతో మన ఘనమైన సంస్కృతి ,వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు సహాయం చేస్తారు.ఈ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని చేరుకోవడానికి ఆదర్శ ఉపాధ్యాయులు విద్యార్థులను గట్టిగా ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు మార్గనిర్దేశక శక్తి . వారు మన దేశ నిజమైన నిర్మాతలు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘గురు-శిష్య’ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉండటానికి ఇదే ముఖ్యమైన కారణం.
మన యువ తరాన్నిసర్ద సన్నద్ధం చేయడానికి, వారు నేర్చుకోవడానికి, ఆవిష్కరణలు సాధించడానికి, సమాజానికి మరింత సమర్థవంతంగా వారు సేవలు అందించడానికి సహాయపడే కొత్త బోధనా పద్ధతులు ఎంతైనా అవసరమని మారుతున్న కాలం తెలియజేస్తోంది. ప్రతిభావంతులైన మన ఉపాధ్యాయుల మార్గనిర్దేశంలో మనం మన మహోన్నత దేశ భవిష్యత్తును నిర్మించుకోగలమన్న విశ్వాసం నాకుంది.
ఉపాధ్యాయులందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాగల రోజులలో మన దేశ కీర్తిని పెంపొందించేలా, దేశానికి నాయకత్వం వహించే జ్ఞానవంతులైన విద్యార్ధులను తయారు చేసే కృషిలో వారు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
రాష్ట్రపతి హిందీ సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
*****
(Release ID: 1651387)
Visitor Counter : 246