హోం మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు
క్రీడల పట్ల అభిరుచి, కష్టపడేతత్వంతో దేశం గర్వపడేలా చేస్తున్న ఆటగాళ్లకు వందనం: అమిత్ షా
ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి, యువ ప్రతిభకు సానబెట్టడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కీలక పాత్ర పోషిస్తోంది: అమిత్ షా
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కేంద్ర హోంమంత్రి
తన ప్రతిభతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించడంతోపాటు, కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప వ్యక్తి ధ్యాన్ చంద్: అమిత్ షా
ధ్యాన్‌చంద్ ప్రతిభ, విజయాలు, దేశభక్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది: అమిత్ షా
Posted On:
29 AUG 2020 3:28PM by PIB Hyderabad
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా క్రీడాకారులందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పట్ల తరగని ఇష్టం, కష్టపడేతత్వంతో దేశం గర్వపడేలా చేస్తున్న ఆటగాళ్లకు వందనం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడలను ప్రోత్సహించడంలో, యువ ప్రతిభకు మెరుగులు దిద్దడంలో మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, కీలక పాత్ర పోషిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి నివాళులు అర్పించారు. అద్భుత ప్రతిభతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించడంతోపాటు, కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప వ్యక్తి ధ్యాన్‌చంద్ అని ప్రశంసించారు. ఆయన ప్రతిభ, సాధించిన విజయాలు, దేశభక్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు.
మేజర్ ధ్యాన్‌చంద్ 1905 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. హాకీ మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన ధ్యాన్‌చంద్ గౌరవార్ధం, ఆయన పుట్టినరోజును జాతీయ క్రీడల దినోత్సవంగా ఏటా భారత్ నిర్వహిస్తోంది.
***
(Release ID: 1649511)
Visitor Counter : 144