వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నవతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారత్ దశను మార్చబోతున్నారు: శ్రీ పియూష్ గోయల్

భారతదేశాన్ని నిజమైన సృజనాత్మక ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడానికి కలిసి పనిచేయాలని మంత్రి పిలుపు

నవ తరం పారిశ్రామికవేత్తలకు అనుభవజ్ఞులైన వ్యాపార దిగ్గజాలు మార్గదర్శకులు కావాలని శ్రీ గోయల్ ఉద్బోధ

Posted On: 03 SEP 2020 2:35PM by PIB Hyderabad

ప్రపంచ వ్యాప్త సరఫరా వ్యవస్థకు పెద్ద ఎత్తున భారత్ తన వంతు చేసే సహాయానికి కొత్త తరం ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. సిఐఐ నిర్వహించిన 'భారత ఫ్యూచర్ బిజినెస్ గ్రూప్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. "భారతదేశంలో నవ తరం వాణిజ్య వ్యాపార విధానాలను ప్రోత్సహించడానికి భావసారూప్యం గల దేశాలతో ఒక వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయ భాగస్వాములతో ఈ ప్రయత్నం ప్రారంభించాలి" అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. 

భారత దశను మార్చబోయే యువతే, ఉద్యోగాలు సృష్టించడం,  ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించాలని కేంద్ర మంత్రి అన్నారు. "భారతదేశంలో మనకు పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది,  ఇది మరింతగా మన సామర్థ్యాలను గుర్తించడంతో పాటు  పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి ఉపయోగపడుతుంది" అని ఆయన తెలిపారు. యువకులు చేస్తున్న కొన్ని ఆలోచనలు నిజంగా విప్లవాత్మకమైనవని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. కళాశాలలు వ్యవస్థాపకత లేదా సంబంధిత కొత్త తరహా వ్యాపార అవకాశాలు పెంచే దిశగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. 

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత ర్యాంకు 52 నుండి 48 కి మెరుగుపడటం గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, “భారతదేశాన్ని నిజంగా ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి మనమంతా కలిసి పనిచేద్దాం. భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం. వ్యాపారాన్ని సరళం చేయడానికి కొత్త ఆలోచనలు, ప్రక్రియలతో ముందుకు సాగడానికి పరిశ్రమ స్ఫూర్తి ప్రభుత్వాన్ని మరింత ముందుకు పోయేలా ప్రోత్సహిస్తుందనడంలో నాకు సందేహం లేదు. భూమిపై ఏ శక్తి మన విజయాన్ని ఆపలేవు ” అని అన్నారు. 

రైల్వేలలో కొత్త ఆవిష్కరణల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, గత ఆరేళ్ళు మన కోచ్ తయారీ ఫ్యాక్టరీలు పాత కోచ్ ల తయారీని అపి, మరింత మెరుగైన ఎల్‌హెచ్‌బి కోచ్ లను తయారు చేస్తున్నామని అన్నారు. ఫలితంగా గత 17 నెలల్లో రైల్వే ప్రమాదాల కారణంగా ఈ ఒక్క ప్రయాణీకుడు మరణించలేదని వెల్లడించారు. వినూత్నమైన ఆలోచనలతో నిజమైన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రధాని శ్రీ మోడీ అని శ్రీ గోయల్ అన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెబుతూ, హై-స్పీడ్ రైళ్ల రైల్వే ట్రాక్‌ల వెంబడి ఫెన్సింగ్ ఆవశ్యకత గురించి చర్చిస్తున్నప్పుడు, శ్రీ నరేంద్ర మోడీ రైల్వే ట్రాక్‌ల వెంట సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు వేలం వేయాలని సూచించారు, ఇది తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్, ప్రైవేట్ పెట్టుబడులను తీసుకువస్తుంది. సురక్షితమైన మరియు రైల్వే పర్యావరణకు అనుకూలమైనది అని ప్రధాని సూచించారని శ్రీ గోయల్ వివరించారు. 

వ్యాపార రంగంలో దిగ్గజాలు, అనుభవజ్ఞులైన సీనియర్లు తమ కుటుంబం, తమ బిజినెస్ లోనే కాకుండా, కొత్త తరానికి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. "దీనికి నాణ్యమైన సమయాన్ని కేటాయించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇది నిజంగా యువకులను ప్రోత్సహిస్తుంది ”.అని అన్నారు.  

ఆత్మనిర్భర్ భారత్‌ను దేశం స్వయంగా గ్రహించగల సామర్థ్యాన్ని పెంపొందించుకుందని మంత్రి పేర్కొన్నారు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మన తరఫున బలాన్ని చేకూర్చడమే కాకుండా, స్థితిస్థాపకత గల ప్రపంచ సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామి గా ఉండేలా దోహదం చేస్తుందని అన్నారు. "మనకు లక్షలాది సమస్యలున్నాయి, కానీ అదే సమయంలో, మనకు ఆలోచనలు చేసే కోట్లాది హృద్యాలున్నాయి" అని ప్రధాని ఒకసారి చెప్పారు. మన పరిశ్రమ నిజంగా తెలివైన భారతీయ పారిశ్రామికవేత్త సామర్థ్యాలను, కొత్త తరం వ్యాపారాలను ప్రోత్సహించడానికి సాంప్రదాయ వ్యాపారాలను అధిగమించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి భారతదేశానికి అపారమైన సామర్ధ్యం, శక్తి  ఉంది. ఎవరైనా ఊహించిన దానికంటే వేగంగా మహమ్మారిని అధిగమిస్తాం.” అని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

***


(Release ID: 1651066) Visitor Counter : 192