ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 26లక్షలు దాటిన రికవరీలు రికవరీ రేటు పెరగడంతోపాటుగా, కొనసాగుతున్న మరణాల రేటు తగ్గుదల

Posted On: 29 AUG 2020 4:10PM by PIB Hyderabad

    భారతదేశంలో కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 చికిత్సా నిర్వహణా ప్రక్రియలో ఇది గణనీయమైన పరిణామం. పెద్దసంఖ్యలో  రోగులు వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జి అవుతున్నారు. చాలా తక్కువ, లేదా ఒక ఒక మోస్తరు లక్షణాలున్న కోవిడ్ బాధితులు కూడా పెద్దసంఖ్యలో హోమ్ ఐసోలేషన్ నుంచి కోలుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్ చికిత్సా కేంద్రాల్లోజాతీయంగా పాటిస్తున్న ప్రమాణబద్ధమైన ప్రొటోకాల్కు కట్టుబడి ఉన్నందునే సంఖ్యలో కోవిడ్ రోగుల రికవరీ సాధ్యమవుతోంది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రోగులపై క్రమం తప్పని పర్యవేక్షణ కూడా రికవరీ రేటు పెరగడానికి కారణం.

  కోవిడ్19 రికవరీల  సంఖ్య రోజు 26లక్షలు దాటింది. నిర్ధారణ పరీక్షలు భారీ ఎత్తువ నిర్వహించడం, కేసులను పసిగట్టడానికి సమగ్రమైన విధానాన్ని పాటించడం, ఆసుపత్రుల్లోను, హోమ్ ఐసోలేషన్ లోనూ ఉన్న రోగులకు పటిష్టమైన చికిత్స అందించడం..ఇలా సంపూర్ణమైన వ్యూహంతో ముందుకు వెళ్లడం వల్ల 26,48,998 మంది రోగులు కోలుకోవడం సాధ్యమైంది.

   గత 24 గంటల వ్యవధిలో 65,050 రికవరీలు నమోదయ్యాయి. ఎక్కువ మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. .సి.యు. నిర్వహణకోసం నైపుణ్యం కలిగిన వైద్యులు కావాలన్న అంశంపై దృష్టిని కేంద్రీకరించారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు సంబంధించి న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రతి మంగళవారం, శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ రూపంలో సంప్రదింపుల ప్రక్రియను నిర్వహిస్తూ వస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వైద్యుల సామర్థ్యాలను, నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఎయిమ్స్ కసరత్తు చేస్తోంది. అంబులెన్స్ సేవలు మెరుగుపడటంతో కేసులపై ప్రతిస్పందనకు తీసుకునే వ్యవధి కూడా తగ్గుతోంది. అవసరమైన కేసుల్లో ఆక్సిజన్, స్టెరాయిడ్లువినియోగం, రక్తం గడ్డకట్టుకోకుండా నివారించే మందులు వంటి వాటి వినియోగం సకాలంలో జరగడంతో రికవరీ రేటు 76.47శాతానికి చేరుకుందిప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే కోవిడ్ సగటు మరణాల రేటుకంటే దేశంలో  మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. క్రమంగా తగ్గుతూ వస్తున్న మరణాల రేటు,.. తాజాగా 1.81శాతంగా నమోదైంది. అంటే,.. కోవిడ్ రోగుల రికవరీ రేటు క్రమం తప్పకుండా పెరుగుదలను సూచిస్తుండగా, మరణాల రేటులో తగ్గుదల కొనసాగుతూ వస్తోంది.

 

   దేశంలో వాస్తవ కేసుల సంఖ్య,.. అంటే క్రియాశీలకమైన (యాక్టివ్) కేసుల సంఖ్య 7,52,424. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 21.72 శాతం మాత్రమే. వారందరికీ చక్కని వైద్య  పర్యవేక్షణతో చికిత్స అందిస్తున్నారు. రికవరీ కేసుల సంఖ్య సుస్థిరంగా కొనసాగతూ ఉండటంతో కోలుకున్న రోగుల సంఖ్య, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య (యాక్టివ్ కేసుల సంఖ్య) మధ్య అంతరం దాదాపు 19 లక్షలకు చేరుకుంది.

   కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలపై అధికారికమైన, తాజా సమాచారం, మార్గదర్శక సూత్రాలు, సలహాలు, సూచనల కోసం https://www.mohfw.gov.in, @MoHFW_INDIA వెబ్ సైట్లను ఎప్పటికప్పుడు సంప్రదించవచ్చు.

  కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన సందేహాలను,.. technicalquery.covid19[at]gov[dot]in అనే వెబ్ సైటుకు, మిగతా సందేహాలను, ప్రశ్నలను ncov2019[at]gov[dot]in, @CovidIndiaSeva  అనే వెబ్ సైట్లకు పంపించుకోవచ్చు.

  కోవిడ్-19పై ఏవైనా సందేహాలుంటే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబరు +91-11-2397 8046కు లేదా, 1075 (టోల్ ఫ్రీ)కు ఫోన్ చేయవచ్చు.

 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులపై హెల్ప్ లైన్ నంబర్ల జాబితా కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

 

****


(Release ID: 1649537) Visitor Counter : 228