హోం మంత్రిత్వ శాఖ

శ్రీ నారాయ‌ణ ‌గురూ జీ జ‌యంతి సంద‌ర్భంగా ఈరోజు ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా

“ సంఘ‌సంస్క‌ర్త‌గా , ఆథ్యాత్మిక నాయ‌కుడిగా , స‌మాన‌త్వం, సోద‌ర‌భావానికి బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారులైన స్వామి శ్రీ నారాయ‌ణ గురు కేర‌ళ‌లో వివ‌క్ష‌, అన్యాయానికి వ్య‌తిరేకంగా సామాజిక సంస్క‌ర‌ణ‌కు బ‌ల‌మైన పునాది వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు”

“ స్వామి శ్రీ నారాయ‌ణ గురూ జీ అణ‌గారిన ‌వ‌ర్గాల‌కు సాధికార‌త క‌ల్పించ‌డం , వారికి విద్య‌ను అందించ‌డానికి జ‌రిపిన నిరంత‌ర కృషిని ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని” అన్నారు.

“ స్వామి శ్రీ నారాయ‌ణ గురూజీ తాత్విక‌త‌, బోధ‌లు, ఆలోచ‌న‌లు దేశవ్యాప్తంగా ల‌క్ష‌లాదిమంది జీవితాల‌ను సుసంప‌న్నం చేస్తూనేఉంటాయి”

Posted On: 02 SEP 2020 2:05PM by PIB Hyderabad

  కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా ఈరోజు శ్రీ‌నారాయ‌ణ గురూజీ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ, “ సంఘ‌సంస్క‌ర్త‌గా , ఆథ్యాత్మిక నాయ‌కుడిగా , స‌మాన‌త్వం, సోద‌ర‌భావానికి బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారులైన స్వామి శ్రీ నారాయ‌ణ గురు కేర‌ళ‌లో వివ‌క్ష‌, అన్యాయానికి వ్య‌తిరేకంగా సామాజిక సంస్క‌ర‌ణ‌కు బ‌ల‌మైన పునాది వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు” అని ఆయ‌న పేర్కొన్నారు..
 స్వామి శ్రీ నారాయ‌ణ గురూ జీ అణ‌గారిన ‌వ‌ర్గాల‌కు సాధికార‌త క‌ల్పించ‌డం , వారికి విద్య‌ను అందించ‌డానికి జ‌రిపిన నిరంత‌ర కృషిని ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని అన్నారు.
స్వామి శ్రీ నారాయ‌ణ గురూజీ తాత్విక‌త‌, బోధ‌లు, ఆలోచ‌న‌లు దేశవ్యాప్తంగా ల‌క్ష‌లాదిమంది  జీవితాల‌ను సుసంప‌న్నం చేస్తూనేఉంటాయి అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

***

 



(Release ID: 1650629) Visitor Counter : 194