హోం మంత్రిత్వ శాఖ
భారతదేశ పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ దు:ఖదాయక మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన మంత్రిమండలి
Posted On:
01 SEP 2020 12:16PM by PIB Hyderabad
శ్రీ ప్రణబ్ ముఖర్జీ స్మృతి లో రెండు నిమిషాల మౌనాన్ని పాటించడమైంది
పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ దు:ఖదాయక మరణం పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపాన్ని వ్యక్తం చేసింది.
శ్రీ ప్రణబ్ ముఖర్జీ స్మృతి లో మంత్రిమండలి రెండు నిమిషాల సేపు మౌనాన్ని కూడా పాటించింది.
మంత్రిమండలి ఈ రోజు న దిగువ తీర్మానాన్ని ఆమోదించింది:
‘‘మంత్రివర్గం భారతదేశ పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ దు:ఖదాయక మరణం పట్ల ప్రగాఢ ఖేదాన్ని వ్యక్తం చేస్తున్నది.
ఆయన కన్నుమూత తో, దేశం ఒక ప్రముఖ నేత ను మరియు ఒక విశిష్ట పార్లమెంట్ సభ్యుడి ని కోల్పోయింది.
భారతదేశాని కి 13 వ రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ పాలన లో సాటి లేని అనుభవశాలి గా ఉన్నారు; ఆయన కేంద్ర ప్రభుత్వం లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా, రక్షణ శాఖ మంత్రి గా, వాణిజ్య మంత్రి గా మరియు ఆర్థిక మంత్రి గా సేవలు అందించారు.
పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా లో మిరాటీ అనే ఒక చిన్న పల్లె లో 1935 వ సంవత్సరం డిసెంబర్ 11 వ తేదీ నాడు జన్మించిన శ్రీ ముఖర్జీ చరిత్ర మరియు రాజనీతి శాస్త్రం లో స్నాతకోత్తర పట్టా ను పుచ్చుకోవడమే కాకుండా యూనివర్సిటీ ఆఫ్ కోల్ కాతా నుండి న్యాయశాస్త్రం లోనూ పట్టభద్రుడయ్యారు. ఆయన ఒక కళాశాల అధ్యాపకుని గా మరియు పత్రికా రచయిత గా తన వృత్తిజీవనాన్ని మొదలుపెట్టారు. జాతీయోద్యమానికి తన తండ్రి అందించిన తోడ్పాటు నుండి ప్రేరణ ను పొందిన శ్రీ ముఖర్జీ 1969 వ సంవత్సరం లో రాజ్య సభ కు ఎన్నికైన దరిమిలా తన పూర్తి ప్రజాజీవనాన్ని ఆరంభించారు.
శ్రీ ముఖర్జీ 1973-75 సంవత్సరాల మధ్య కాలం లో పరిశ్రమ ల శాఖ ఉప మంత్రి గా; శిప్పింగ్ మరియు రవాణా శాఖ, ఉక్కు మరియు పరిశ్రమ ల శాఖ, ఇంకా ఆర్థిక శాఖ సహాయ మంత్రి గా పనిచేశారు. ఆయన 1982 వ సంవత్సరం లో భారతదేశ ఆర్థిక మంత్రి గా మొట్టమొదటి సారి పదవీబాధ్యతల ను స్వీకరించారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ 1980 వ సంవత్సరం నుండి 1985 వ సంవత్సరం మధ్య కాలం లో రాజ్య సభ లో సభా నాయకుని గా వ్యవహరించారు. ఆయన 1991 వ సంవత్సరం నుండి 1996 సంవత్సరాల మధ్య ప్రణాళిక సంఘాని కి డిప్యూటీ చైర్ మన్ అయ్యారు; అలాగే, 1993 వ సంవత్సరం నుండి 1995 వ సంవత్సరం మధ్య వాణిజ్య శాఖ మంత్రి గాను; 1995 వ సంవత్సరం నుండి 1996 వ సంవత్సరం వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గాను; 2004 వ సంవత్సరం నుండి 2006 వ సంవత్సరం వరకు రక్షణ మంత్రి గాను ఉన్నారు. ఆయన మళ్లీ 2006 వ సంవత్సరం నుండి 2009 వ సంవత్సరం వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా మరియు 2009 వ సంవత్సరం నుండి 2012 వ సంవత్సరం వరకు ఆర్థిక మంత్రి గా ఉన్నారు. ఆయన 2004 వ సంవత్సరం నుండి 2012 వ సంవత్సరం వరకు లోక్ సభ లో సభా నాయకుని గా ఉన్నారు.
శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2012 వ సంవత్సరం లో జూలై 25 వ తేదీ నాడు భారతదేశం యొక్క రాష్ట్రపతి గా పదవీబాధ్యతల ను స్వీకరించి, పూర్తి అయిదు సంవత్సరాల కాలం పాటు సేవల ను అందించారు. రాష్ట్రపతి గా, శ్రీ ముఖర్జీ ఉన్నత పదవి కి హుందాతనాన్ని సంతరించారు; జాతీయ వ్యవహారాల లో, అంతర్జాతీయ వ్యవహారాల లో తన పాండిత్యం మరియు జీవకారుణ్యవాదం లతో తనదైనటువంటి ముద్ర ను వేశారు.
ఎన్నో పుస్తకాల ను చదివిన శ్రీ ముఖర్జీ దేశ నిర్మాణం పైన, ఇంకా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన అనేక గ్రంథాల ను రచించారు. ఆయన అందుకొన్న గౌరవాల లో, 2019 వ సంవత్సరం లో భారతదేశం లోని అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘భారత్ రత్న’ లు సహా 1997 వ సంవత్సరం లో ‘ఉత్తమ పార్లమెంట్ సభ్యుడు’ పురస్కారం, 2008 వ సంవత్సరం లో ‘పద్మ విభూషణ్’ పురస్కారం లు చేరి ఉన్నాయి.
శ్రీ ముఖర్జీ మన జాతి జీవనం పైన తన ముద్ర ను వేసి మన నుండి సెలవు తీసుకొన్నారు. ఆయన మరణం తో దేశం ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ నేత ను, నిష్ణాతుడైనటువంటి పార్లమెంట్ సభ్యుడిని మరియు ఒక ఉన్నతుడైన రాజనీతిజ్ఞుడి ని కోల్పోయింది.
దేశ ప్రజల కు శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవల కు మంత్రివర్గం ఘనమైన ప్రశంస ను నమోదు చేస్తున్నది. అలాగే, ఆయన ను ఎడబాసిన ఆయన యొక్క కుటుంబ సభ్యుల కు ప్రభుత్వం పక్షాన మరియు యావత్తు దేశ ప్రజల పక్షాన మంత్రిమండలి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నది. ’’
***
(Release ID: 1650366)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam