ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్ఐఎస్ పిఎఫ్ మూడో వార్షిక నాయకత్వ శిఖర సమ్మేళనం లో రేపటి రోజు న ప్రత్యేక కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 SEP 2020 10:57AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యుఎస్ఐఎస్ పిఎఫ్ మూడో వార్షిక నాయకత్వ శిఖర సమ్మేళనం లో ప్రత్యేక కీలకోపన్యాసాన్ని రేపటి రోజు న, అనగా 2020 వ సంవత్సరం  సెప్టెంబర్ 3 వ తేదీ నాడు, భారత కాల మానం ప్రకారం రాత్రి 9 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఇవ్వనున్నారు.

యుఎస్- ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ఫోరమ్ (యుఎస్ఐఎస్ పిఎఫ్) అనేది ఒక లాభాపేక్షరహిత సంస్థ.  ఆ సంస్థ యు.ఎస్. కు మరియు భారతదేశానికి మధ్య భాగస్వామ్యం కోసం కృషి చేస్తోంది.

ఆగస్టు 31 వ తేదీ నాడు ప్రారంభమైన 5 రోజు ల శిఖర సమ్మేళనాని కి ‘‘యుఎస్- ఇండియా నావిగేటింగ్ న్యూ చాలింజెస్’’ అనే అంశాన్ని ఇతివృత్తం గా తీసుకోవడమైంది.

ఈ ఇతివృత్తం పరిధి లో గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఎదగడం లో భారతదేశానికి గల సంభవనీయత, భారతదేశం యొక్క గ్యాస్ మార్కెట్ లో ఉన్న అవకాశాలు, భారతదేశం లో ఎఫ్ డిఐ ని ఆకర్షించడం కోసం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, సాంకేతిక రంగం లోని ఉమ్మడి అవకాశాలు- సవాళ్లు, ఇండో- పసిఫిక్ సంబంధిత ఆర్థిక అంశాలు, ప్రజారోగ్య రంగం లో మరియు ఇతర రంగాల లో నూతన ఆవిష్కరణ లు వంటి వివిధ విషయాలు చేరి ఉన్నాయి.  

ఈ వర్చువల్ సమిట్ లో కేంద్ర మంత్రులు, ఇంకా సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకొంటున్నారు. 
 

***



(Release ID: 1650583) Visitor Counter : 220