రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భారత్‌-సింగపూర్‌ 14వ రక్షణ విధాన చర్చలు

Posted On: 28 AUG 2020 4:31PM by PIB Hyderabad

భారత్‌-సింగపూర్‌ మధ్య, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 14వ రక్షణ విధాన చర్చలు జరిగాయి. భారత్‌, సింగపూర్‌ రక్షణ శాఖ కార్యదర్శులు డా.అజయ్‌ కుమార్‌, చాన్ హెంగ్‌ కీ సహాధ్యక్షుల హోదాలో చర్చల్లో పాల్గొన్నారు.
 
    భారత్‌-సింగపూర్‌ మధ్య ఉన్న అనేక ద్వైపాక్షిక రక్షణ సంబంధ అంశాలపై చర్చించారు. రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
 
    "మానవత సాయం&విపత్తు ఉపశమనం" అమలు ఒప్పందంపై సమావేశం చివరిలో రెండు దేశాలు సంతకాలు చేశాయి.

***
 


(Release ID: 1649280) Visitor Counter : 206