రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఏప్రిల్‌-ఆగస్టు లక్ష్యాన్ని అధిగమించిన జాతీయ రహదారి నిర్మాణాలు

లక్ష్యం 2771 కి.మీ. కాగా, 3181 కి.మీ. నిర్మాణం

గతేడాది ఇదే సమయంలో లక్ష్యం 1300 కి.మీ. కాగా, 3300 కి.మీ. నిర్మాణం

प्रविष्टि तिथि: 03 SEP 2020 5:17PM by PIB Hyderabad

కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, కరోనా సమయంలోనూ జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు కాలానికి 2771 కి.మీ.లను లక్ష్యంగా పెట్టుకుంటే, 3181 కి.మీ. హైవేల నిర్మాణం జరిగింది. ఇందులో 2104 కి.మీ.లను పీడబ్ల్యూడీలు, 879 కి.మీ.లను ఎన్‌హెచ్‌ఏఐ, 198 కి.మీ.లను ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ నిర్మించాయి.

    ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 3300 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం జరగ్గా, ఇందులో 2167 కి.మీ.లను పీడబ్ల్యూడీలు, 793 కి.మీ.లను ఎన్‌హెచ్‌ఏఐ, 341 కి.మీ.లను ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ నిర్మించాయి. గతేడాది ఇదే సమయానికి నిర్మాణమైన మొత్తం 1367 కి.మీ. ఈ ఏడాది రహదారుల నిర్మాణ మొత్తం, గతేడాది ఇదే సమయానికి నిర్మించిన రహదారుల పొడవులో రెట్టింపు కంటే ఎక్కువ.

    దేశవ్యాప్తంగా 2983 కి.మీ. నిర్మాణానికి ఇప్పటివరకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 1265 కి.మీ.లకు పీడబ్ల్యూడీలకు, 1183 కి.మీ.లకు ఎన్‌హెచ్‌ఏఐకి, 535 కి.మీ.లకు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌కు అనుమతులు ఇచ్చారు.

***


(रिलीज़ आईडी: 1651114) आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Tamil , Malayalam