రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రాయితీలు, కాంట్రాక్టర్లు మరియు కన్సల్టెంట్ల రేటింగ్ చేపట్టనున్న - ఎన్.హెచ్.ఏ.ఐ.

Posted On: 26 AUG 2020 5:15PM by PIB Hyderabad

ఎన్.హెచ్.ఏ.ఐ., తన కన్సల్టెంట్సు, కాంట్రాక్టర్లు, రాయితీదారుల కోసం పారదర్శక మరియు సమగ్రమైన ‘పనితీరు రేటింగ్’ వ్యవస్థను స్థాపించడం కోసం, ఒక ‘విక్రేత పనితీరు మూల్యాంకన వ్యవస్థ’ను ఎన్.హెచ్.ఏ.ఐ. అభివృద్ధి చేసింది.  ఎన్.హెచ్.ఏ.ఐ. యొక్క ఒక ప్రకటన ప్రకారం, వివిధ ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్టులకు చెందిన విక్రేతల పనితీరును తెలుసుకోవడానికి విక్రేతల పోర్టల్ ఆధారిత విశేషమైన మూల్యంకనం ప్రారంభించబడింది.

ఎన్.హెచ్.ఏ.ఐ. వెబ్ ‌సైట్‌లో ‘వెండర్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్’ కింద ఈ పోర్టల్ అందుబాటులో ఉంది.  ఈ పోర్టల్ కింద, విక్రేతలు స్వీయ-అంచనాతో పాటు వారు అమలు చేస్తున్న ప్రాజెక్టు కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను పోర్టల్ ‌లో అప్ ‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందని ఎన్.హెచ్.ఏ.ఐ. తెలియజేసింది.  వీరు సమర్పించిన వివరాలను ఎన్.హెచ్.ఏ.ఐ. వివిధ స్థాయిలలో సమీక్షిస్తుంది, దీని ఆధారంగా విక్రేత యొక్క రేటింగ్ ను రూపొందించడం జరుగుతుంది.  

బి.ఓ.టి.(టోల్); బి.ఓ.టి.(వార్షికం); హెచ్.ఏ.ఎం; ఈ.పి.సి. పనులు మరియు అథారిటీ ఇంజనీరు, స్వతంత్ర ఇంజనీరు, డి.పి.ఆర్. కన్సల్టెంట్స్ కింద ప్రాజెక్టుల అమలు విధానం మరియు పూర్తయిన స్థితి ప్రకారం ఈ పోర్టల్ ద్వారా రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.   మూల్యాంకనం అత్యంత లక్ష్యం మరియు సమతుల్య పద్ధతిలో జరిగిందని నిర్ధారించడానికి, విక్రేత రేటింగ్ ను దాఖలు చేసే ముందు బహుళ-స్థాయిలో సమీక్షించడం జరుగుతుంది. విక్రేతతో కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. రూపొందించిన రేటింగ్‌కు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి విక్రేతకు అవకాశం కూడా ఇవ్వబడుతుంది.

ఈ రోజు వరకు, విక్రేతలు దాఖలు చేసిన 853 ప్రాజెక్టులకు (519 కన్సల్టెంట్స్ మరియు 334 కాంట్రాక్టర్లు) చెందిన సమాచారంపై సమీక్ష ప్రక్రియ వివిధ దశలలో కొనసాగుతోంది.   అవసరమైన పత్రాలను పోర్టల్ లో అప్ ‌లోడ్ చేయడంలో విఫలమైన విక్రేతలను ఎన్.హెచ్.ఏ.ఐ. కి చెందిన బిడ్ లలో పాల్గొనడానికి అనుమతించరు.

"కొత్త ప్రాజెక్టులను కేటాయించడానికి అవసరమైన అర్హత ప్రమాణాలలో ఒకటిగా విక్రేతల రేటింగ్ ను పరిగణించడానికి వీలుగా  బిడ్డింగ్ పత్రాలలో తగిన సవరణలు చేర్చబడుతున్నాయి" అని, ఎన్.హెచ్.ఏ.ఐ. ఒక ప్రకటనలో పేర్కొంది.   ఈ రేటింగ్ విధానం హైవేల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా, విక్రేతల జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. 

 

*****


(Release ID: 1648781) Visitor Counter : 165