రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు స్వచ్ఛ పఖ్వాడాను పాటించనున్న ఎరువుల విభాగం

కరోనా సమయంలోనూ స్వచ్ఛ పఖ్వాడాకు గొప్ప ప్రాముఖ్యం లభించింది: కేంద్ర మంత్రి శ్రీ గౌడ

Posted On: 01 SEP 2020 2:57PM by PIB Hyderabad

కేంద్ర ఎరువుల విభాగం నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు స్వచ్ఛ పఖ్వాడాను పాటిస్తోంది. ఎరువుల విభాగం ఆధ్వర్యంలోకి వచ్చే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలు కూడా  భారీ ఎత్తున స్వచ్ఛ పఖ్వాడాలో పాల్గొంటున్నాయి.

    దీనిపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ ట్వీట్‌ చేశారు. కరోనా సమయంలోనూ స్వచ్ఛ పఖ్వాడాకు గొప్ప ప్రాముఖ్యం లభించిందని పేర్కొన్నారు.

    పరిశుభ్రత కోసం మొత్తం ఎరువుల పరిశ్రమ, వర్తకులు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని అన్నారు. ఎరువుల విభాగం సిబ్బందిని మంత్రి అభినందించారు. స్వచ్ఛ పఖ్వాడా విజయవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

    కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ ఛబిలేంద్ర రౌల్‌ సీనియర్‌ అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

***


(Release ID: 1650372)