ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచంలో అతి తక్కువ మరణాల శాతం ఉన్న దేశాల్లో భారత్ కు స్థానం, ప్రస్తుతం1.76%

ఐసియు లోని బాధితుల చికిత్స మీద ఎదురయ్యే ప్రశ్నలు-జవాబులు జారీచేసిన ఆరోగ్యమంత్రిత్వశాఖ

Posted On: 02 SEP 2020 12:35PM by PIB Hyderabad

అనేక దేశాలతో పోల్చుకున్నపుడు భారత్ లో కోవిడ్ మరణాల శాతం చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. అంతర్జాతీయంగా ఈరోజుకు మరణాల శాతం 3.3%  ఉండగా, అదే భారత్ లో మరణాల శాతం 1.76% గా నమోదైంది. ప్రతి పదిలక్షల జనాభాలో మరణాలు మరణాల నమోదు కూడా భారత్ లో చాలా తక్కువగా ఉంది.  అంతర్జాతీయంగా సగటున ప్రతి పదిలక్షలకు 110  మరణాలు ఉండగా భారత్ లో అది 48 గా నమోదైంది. అదే బ్రెజిల్ లో అయితే 12 రెట్లు, యునైటెడ్ కింగ్ డమ్ లో 13 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

 

 

కోవిడ్ చికిత్స, స్పందన విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేవలం కోవిడ్ తీవ్రత తగ్గించటం మీద మాత్రమే దృష్టి సారించకుండా, తీవ్ర లక్షణాలున్న వారికి సరైన చికిత్స అందించటం ద్వారా మరణాలను బాగా తగ్గించగలిగారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన కృషి ఫలితంగా దేసవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా బాగా మెరుగుపడ్దాయి. 1578 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యసదుపాయం అందిస్తున్నాయి. చికిత్స లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా కేంద్ర ప్రభుత్వం జారీచేసింది.

 

తగిన చికిత్స అందించటం ద్వారా మరణాలు తగ్గించటానికి వీలుగా ఐసియు డాక్టర్ల సామర్థ్యం పెంచటానికి ఎయిమ్స్ కు చెందిన ఐసియు డాక్టర్లు ప్రత్యేక కృషి చేశారు. వారానికి రెండు సార్లు, మంగళ శుక్రవారాల్లో టెలీ-వీడియో కన్సల్టేషన్ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాలలో పేరుమొసిన డాక్టర్లు తమ సలహాలు, సూచనలు అందించేలా ఈ కన్సల్టేషన్లు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.2020 జులై  8న ఈ సెషన్లు ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు 17 టెలీ సెషన్లు నడవగా మొత్తం 204 సంస్థలు పాల్గొన్నాయి.

క్లిష్టంగా ఉన్న బాధితులకు చికిత్స అందించటంలో డాక్టర్ల సామర్థ్యాన్ని,  చికిత్సా నైపుణ్యాన్ని బాగా పెంచటం కోసం న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ ఆరోగ్య మంత్రిత్వశాఖతో కలిసి కొన్ని తరచూ అడిగే ప్రశ్నలూ, జవాబులూ రూపొందించింది. వాటిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ క్రింది చిరునామాలో వాటిని చూడవచ్చు.

https://www.mohfw.gov.in/pdf/AIIMSeICUsFAQs01SEP.pdf

తరచు ఎదురయ్యే ప్రశ్నలు నిజానికి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అనుభవం, తీవ్ర లక్షణాలున్న కోవిడ్ బాధితులకు ఐసియు లో  చికిత్స అందిస్తున్న  సమయంలో సమకూరే అదనపు జ్ఞానం వలన ఎప్పటికప్పుడు అదనపు ప్రశ్నలు, జవాబులు వచ్చి చేరుతూ ఉంటాయి. చికిత్స చేసే డాక్టర్లకు కూడా కొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉండే కొద్దీ జవాబులిస్తూ ఉంటారు. అందువలన ఈ డాక్యుమెంట్లో  కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వచ్చి చేరుతుంటాయి. 

