వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సప్లయ్ చెయిన్ స్థితిస్థాపన మీద ఆస్ట్రేలియా, భారత్, జపాన్ మంత్రుల సమావేశం
స్వేచ్ఛ, నిజాయితీ, వివక్షరహిత, పారదర్శక,
స్థిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణానికి మద్దతు
భారత్-పసిఫిక్ ప్రాంతంలో విశ్వాసపూరితమైన, ఆధారపడదగిన సప్లయ్ చెయిన్ ను
భారత్ హృదయపూర్వకంగా ఆమోదిస్తుందన్న పీయూష్ గోయల్
కోవిడ్ సంక్షోభంలో కీలకమైన వైద్య ఉత్పత్తుల సరఫరాతో విశ్వసనీయమైన,
నమ్మదగిన భాగస్వామిగా భారత్ చాటుకుంది: పీయూష్ గోయల్
Posted On:
01 SEP 2020 2:51PM by PIB Hyderabad
ఈరోజు జరిగిన మంత్రిత్వ స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వర్తక, పర్యాటక, పెట్టుబడుల సెనేటర్ శ్రీ సైమన్ బర్మింగ్ హామ్, జపాన్ ఆర్థిక, వర్తక, పరిశ్రమ శాఖలమంత్రి శ్రీ కజియామా హిరోషి పాల్గొన్నారు.
స్వేచ్ఛ, నిజాయితీ, వివక్షరహిత, పారదర్శక, స్థిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణానికి మద్దతునిస్తూ తమ మార్కెట్లను అందుబాటులో ఉంచుతూ మూమ్దుకు సాగాలనే పట్టుదలతో ఉన్నట్టు మంత్రులు పునరుద్ఘాటించారు. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలోను, అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక, సాంకేతిక మార్పులను దృష్టిలో ఉంచుకొని భారత్-పసిఫిక్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మార్పులతో సప్లయ్ చెయిన్స్ లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
ఈ విషయంలో ప్రాంతీయ సహకారం అవసరం తప్పనిసరి అని మంత్రులు అభిప్రాయపడ్దారు. అందుకే కొత్త ప్రయత్నాలలో లక్ష్య సాధన కోసం ఉమ్మడిగా సహకరించుకుంటూ ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలన్నిటినీ ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి చేయాలని వారు తమ అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో వ్యాపార, విద్యారంగాలు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రులు అభిప్రాయపడ్దారు. ఈ అభిప్రాయాలతో ఏకీభవించే ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మంత్రులు కూడా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
శ్రీ పీయూష్ గోయల్ ఈ త్రైపాక్షిక సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్ అనంతర సమయం ఈ సమావేశానికి ఎంతగానో అనుకూలమైనదిగా అభివర్ణించారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో సరఫరాలు, పంపిణీ మీద మరోసారి పునస్సమీక్షించుకోవటానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఇప్పుడే అందరూ తగిన వ్యూహంతో ముందుకు నడవాల్సి ఉందన్నారు. సప్లయ్ చెయిన్స్ లో భారత్ కీలకపాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవలే మే నెలలో గౌరవ భారత ప్రధానమంత్రి నొక్కి చెప్పటాన్ని గోఈయల్ ప్రస్తావించారు.
ఇలా చొరవ తీసుకోవటంలోనే భారత్ తాను హృదయపూర్వకంగా ఒక విశ్వసనీయమైన, ఆధారపడదగిన సప్లయ్ చెయిన్ కోసం భారత్-పసిఫిక్ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు నిరూపించుకున్నదన్నారు. ముడి సరకు ధరలో హెచ్చుతగ్గులను కట్టడి చేయటం అందులో ఇమిడి ఉన్న రిస్క్ అని, వైవిధ్య భరితమైన సప్లయ్ చెయిన్ లో ఇది అత్యంత కీలకమని చెప్పారు. దీర్ఘకాంలో అందుబాటులో ఉండేలా సప్లయ్ నెట్ వర్క్ ను రూపొందించటానికి చొరవ తీసుకుంటామని హామీఇచ్చారు.
