రైల్వే మంత్రిత్వ శాఖ

డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్(డిఎఫ్సిసిఐఎల్) ప్రగతిని సమీక్షించిన కేంద్ర రైల్వే మరియు వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

గత్తేదార్లందరి పనితీరు తప్పనిసరిగా సమీక్ష, రాష్ట్రాల సమన్వయంతోపాటు అన్ని రకాల అంశాల పరిష్కార లక్ష్యంగా తీర్మానం

ప్రతీ వారం ప్రాజెక్టు పనీతీరును, సాధించిన ప్రగతిని సమీక్షించేందుకు నవీన విధానం

కేంద్ర ప్రభుత్వం అధ్వర్యోంలో పనిచేస్తున్న భారీ రైలు అవస్థాపన ప్రాజెక్టుల్లో డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్(డిఎఫ్సి)(మొత్తం పొడవు 3360 కిమీ మార్గం) ఒకటి

మొత్తం వ్యయం రు.81,459 కోట్లు

తూర్పు మరియు పశ్చిమ డిఎఫ్సిలు(సోనానగర్-దన్కుని పిపిపి విభాగాలను మినహాయించి) డిసెంబర్ 2021 నాటికి పూర్తి

Posted On: 24 AUG 2020 4:47PM by PIB Hyderabad

డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్(డిఎఫ్సిసిఐఎల్) ప్రగతిని  ఈ రోజు కేంద్ర రైల్వే మరియు వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ఈ సమావేశంలో అధికారులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని  గురించి వివరించారు. ఉత్తర్ ప్రదేశ్లోని దాద్రి మరియు ముంబైలోని జవహార్లాల్ పోర్టు(జెఎన్పిటి)ని కలిపే పశ్చిమ నడవా  మరియు పంజాబ్లోని లూథియానా దగ్గర గల సాహ్నేవాల్ నుండి ప్రారంభమై పశ్చిమ బెంగాల్లోని దన్కునిలో పూర్తయ్యే తూర్పు నడవా డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతుందని ఆశిస్తున్నారు.

కోవిడ్-19 కారణంగా నష్టపోయిన  కాలాన్ని ప్రాజెక్టు వేగం పెంచడం ద్వారా సవరించుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని డిఎఫ్ఎఫ్సిఐఎల్ యాజమాన్యానికి సూచించారు మంత్రి శ్రీ గోయల్. అలాగే ఈ ప్రాజెక్టులో సమస్యాత్మకమైన ప్రాతాలను గుర్తించి వాటి తగిన పరిష్కారాల దిశగా లక్ష్యంతో పనిచేయాలని అందుకు ఉత్తమ పరిష్కారాల సూచించే నవతరాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో గత్తేదార్లందరి పనితనాన్ని కఠిన రీతిలో సమీక్షిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే లక్ష్యంతో రాష్ట్రాలను కూడా సమన్వయపరుస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రగతిని సమీక్షించేందుకు వారానికి ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని శ్రీ గోయల్ అన్నారు.

భారత ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టుల్లో డెడికేటెడ్ ప్రయిట్ కారిడార్(డిఎఫ్సి) భారీ రైలు అవస్థాపనా ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం రు. 81,459 కోట్లు కేటాయించబడ్డాయి. ఈ ప్రాజెక్టు ప్రణాళిక, అభివృద్ధి, ఆర్థిక వనరుల సమకూర్పు, నిర్మాణం, నిర్వహణ మరియు పనిచేయడం కోసం డిఎఫ్సిసిఐఎల్ ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో తూర్పు డిఎఫ్సి(1504 కిమీ మార్గం) మరియు పశ్చిమ డిఎఫ్సి(1856 కిమీ మార్గం) మొత్తం పొడవు  3360 కిమీ మార్గం నిర్మంచబడుతుంది.

***


(Release ID: 1648310) Visitor Counter : 226