కోవిడ్ మీద తరచు ఎదురయ్యే ప్రశ్నలకు ఎయిమ్స్  ఈ-ఐసియు అందించిన  సమాధానాలు

1. వైద్య పరిరక్షణ సిబ్బందికి రోగనిరోధకంగా హెచ్ సి క్యూ వాడవచ్చునా?

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ( హెచ్ సి క్యూ) అనేది వైద్య సిబ్బందికి, అత్యధిక రిస్క్ ఉన్న వారికి  రోగనిరోధకంగా వాడవచ్చునని సూచిస్తున్నాం.  అయితే, పిపిఇ కిట్ ను సరైన పద్ధతిలో వాడుతూ కోవిడ్ బారిన పడకుండా మిగతా ఇన్ఫెక్షన్ నివారణ పద్ధతులు పాటిస్తూ దీన్ని వాడవచ్చు.

2. కోవిడ్ బాధితులకు ఐవర్ మెక్టిన్ వాడవచ్చునా?

ఐవర్ మెక్టిన్ ను సార్స్ కోవ్2 లో తగిన నిరోధకంగా పనిచేస్తున్నట్టు తేలింది. కానీ ఆ ప్రభావం కనబడేట్టు చేయటానికి అవసరమైన డోస్ మామూలు డోస్ కంటే చాలా ఎక్కువ. అందుకే దీన్ని జాతీయ మార్గదర్శకాలలో పొందుపరచలేదు. అయితే, హెచ్ సి క్యూ వలన ఎలాంటి దుష్ఫలితాలూ లేనివాళ్ళకు ఇది వాడవచ్చు.

3. డిశ్చార్జ్ అయిన తరువాత యాంటీ కొయాగ్యులేషన్ వాడకం కొనసాగించాలా?

కోవిడ్ అనంతర త్రోంబోటిక్ సమస్యలేవీ వచ్చినట్టు మా అనుభవంలోకి రాలేదు. నిజానికి వైరస తగ్గిపోయి బాధితుణ్ణి డిశ్చార్జ్ చేసిన తరువాత త్రోమ్బోటిఉక్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల సాధారణ పరిస్థితుల్లో డిశ్చార్జ్ అయిన కోవిడ్ బాధితులకు యాంటీ కొయాగ్యులేషన్ మందులు సిఫార్సు చెయ్యం. కాకపోతే డివిటి, ప్రోస్థెటిక్ వాల్వ్ లాంటి కారణాలుంటే అది వేరే విషయం.

4. కోవిడ్ లో ఆకస్మిక మరణాల సంగతేంటి?

ఎమర్జెన్సీ విభాగానికి పంపేటప్పుడు లేదా ఆస్పత్రిలో ఉన్నప్పుడు గాని ఆకస్మిక మరణాలు నమోదవుతూ ఉన్నాయి. అందులో ప్రధాన కారణం గుండె ఆగిపోవటమేనని తేలింది. దానికి ముందే ఎవరికీ తెలియకుండా హైపోక్సియాకు గురవటం కూడా ఉండవచ్చు. లేదా పల్మొనరీఎ త్రాంబోఎంబాలిజం లాంటి త్రోంబోటిక్ సమస్య కూడా కారణం కావచ్చు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలవంటివి ఉన్నవారిని,  తీవ్రమైన కోవిడ్ వచ్చే అవకాశమున్న బాధితులను క్రమం తప్పకుందా వారి సంతృప్త స్థాయి వరకూ జాగ్రత్తగా సమీక్షించాలి. తోడు లేకుండా వారిని ఎక్కడికీ కదలనివ్వకూడదు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా  రిస్క్ తో కూడుకున్నవాళ్లకు,  యాంటీ కొయాగ్యులెంట్ వాడాలి.

5. మిథైల్ ప్రెడ్ని సొలోన్ వర్సెస్ డెక్సామిథాసోన్

ఒక మోస్తరు  లక్షణాలు మొదలుకొని తీవ్ర లక్షణాలున్న కోవిడ్ బాధితులవరకు ప్రస్తుతం కార్టికో స్టెరాయిడ్స్ వాడుతున్నారు.  కోలుకునే వారికి ప్రయోగాత్మకంగా డెల్సామెథాసోన్ వాడుతున్నారు. అయితే, ఐవి డెక్సామెథాసోన్ లేదా మిథైల్ ప్రెడ్నిసోలోన్ రెండూ  వాటి అందుబాటును బట్టి వాడవచ్చు.

