ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ వ్యాప్తిని ముందస్తుగా పరిమితం చేయాలనీ, మరణాలను ఒక శాతం కంటే తక్కువగా ఉంచాలని రాష్ట్రాలను కోరడం జరిగింది.

కోవిడ్ మరణాలు అధికంగా నమోదౌతున్న పది రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించిన - క్యాబినెట్ కార్యదర్శి

Posted On: 27 AUG 2020 6:05PM by PIB Hyderabad

తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన ప్రధాన కార్యదర్శులు మరియు ఆరోగ్య కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి ఈ ఉదయం 10 గంటల 30 నిముషాలకు వీడియో కాన్ఫరెన్సు (వి.సి) నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫరెన్సు లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు / కేంద్ర పాలిత  ప్రాంతాలకు చెందిన ఆరోగ్య కార్యదర్శులతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్, నీతీ ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు పాల్గొన్నారు.   ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ నిర్వహణ మరియు ప్రతిస్పందన వ్యూహాన్ని సమీక్షించి, చర్చించడం కోసం ఈ వీడియో కాన్ఫరెన్సు ను ఏర్పాటు చేశారు.

ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 యొక్క ప్రస్తుత స్థితిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఒక వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు, అధిక మరణాలు నమోదౌతున్న జిల్లాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.  పరీక్షలు, కాంటాక్టుల గుర్తింపు, నిఘా, నియంత్రణ, గృహాల్లో ఐసోలేషన్, అంబులెన్సుల లభ్యత, ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్, చికిత్సా విధానాలు మొదలైన వాటికి సంబంధించి అమలుచేస్తున్న పద్ధతులు, వ్యూహాలను మెరుగుపరచవలసిన ఆవశ్యకతపై సమీక్షించారు.  గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాలలో 89 శాతం మరణాలు ఈ 10 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో నమోదైనట్లు గమనించడం జరిగింది.  అందువల్ల, ఈ రాష్ట్రాలు / కేంద్ర పాలిత  ప్రాంతాలు వైరస్ వ్యాప్తిని అరికట్టి, మరణాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి వీలుగా  నిరంతరం కఠినమైన జాగరూకత కలిగి ఉండాలి.

ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని జిల్లాలలో 1 శాతం కన్నా తక్కువగా మరణాల సంఖ్యను తగ్గించేందుకు దిగువ పేర్కొన్న చర్యలపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా సూచించారు:

1.           ప్రభావవంతమైన నియంత్రణ, కాంటాక్టుల గుర్తింపు మరియు నిఘా; 

2.           కనీసం 80 శాతం కొత్త పాజిటివ్ కేసులలో, అన్ని దగ్గరి పరిచయాలను 72 గంటల్లోపే గుర్తించి పరీక్షించాలి; 

3.          5 శాతం కంటే తక్కువ పాజిటివ్ / నిర్ధారణ రేటును లక్ష్యంగా చేసుకుంటూ అన్ని జిల్లాల్లో రోజుకు కనీసం 140 పరీక్షలు ఉండేలా చూసుకోవాలి; 

4.           కంటైన్మెంటు జోన్లు / హెల్త్ ‌కేర్ సెట్టింగులలో యాంటిజెన్ పరీక్షలను నియంత్రించడం మరియు ఆర్.టి-పి.సి.ఆర్. తో అన్ని రోగ లక్షణ ప్రతికూలతలను తిరిగి పరీక్షించడం; 

5.           గృహ ఐసోలేషన్ రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం (టెలి-కాలింగ్ మరియు గృహ సందర్శనలు) మరియు ఎస్.పి.ఓ.2 స్థాయి నియమించబడిన స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి సకాలంలో ప్రవేశం కల్పించడం.

6.           కోవిడ్ సదుపాయాలలో పడకలు మరియు అంబులెన్సుల లభ్యతను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, తద్వారా, అంబులెన్సు ప్రతిస్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించడం;

7.           అన్ని కేసుల పట్ల  సమర్థవంతమైన వైద్య చికిత్సా నిర్వహణా విధానం ద్వారా ప్రాణాలను రక్షించడం; 

8.      దుర్బలురైన (కొమొర్బిడ్, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న) రోగులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఆరోగ్య సదుపాయానికి వారాల వారీగా మరణాల రేటును పర్యవేక్షించడం; 

9.           పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా కోవిడ్ కోసం అంకితమైన సౌకర్యాలను పెంపొందించడం; 

10.          అన్ని సౌకర్యాలలో అవసరమైన మందులు, మాస్కులు, పి.పి.ఈ. కిట్ల లభ్యత మరియు వాడకాన్ని పర్యవేక్షించడం; 

11.          ప్రవర్తనా మార్పుపై దృష్టి కేంద్రీకరించాలి. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను తరచు శుభ్రం చేసుకోవడం,  దగ్గు, జలుబు లక్షణాలను గమనించడం వంటి కోవిడ్ కు తగిన ప్రవర్తనలను ప్రోత్సహించాలి. 

తమ తమ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల గురించీ, కోవిడ్-19 వ్యాప్తిని పరిష్కరించడానికి వారి సంసిద్ధత గురించి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వివరించారు.  ఈ సవాలును ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించీ, వాటిని మరింత బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల గురించీ కూడా వారు తెలియజేశారు.  కోవిడ్ సురక్షిత ప్రవర్తన పరంగా సమాజానికి భాగస్వామ్యం కల్పించడంతో పాటు కేసు మరణాలను తగ్గించడానికి తీసుకున్న చర్యలను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు వివరించాయి. 

*****



(Release ID: 1649058) Visitor Counter : 174