వివిధ రంగాల మధ్య పోటీని మెరుగుపరచటానికి కూడా ఈ చొరవలు తగిన చర్యలు తీసుకుంటాయని మంత్రి అన్నారు. ఇందుకోసం స్వదేశంలో విలువ జోడించగల తయారీ, సేవా రంగాలను గుర్తించాల్సి ఉందన్నారు. వర్తక, పెట్టుబడులకు సంబంధించిన సప్లయ్ చెయిన్స్ కు మార్పులను తట్టుకోగలిగే శక్తిని పెంచటం కోసం ఉత్పత్తులను వైవిధ్యంగా ఉండేట్టు చూడాలన్నారు. వర్తక విధానాలను డిజిటైజ్ చేయటం వర్తకానికి చాలా ముఖ్యమని చెబుతూ, దీనివలన సప్లయ్ చెయిన్ ను సమర్థంగా నిర్వహించగలమన్నారు. అనేక నియమ్త్రణ సమ్స్థలు భౌతికంగా పనిచేయలేకపోయినా అన్ని పనులూ నిరాటంకంగా సాగిన కోవిడ్ సంక్షోభ సమయమే ఇందుకు ఉదాహరణగా శ్రీ గోయల్ అభివర్ణించారు. మన సామర్థ్యానికి తగినట్టుగా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల వినియోగాన్ని ఇదే వేగంతో నిర్వహించాలని సూచించారు.
ఆసక్తి ఉన్న దేశాలు పాల్గొనటం గురించి మాట్లాడుతూ, ఇదే ఆలోచనాధోరణితో ఆధారపడదగిన, విశ్వసనీయత ప్రదర్శించే ఈ ప్రాంతపు దేశాల వైపు చూడాలని. సుస్థిరమైన సరఫరాలు కొనసాగించటానికి మొగ్గు చూపేవారిని కలుపుకుపోవాలని సూచించారు. అయితే మార్కెట్ కోణంలో విధాన రూపకల్పన, ఎదుగుదల అవకాశాలు, ఆర్థిక స్థితిగతులు, ప్రస్తుత ఋణభారం, నైసర్గిక రాజకీయ వ్యూహం వంటివి కీలక అంశాలుగా పరిగణించాలని కూడాకోరారు.
ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్ అత్యంత కీలకమైన దేశాలుగా అభివర్ణిస్తూ, 2019లో మొత్తం స్థూల జాతీయోత్పత్తి 9.3 ట్రిలియన్ డాలర్లు ఉండగా మొత్తం వ్యాపారం జరిగిన వస్తువులు 2.7 ట్రిలియన్ డాలర్లు, సేవలు 0.9 ట్రిలియన్ డాలర్లు నమోదయ్యాయన్నారు. అంతటి బలమైన పునాది ఉండగా ఈ అవకాశాన్ని మనం వాడుకుంటూ ఈ ప్రాంతంలోని వ్యాపారంలో, పెట్టుబడిలో మన వాటా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, జపాన్ తో కొన్ని నిర్దిష్టమైన వస్తువుల వ్యాపారానికి భారత్ తో సానుకూలమైన దిగుమతి సుంకాలు వర్తిసున్నాయని గుర్తు చేశారు. పైగా భారత్ నుంచి సేకరణ చాలా పరిమితంగా ఉందన్నారు. ఇది ఉక్కు, సముద్ర ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారోత్పత్తులు, వ్యవసాయ రసాయనాలు, ప్లాస్టిక్స్, తివాచీలు, బట్టలు, పాదరక్షలు తదితరాలలో నడుస్తోందని చెప్పారు. ఇప్పుడు ప్రతిపాదించిన చర్యలవలన పరస్పర వర్తకం మరింత పుంజుకుంటుందని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక విస్ద్తరణ గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం స్వయం సమృద్ధి మీద దృష్టి సారించటాన్ని గుర్తు చేశారు. ఈ విధానం వల్ల భారత్ ఆర్థికంగా పరిపుష్టమవుతుందనిమ్ సప్లయ్ చెయిన్ లో మరింత బలమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. వసుధైక కుటుంబ భావనతో ఉండే భారతదేశం, కోవిడ్ సంక్షోభ సమయంలో కీలకమైన ఔషధాల ఎగుమతి ద్వారా అందరికీ సమభావంతో పంపిణీ జరగాలన్న సిద్ధాంతానికి కట్టుబడిందన్నారు. ఈ చర్యలన్నీ భారతదేసపు విశ్వసనీయతను, ఆధారపడదగిన స్వభావాన్ని సూచించాయన్నారు. ఇప్పుడు తలపెట్టిన కార్యాచరణకు ఇది కూడా ఒక కొలమానంగా ఉందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్ట్రేలియా, జపాన్ ఇందులో కీలక భాగస్వాములుగా ఉంటాయని విశ్వసిస్తున్నట్టు శ్రీ గోయల్ చెప్పారు.
***
(Release ID: 1650473)
Visitor Counter : 252