రైల్వే మంత్రిత్వ శాఖ

సరుకు రవాణా లోడింగ్‌లో మిషన్ మోడ్‌న‌ దూసుకుపోతున్న భార‌తీయ రైల్వే

- గ‌త‌ ఆగస్టు నెలలో సరుకు రవాణా లోడింగ్‌లో రికార్డు.. గ‌త ఏడాది ఇదే మాసంలో కంటే అధికంగా సరుకు రవాణా లోడింగ్

- 2020 ఆగస్టు నెలలో భారతీయ రైల్వే లోడింగ్ 94.33 మిలియన్ టన్నులు, గ‌త సంవ‌త్స‌రం అదే నెలతో పోలిస్తే 3.31 మిలియన్ టన్నులు ఎక్కువ

- సరుకు రవాణాను చాలా ఆకర్షణీయంగా మార్చడానికి భారతీయ రైల్వేలో ప‌లు రాయితీలు / తగ్గింపు

Posted On: 01 SEP 2020 2:53PM by PIB Hyderabad

మిషన్ మోడ్‌లో, సరుకు రవాణాను ముందుకు తీసుకుపోవ‌డంలో భారతీయ రైల్వే ముఖ్యమైన మైలురాయిని అధిగ‌మించింది. గ‌త ఏడాది ఆగ‌స్టు మాసం స‌రుకు ర‌వాణా లోడింగ్ కంటే కూడా.. ఈ ఏడాది (2020) ఆగ‌స్టు మాసంలో రైల్వే శాఖ అధిక స‌రుకు ర‌వాణా లోడింగ్‌ను చేప‌ట్టింది. 2020 ఆగస్టు నెలలో భారత రైల్వే స‌రుకు ర‌వాణా లోడింగ్ 94.33 మిలియన్ టన్నులుగా నిలిచింది. గ‌త ఏడాది ఇదే నెల‌లో స‌రుకు ర‌వాణా లోడింగ్ 91.02 మిలియ‌న్ ట‌న్నులుగా న‌మోదు అయింది. అంటే ఈ ఏడాది ఆగ‌స్టులో 3.31 మిలియ‌న్ ట‌న్నులు అధికంగా భార‌తీయ రైల్వే స‌రుకు ర‌వాణా లోడింగ్‌ను చేప‌ట్టింది. 2020 ఆగస్టు నెలలో భారత రైల్వే స‌రుకు ర‌వాణా లోడింగ్ 94.33 మిలియన్ టన్నులు కాగా .. ఇందులో బొగ్గు ర‌వాణా 40.49 మిలియ‌న్ ట‌న్నులుగాను.. ఇనుప‌ ఖ‌నిజం లోడింగ్‌ 12.46 మిలియ‌న్ ట‌న్నులుగాను.. ఆహార ధాన్యాలు 6.24 మిలియ‌న్ ట‌న్నులుగాను.. ఎరువులు 5.32 మిలియ‌న్ ట‌న్నులుగాను, సిమెంట్ (క్లింక‌ర్ కాకుండా) 4.63 మిలియ‌న్ ట‌న్నులు గాను.. మిన‌ర‌ల్ ఆయిల్స్ 3.2 మిలియ‌న్ ట‌న్నులుగాను నిలిచాయి. దీంతో సరుకు రవాణా కదలికలలో మెరుగుదలలు సంస్థాగతీకరించబడతాయి మరియు రాబోయే సున్నా ఆధారిత సమయ పట్టికలో చేర్చబడతాయి. రైల్వేలో సరుకు రవాణాను చాలా ఆకర్షణీయంగా మార్చడానికి భారతీయ రైల్వేలో కూడా అనేక రాయితీలు / తగ్గింపులు ఇవ్వడం విశేషం. స‌ర్వ‌తోముఖంగా సామ‌ర్థ్యాల‌ను మరియు ప్రదర్శనలను మెరుగుపరచడానికి కోవిడ్- 19 ప‌రిస్థితుల‌ను భార‌తీయ రైల్వే మెరుగ్గా ఉపయోగించుకుంటోంది.
                             

 *****


(Release ID: 1650475) Visitor Counter : 186