6. టొసైలిజుమాబ్ పాత్ర ఏంటి?

ఇప్పుడున్న వ్యాధి తీవ్రత నేఒపథ్యంలో మానవతా దృక్పథంతో  టొసైలిజుమాబ్  వాడకానికి డిసిజిఐ ఆమోదం తెలియజేసింది.  అయితే, ఇది ప్రయోగాత్మకమైన థెరపీ మాత్రమే. దీని పాత్ర చాలా పరిమితం. ఇన్ఫెక్షన్లు చురుగ్గా లేవని నిర్థారించుకున్నమీదట సైటీకైన్ సిండ్రోమ్ కనబడిన బాధితులలో మాత్రమే ఇది వాడాలి. .

7. ప్లాస్మా థెరపీ పాత్ర ఏంటి ?

స్వస్థత చేకూరిన దాతల నుంచి సేకరించిన ప్లాస్మాలో ఉన్నతస్థాయి తటస్థీకరణ సామర్థ్యం ఉన్నప్పుడు తీవ్రమైన కోవిడ్ లక్షణాలున్న బాధితులు వారి కి వ్యాధి తొలైదశలోనే ఉన్నప్పుడు ఇవ్వవచ్చు. అయితే, ఇది ప్రయ్తోగాత్మక థెరపీ మాత్రమే అనే విషయం గుర్తుంచుకొని జాగ్రత్తగా వాడాలి. .

8. ఫ్లావి పిరవిర్ పాత్ర ఏంటి ? 

పెద్దగా లక్షణాలు కనబడని లేదా స్వల్ప లక్షణాలున్నవారిలోనే  అధ్యయనం కోసం ఫ్లావి పిరవిర్ వాడారు. ఇది వ్యాధి వృద్ధిని నివారించటానికి మాత్రమే వాడినట్టు చెప్పారు. అందువల్ల ఇది ఎక్కువమందిలో ఒక సహాయకంగా మాత్రమే వాడారు, వాళ్లకు సహజంగానే ఎలాంటి నిర్దిష్టమైన థెరపీ అక్కర్లేదు. ఫ్లావి పిరవిర్ పాత్రని నిర్థారించే ఆధారాలేమీలేవు. అందువలన జాతీయ మార్గదర్శకాలప్రకారం దీనిని సిఫార్సు చేయటం లేదు.

9. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ నివారణలో యాంటీ ఫైబ్రాటిక్ పాత్ర

కోవిడ్ సంబంధమైన ఫైబ్రోసిస్ నివారణకు పిర్ఫెనిడోన్ లాంటి యాంటీ ఫైబ్రోటిక్ ఏజెంట్ల వాడకాన్ని సమర్థించే ఆధారాలేవీ లేవు. 

10. కోవిడ్ 19 బాధితులలో డిప్రెషన్ ను నివారించటమెలా?

కోవిడ్ బాధితులలో డిప్రెషన్ అనేది సాధారణంగా కనిపించే లక్షణం. దానికి అనేక కారణాలుండవచ్చు. ఒంటరిగా ఉండాల్సి రావటం, వ్యాధి పట్ల సహజంగా ఉండే ఆందోళన, సామాజికంగా ఉండే ప్రతికూల అభిప్రాయం లాంటివి కొన్ని మాత్రమే. అలాంటివారికి పట్ల సానుభూతి అవసరం. వారికి సుశిక్షితులైన మానసిక నిపుణుల కౌన్సిలింగ్ తో మానసిక ధైర్యం ఇప్పించాలి.

11. ఒక వ్యక్తికి అన్ని కోవిడ్ పరీక్షలలోనూ నెగటివ్ అని ఫలితం వచ్చినప్పటికీ బాగా అనుమానించదగినప్పుడు మనం రెమెడిసివిర్ /టిసిజెడ్ ఇవ్వవచ్చునా? 

