రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన(పిఎంబిజెపి) పథకం క్రింద జనౌషధి కేంద్రాల ద్వారా విక్రయించేందుకు 8 న్యూట్రాసూటికల్- రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ సదానంద గౌడ

Posted On: 03 SEP 2020 4:48PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా ఉన్న జనౌషధి కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన(పిఎంబిజెపి) పథకం క్రింద రోగ నిరోధక శక్తిని పెంచే 8 రకాల ఉత్పత్తులను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి శ్రీ సదానంద గౌడ ప్రారంభించారు.

 

కొవిడ్-19 విశ్వమహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు క్రొత్త న్యూట్రాసూటికల్స్- రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉత్పత్తుల వాడాల్సిని అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ క్రొత్త ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉత్పత్తులతో పోలిస్తే నాణ్యమైనవి మరియు 26% ధర తక్కువ. పోషక విలువలు కలిగిన అనుబంధకాలు, మాల్ట్ లతో తయారు చేయబడిని పోషకవిలువలు కలిగిన పానీయాలు, రోగ నిరోధక శక్తిని పెంచేవి ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం, అందువలన దేశ వ్యాప్తంగా కలిగిన జనౌషధి కేంద్రాల ద్వారా ఇవి ప్రజలను చేరుతాయని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

 

 

క్ర. సంఖ్య

 

ఉత్పత్తి యొక్క పేరు

 

ప్యాక్ పరిమాణం

పిఎంబిజెపి ఎంఆర్పి(రు.)

మొదటి 3 బ్రాండెడ్ ఉత్పత్తుల సగటు ఎంఆర్పి(రు.)

పొదుపు (శాతంలో)

1

జనౌషధి పోషణ మాల్ట్ తో తయారైన ఉత్పత్తి

1 స్క్రూ మూత కలిగిన ప్లాస్టిక్ జార్ 500గ్రా

175

236

26%

2

జనౌషధి పోషణ కోకాతో తయారు చేసిన మాల్ట్

1 స్క్రూ మూత కలిగిన ప్లాస్టిక్ జార్ 500గ్రా

180

243

26%

3

ప్రొటీన్ పౌడర్(చాకోలేట్)

1 టిన్ను 250 గ్రా

200

380

47%

4

ప్రొటీన్ పౌడర్(వెనిలా)

1 టిన్ను 250 గ్రా

200

380

47%

5

ప్రొటీన్ పౌడర్(కేసర్ పిస్తా)

1 టిన్ను 250 గ్రా

200

380

47%

6

జనౌషధి జనని

1 టిన్ను 250 గ్రా

225

300

25%

7

ప్రొటీన్ బార్

35 gm

40

80

50%

8

జనౌషధి ఇమ్యూనిటీ బార్

10 gm

10

20

50%

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

దేశ వ్యాప్తంగా ఉన్న 6500లకు పైగా ఉన్న జనౌషధి దుకాణాలను సుమారు పది లక్షల మంది పౌరువులు సందర్శించి నాణ్యమైన జనరిక్ మందులను కొంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం క్రింద చక్కెర వ్యాధి, రక్త పోటు, సైకోట్రోపిక్ వంటి వ్యాధులకు మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే స్త్రీల రుతు సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు జనౌషధి కేంద్రాల్లో సువిధ పథకం క్రింద రు.1 కే సానిటరీ న్యాప్కిన్లను అందిస్తున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ఉద్ఘాటించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసారు. ఈ పాడ్లలో ఆక్సో-బయోడిగ్రేడబుల్ తత్వం కలిగిన పర్యావరణ హితమైన పదార్థాలు ఉపయోగించి తయారుచేయమైనది. 2008లో ప్రారంభమైన ఈ దుకాణాల్లో 2016 నాటికి 99 మాత్రమే ఉండగా, ప్రధాని దార్శనికతతో లాజిస్టిక్స్, ఐటి వంటి ప్రారంభ కేంద్రాలను వీటిని సంస్కరించారు. ప్రస్తుతం 734 జిల్లాలకు గాను 732 జిల్లాల్లో 6587 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ స్వతంత్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రధాన మంత్రి దార్శనికతతో జనౌషధి కేంద్రాలను సంస్కరించిన తరువాత జనరిక్ మందుల వినియోగ శాతం బాగా పెరిగిందన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య పరిరక్షణకు రోగనిరోధక శక్తి పెంపొందించుకొనుటకు పోషకాలతో తయారు చేసిన ఈ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జనౌషధి కేంద్రాలను సంస్కరించిన తరువాత నాణ్యమైన జనరిక్ మందుల అమ్మకం, వినియోగం బాగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఫార్మసూటికల్ కార్యదర్శి డా. పి.డి. వాఘేలా కూడా మాట్లాడారు.

పిఎంబిజెపి పథకం క్రింద న్యూట్రాసూటికల్ ఉత్పత్తులు వివరాలు

వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, వైద్యులు, ఫార్మసిస్టులు, వినియోగదారులు మొదలైన వారితో సమావేశాల ఏర్పాటు ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపే విధంగా గత 5 సంవత్సరాలుగా సుమారు రు.21 కోట్లను ఖర్చు చేసి జనరిక్ మందులను ప్రోత్సహిస్తున్నది మంత్రిత్వ శాఖ. ఇందుకు గాను ఈ సంవత్సరం బడ్జెట్లో రు.12.90 కోట్లు మంజూరు చేయబడింది.

ఈ జనరిక్ మందుల దుకాణాలను ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది మంత్రిత్వ శాఖ మరియు వారికి సుమారు రు.2.50లక్షలుగా నున్న ప్రోత్సహకాలను రెట్టింపు చేసి రు.5 లక్షలను అందిస్తున్నది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారికి, మహిళలకు మరియు దివ్యాంగులకు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దుకాణాలను తెరవాలనుకునే ఏ దరఖాస్తుదారునికైనా, హిమాలయాలు కలిగిన రాష్ట్రాల వారికి కూడా దుకాణాల కొరకు రు.2 లక్షల గ్రాంటును సరియైన సమయంలో మంజూరు చేసి వారిని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం.

 



(Release ID: 1651121) Visitor Counter : 261