రక్షణ మంత్రిత్వ శాఖ
‘మేక్ ఇన్ ఇండియా’కు రక్షణ మంత్రిత్వ శాఖ బూస్ట్
- భారత సైన్యానికి 'సిక్స్ పినాకా రెజిమెంట్ల' సరఫరాకు గాను భారతీయ కంపెనీలతో రూ.2580 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఎంఓడీ
Posted On:
31 AUG 2020 6:08PM by PIB Hyderabad
‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ.. భారత ప్రభుత్వపు రక్షణ రంగంలో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడి) సముపార్జన విభాగం ఈ రోజు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. భారత సైన్యం యొక్క ఫిరంగి దళ రెజిమెంట్లకు 'సిక్స్ పినాకా రెజిమెంట్ల' సరఫరా నిమిత్తం ఎంఓడీ దాదాపుగా రూ.2580 కోట్ల ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఒప్పందం చేసుకున్న సంస్థల్లో మెస్సర్స్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్), మెస్సర్స్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ (టీపీసీఎల్) మరియు మెస్సర్స్ లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టీ) ఉన్నాయి. ఈ 'సిక్స్ పినాకా రెజిమెంట్ల'లో 114 ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ & పొజిషనింగ్ సిస్టమ్ (ఏజీఏపీఎస్) కలిగిన లాంచర్లు మరియు 45 కమాండ్ పోస్టులను మెస్సర్స్ టీపీసీఎల్ మరియు మెస్సర్స్ ఎల్ అండ్ టీ నుంచి మరియు దాదాపు 330 వాహనాలను మెస్సర్స్ బీఈఎంఎల్ నుంచి సమీకరించనున్నారు. ఈ 'సిక్స్ పినాకా రెజిమెంట్లు'మన దేశపు ఉత్తర మరియు తూర్పు సరిహద్దుల్లో పని చేయనున్నాయి. ఇవి మన సాయుధ దళాల యొక్క ఆపరేషన్ సంసిద్ధతను మరింత పెంచనున్నాయి. 'సిక్స్ పినాకా రెజిమెంట్ల' స్థాపనను 2024 నాటికి పూర్తి చేయాలని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు 70% స్వదేశీ కంటెంట్‌తో కొనుగోలు (భారతీయ) వర్గీకరణ కింద.. ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌లు ఆమోదం తెలిపారు. పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌ను (ఎంఎల్‌ఆర్‌ఎస్) మన దేశీయంగా డీఆర్‌డీఓ రూపొందించి అభివృద్ధి చేసింది. దీనిని పైన పేర్కొన్న దేశీయ రక్షణ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారత ప్రభుత్వం (డీఆర్‌డీఓ & ఎంఓడీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రదర్శించే ఒక ప్రధానమైన రక్షణ ప్రాజెక్ట్. క్షేత్రస్థాయిలో కీలకమైన అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో “అత్మ నిర్భర్”కు ఇది తగిన తోడ్పాటును అందించనుంది.
*****
(Release ID: 1650231)
Visitor Counter : 262