రెమిడిసివిర్/టిసిజెడ్ అనేవి ప్రయోగాత్మక చికిత్సలు. ఇప్పుడున్న సంక్షోభం కారణంగా డిసిజిఐ  ఆమోదం తెలియజేసింది. అందువలన అనుమానితుల విషయంలో దీన్ని చికిత్సగా వాడకూడదు. చికిత్సపరంగా కోవిడ్ బాధితులుగా నిర్థారణ అయిన వారికి మాత్రమే వీటిని వాడాలి.

12.మెథిలీన్ బ్లూ వాడిచూడవచ్చునా? 

వద్దు. కోవిడ్ చికిత్సలో మెథిలీన్ బ్లూ కు ఎలాంటి పాత్రా లేదు.

13. మనం ఎంతకాలం రెమిడిసెవర్ వాడవచ్చు?

రెమిడిసెవర్ రోజుకు ఒకసారి చొప్పున ఐదు రోజులపాటు వాడవలసిందిగా ప్రస్తుతం సూచిస్తున్నాం.

14. దీర్ఘకాల వ్యాధులతోబాధపడుతూ కోవిడ్ లక్షణాలు పైకి కనబడని వారికి రెమిడిసెవర్, /టిసిజెడ్ రోగనిరోధకంగా వాడవచ్చునా?

దీర్ఘకాల వ్యాధులతోబాధపడుతూ కోవిడ్ లక్షణాలు పైకి కనబడని వారికి రెనిడిసెవర్, /టిసిజెడ్ వాడకాన్ని సమర్థించే సాక్ష్యాధారాలు ఏవీ లేవు.

15. వార్డులలో చేర్పించిన కోవిడ్ బాధితులను వాళ్ళ బంధువు చూడటానికి వెళ్ళవచ్చునా?

లేదు. కోవిడ్ బాధితులను చూదటానికి వాళ్ళ బంధువులను అనుమతించరు. ఎందుకంటే వాళ్ళకు వ్యాధి సంక్రమించవచ్చు, వాళ్లద్వారా మరికొందరికి కూడా సంక్రమించవచ్చు.

16.  పిల్లలు కోవిడ్ బాధితులుగా నిర్థారణ అయితే వాళ్లవెంట తల్లిదండ్రులను ఉండనిస్తారా?

అందులో ఉన్న రిస్క్ గురించి తల్లిదండ్రులకు వివరించిన తరువాత వాళ్ళ అనుమతితో ఉండనివ్వవచ్చు.

 17. డిశ్చార్జ్ అయ్యాక కూడా స్టెరాయిడ్స్ కొనసాగించాలా?

లేదు. డిశ్చార్జ్ అప్పుడు స్టెరాయిడ్స్ అవసరమే లేదు. మరేదైనా ఇతర సమస్య కోసం వాడాల్సిన అవసరమొస్తే తప్ప స్టెరాయిడ్స్ వాడవద్దు.

18.వెంటిలేషన్ లో ఉన్న పేషెంట్ కు పోషకాహారం అందేలా చూడటం ఎలా?

వెంటిలేటర్ మీద ఉన్న బాధితునికి వాళ్ళ సమస్యను బట్టి టిపిఎన్ లేదా రైల్ ట్యూబ్ ద్వారా పోషణ అవసరమవుతుంది.

19.ఎన్ ఐ వి నుంచి ఎప్పుడు ఇన్ వేజివ్ వెంటిలేషన్ కు ఎప్పుడు తరలించాలి?

ఒకవేళ బాధితుడు సంతృప్త స్థాయి కొనసాగించలేకపోతే, శ్వాస పరంగా అలసటకు లోనవుతూ ఉన్నప్పుడు,  లేదా ఎన్ ఐ వి ని జిసిఎస్ భరించలేనంత తక్కువగా ఉన్నప్పుడు  అలాంటి బాధితుణ్ణి ఇన్ వేజివ్ వెంటిలేషన్ కు తరలించే విషయం ఆలోచించాలి.

20. ట్రాకియోస్టమీ ఉపయోగించే విషయం ఎప్పుడు పరిశీలించాలి

వెంటిలేషన్ సుదీర్ఘ కాలం అవసరమనిపించిన బాధితులలో ట్రాకియోస్టమీ గురించి ఆలోచించాలి. 

***

 

 


(Release ID: 1650830) Visitor Counter : 254