శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం మరియు ఆవిష్కరణ రంగంలో భావచింతన కలిగిన నాయకులు వారి ఆలోచనలు పంచుకోవడానికి వారితో చర్చించడానికి దేశవ్యాప్తంగా “ఇన్ కాన్వర్జేషన్ విత్ ” అనే వరుస కార్యక్రమాల సరళిని భారీ ఎత్తున ప్రారంభించనున్న శాస్త్ర సాంకేతిక విభాగం

ఈ కార్యక్రమాన్ని 28 అగస్టు 2020 శుక్రవారం రోజున ప్రారంభించనున్న కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రి డా.హర్షవర్థన్. ఆయన శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొ.అశుతోష్ శర్మతో చర్చించనున్న మంత్రి.

సైన్స్ పాలసీ ఫోరం యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొదటి చర్చ

Posted On: 27 AUG 2020 1:03PM by PIB Hyderabad

భారతదేశపు 5వ జాతీయ శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణ విధానం, ఎస్టిఐపి 2020, సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారువారి కార్యాలయం(పిఎస్ఏ) మరియు శాస్త్ర సాంకేతిక విభాగం(డిఎస్టి) వారు ఈ క్రొత్త విధానం  ఎస్టిఐపి 2020 కొరకు వికేంద్రీకరించబడిన, క్రింది స్థాయి నుండి పైకి మరియు సంఘటిత ప్రక్రియను ప్రారంభించింది.

దేశ  శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణల విభాగంలో దార్శనిక శక్తి కలిగిన నాయకులు వారి ఆలోచనలను ఇతర నాయకులతో పంచుకోవడానికి “ఇన్ కాన్వర్జేషన్ విత్” అనే వరుస కార్యక్రమాల సరళిని శాస్త్ర సాంకేతిక విభాగం వారు  భారీ ఎత్తున ప్రారంభించనున్నారు. 
ఈ కార్యక్రమాన్ని 28 అగస్టు 2020 శుక్రవారం రోజున ప్రారంభించనున్న కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రి డా.హర్షవర్థన్. ఆయన శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొ.అశుతోష్ శర్మతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మొదటిదైన చర్చను సైన్స్ పాలసీ ఫోరం యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

 

ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి భాగస్వాములందరికీ ఆహ్వానం పలుకుతోంది డిఎస్టి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు కార్యక్రమానికంటే ముందుగా  డిఎస్టి మరియు సైన్స్ పాలసీ ఫోరం సామాజిక మాధ్యమ వేదికలో #చాట్ విత్ హర్షవర్థన్ (#ChatWithDrHarshVardhanసైన్స్ అనే హ్యాష్ ట్యాగ్ క్రింద ప్రశ్నలను అడుగవచ్చు.  

 ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సామాజిక మాధ్యమ వేదికిల వెబ్లింకులు ఈ క్రింద ఇవ్వబడినవి:

 శాస్త్ర మరియు సాంకేతిక విభాగం: ఫేస్ బుక్, ట్విట్టర్      

 సైన్స్ పాలసీ ఫోరం: ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్, ఇన్స్టాగ్రాం    

యూట్యూబ్ లింక్ https://www.youtube.com/watch?v=LhxV62_W5Sc https://youtu.be/LhxV62_W5Sc

కార్యక్రమ పోస్టర్లు:

 

దేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విశ్వమహమ్మారితో పోరాడుతున్న ఈ కీలక నేపథ్యంలో భారత్ తన 5వ జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక విధానాన్ని రూపొందించుకుంటోంది. ఈ విధానంలో గత దశాబ్దం కన్నా  శాస్త్ర, సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగంలో అత్యంత ఎక్కువ మార్పులు కలవు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి వలన ఎస్టిఐ విధానంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. విధానం ప్రాధాన్యాలు, ఆ రంగంలో దృష్టిసారించ వలసిన అంశాలు, పరిశోధనల విధానం మరియు సామాజిక-ఆర్థిక సంక్షేమం కోసం సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ క్రొత్త విధానం దృష్టిసారించనుంది.

ప్రస్తుతం  దేశం మరియు ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్-19 మూలంగా  2013లో తయారు చేసిన శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణల విధానం వచ్చే సంవత్సరం నూతన విధాంనం ఎస్టిపి2020తో మార్చబడుతుందని పిఎప్ఏ మరియు డిఎస్టి సంయుక్తంగా తెలిపింది.  

ఈ ఎస్టిఐపి2020 సూత్రీకరణ ప్రక్రియ 4 బాగా సంధించబడే మార్గాల(ట్రాక్) ద్వారా సంఘటితమవుతుంది: ట్రాక్ 1

సైన్స్ పాలసీ ఫోరం ద్వారా ప్రజలను మరియు నిపుణులను విస్తృతంగా సంప్రదించబడుతుంది. పాలసీ తయారీ సమయంలో మరియు అనంతరం కూడా ఈ వేదిక ద్వారా ప్రజల నుండి మరియు నిపుణుల నుండి భారీగా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు గ్రహించబడతాయి. ట్రాక్ IIలో పాలసీ తయారీ ప్రక్రియలో నిపుణులు ప్రాతిపాదికపూర్వకంగా ఇచ్చిన సలహాలు, ప్రమాణాల పూర్వకంగా ఇచ్చిన సూచనలు ఉంటాయి. ఇందు కోసం 21 ప్రాతిపాదికపూర్వ బృందాలను ఏర్పాటుచేయడమైనది. ట్రాక్ III లో వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాల వారితో సంప్రదింపులు ఉంటాయి. కాగా ట్రాక్ IVలో అగ్రస్థాయిలోని వివిధ  భాగస్వాములతో సంప్రదింపులు ఉంటాయి. ట్రాక్  III లో రాష్ట్రాల్లో మరియు మంత్రిత్వ శాఖల్లో, విభాగాల్లో మరియు ప్రభుత్వ ఏజెన్సీల్లో నోడల్ అధికారులు నియమించబడతారు. వీరు రాష్ట్రల మధ్యన మరియు విభాగాల మధ్యన సంప్రదింపులు జరుపుతారు మరియు ట్రాక్IV వారు సంస్థాగత నాయకత్వం, పరిశ్రమల సంబంధితులు, అంతర్జాతీయ భాగస్వాములు మరియు మంత్రిత్వ శాఖల్లో అంతర్గత సంప్రదింపులు  మరియు రాష్ట్రాల్లో అంతర్గత సంప్రదింపులను అగ్రస్థాయిలో తీసుకు వెళతారు.

వివిధ ట్రాకుల్లో ఈ సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతోంది.  ఆరవ నెలలోని ప్రక్రియలో విద్యాసంబంధిత, పరిశ్రమల సంబంధిత, ప్రభుత్వ, అంతర్జాతీయ భాగస్వాముల, యువ శాస్త్రవేత్తలు, సాంకేతికదారులు, పౌరసంబంధితులు మరియు సామాన్య ప్రజానీకం ఇందులో భాగస్వాములవుతారు.

ఇందుకోసం  ఒక అంతర్గత విధానం మరియు సమాచార సహకార విభాగాన్ని డిఎస్టి-ఎస్టిఐ విధాన హోదాలో నిర్మించడుతోంది. ఇది డిఎస్టి (సాంకేతిక భవనం) వారు ప్రక్రియను పూర్తిచేడానికి ఈ నాలుగు ట్రాకులవారిని సమన్వయపరచనున్నారు.

***



(Release ID: 1649005) Visitor Counter : 223