ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ (నెరమాక్) అధికారులు మరియు రైతు ఉత్పత్తుల సంస్థల (ఎఫ్ పి ఓ)తో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చర్చలు
కోవిడ్ తరువాత భారతీయ ఆర్ధిక వ్యవస్థకు ఈశాన్య ప్రాంత వ్యవసాయ రంగం కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
లాభసాటి గల సంస్థ మార్చేందుకు త్వరలో దిశా నిర్దేశం చేయవలసిందిగా నెరమాక్ ను కోరిన డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2020 4:24PM by PIB Hyderabad
కోవిడ్ అనంతర భారత ఆర్ధిక వ్యవస్థకు ఈశాన్య ప్రాంత వ్యవసాయ రంగం కీలకమని ఈశాన్య ప్రాంత అబివృద్ధి శాఖ (డోనర్) సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. నెరమాక్ అధికారులు మరియు రైతుల బృందాలతో సంభాషిస్తూ ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న అపారమైన వ్యవసాయ సంపదను వినియోగించుకొని లబ్ధిపొందాలని ఎన్నో వ్యాపార సంస్థలు చూస్తున్నాయని, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన అన్నారు. పళ్ళరసాల సాంద్రీకరణ ద్వారా ఫ్రూట్ కాన్సెన్ట్రేట్ మరియు పళ్ళ రసాల తయారీ ప్లాంటులు ఏర్పాటు చేస్తామని లాభసాటి ప్రతిపాదనలతో ముందుకు వచ్చారని, వాటిని వీలయినంత త్వరగా అమలు చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
కోవిడ్ తరువాత రోజుల్లో నెరమాక్ ను లాభసాటి అయిన సంస్థగా మార్చడానికి ఈశాన్య ప్రాంతంలో దొరికే అపూర్వ ఉత్పత్తులను గుర్తించి ఈశాన్య ప్రాంతం బయట దేశంలో మిగిలిన ప్రాంతాలలో అమ్మాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సంస్థ అధికారులను కోరారు. ఇందుకోసం దిశానిర్దేశం చేస్తూ తమ భవిష్యత్ ప్రణాళికలను వారంలో అందజేయాలని ఆయన నెరమాక్ కు తెలిపారు.
ప్రస్తుత కీలక తరుణంలో రైతులకు అండగా నిలవడం ఒక్క నెరమాక్ కు మాత్రమే కాక రైతుల సంస్థలకు, ఈశాన్య ప్రాంతానికి మరియు మొత్తం భారతావనికి ప్రయోజనం చేకూర్చగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు సమాజం సిద్ధంగా ఉండటమే కాక దేశం మార్పును కోరుకుంటోందని, దానికి తోడు వ్యాపార సంస్థలు ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని, అందువల్ల కోవిడ్ తరువాత దేశ ఆర్ధిక వ్యవస్థ కోలుకొని ముందుకు వెళ్లడం తధ్యమని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంతంలో అపారంగా లభించే విలక్షణమైన పళ్ళ రకాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, మసాలా దినుసులు, బ్లాక్ రైస్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ నెరమాక్ సంస్థ ఆ ప్రాంతంలో వ్యవసాయ-ఉద్యాన పంటల మార్కెటింగ్ కు కేంద్రంగా మారాలని, తద్వారా రైతుల ఆదాయం పెంచడానికి దోహదం చేయాలని మంత్రి అన్నారు. లాక్ డౌన్ సమయంలో రైతుల ఉత్పత్తులను సేకరించడం ద్వారా రైతులు నష్టపోకుండా సహాయం చేసినందుకు ఆయన నెరమాక్ ను ప్రశంసించారు. అయితే సంస్థ తమ కార్యకలాపాలను మరింత పెంచాలని అన్నారు. ఒక్క ఏడాదిలోనే సంస్థ టర్నోవర్ రూ. 2 కోట్ల (2018-19) నుంచి రూ. 20 కోట్లకు (2019-20 ) పెరగడం ఆశాజనకంగా ఉందని అంటూ వచ్చే ఐదేళ్లలో రూ. 200 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకొని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డోనర్) కార్యదర్శి డాక్టర్ ఇందర్జీత్ సింగ్, ఈశాన్య ప్రాంత మండలి కార్యదర్శి శ్రీ మోజెస్ కె. చలాయ్, నెరమాక్ చైర్మన్ శ్రీ సౌరభ్ ఎండ్లీ మరియు శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన చాక్షుష సమావేశంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1648900)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145