రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సంస్థ గోడలను అందంగా ముస్తాబు చేసిన 'నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్'‌, నొయిడా

Posted On: 25 AUG 2020 1:49PM by PIB Hyderabad

కేంద్ర ఎరువుల విభాగం ఆధ్వర్యంలో పనిచేసే 'నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌' (ఎన్‌ఎఫ్‌ఎల్‌), నొయిడా, భారతీయ జానపద చిత్రకళను ప్రోత్సహిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత 'వర్లి' చిత్రాలను నోయిడాలోని తన సంస్థ బయటి గోడలపై చిత్రించింది.

 

  

కాంతివంతమైన ఎరువు రంగులో ఉన్న చిత్రకళ అందరినీ ఆకర్షిస్తోంది.

    ఈ చిత్రాలు పరిసరాలను అందంగా మార్చడమేకాదు, వర్లి చిత్రకళపై ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వర్లి చిత్రకళ మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో లేదా పెద్ద ప్రదర్శనల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్‌ఎఫ్‌ఎల్‌ బయటి గోడలపై ప్రజలంతా ఈ చిత్రకళను ఆస్వాదిస్తున్నారు.

    స్వచ్ఛ భారత్‌లో భాగంగా పరిశుభ్రతను పెంచడానికి సంస్థ కృషి చేస్తోందని, తాము చేపట్టిన ఈ కార్యక్రమం నొయిడా సుందరీకరణకు ప్రోత్సాహం అవుతుందని ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

    కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో, వర్లి కళాకారులు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొందారు.

***


 



(Release ID: 1648474) Visitor Counter : 167