ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
స్థిరమైన క్రమంలో సాగుతున్న పరీక్షల నిర్వాహణ, మొత్తం 3.6 కోట్ల పరీక్షలను నిర్వహించిన భారత్
మిలియన్ మందిలో (టిపిఎం) పరీక్షలు జరిగిన వారి సంఖ్య - 26,016 కొత్త శిఖారాలకు చేరిక
Posted On:
24 AUG 2020 1:31PM by PIB Hyderabad
పాజిటివ్ కేసులను సకాలంలో మరియు త్వరితగతిన పరిక్షించి, సమర్థవంతమైన చికిత్స తో సమకాలీకరించబడిన సత్వర గుర్తింపు, ఐసొలేషన్ కోవిడ్-19 మహమ్మారికి భారతదేశం యొక్క ప్రతిస్పందన లో ఒక ముఖ్య భాగం. రికవరీల సంఖ్య పెరుగుతూ, తగ్గుతున్న మరణాలకు, ఇక్కడ తీసుకుంటున్న చర్యలు ప్రతీకగా నిలిచాయి.
భారత్ ఇప్పటివరకు 3,59,02,137 పరీక్షించింది. గత 24 గంటల్లో నిర్వహించిన 6,09,917 పరీక్షలతో, భారతదేశం తన పరీక్ష సామర్థ్యాన్ని పెంచింది.
పరీక్ష, ఛేదన, చికిత్స విధానాన్నే మంత్రంగా తీసుకున్న ప్రభుత్వం మిలియన్ మందిలో పరీక్షల నిర్వహణ సంఖ్య 26,016 మందికి పెరిగింది. ఉధృతంగా చేపట్టే పరీక్ష ద్వారా మాత్రమే పాజిటివ్ కేసులను గుర్తించవచ్చు, వారి ఆచూకీని సకాలంలో ట్రాక్ చేసి వెంటనే వారిని ఐసొలేషన్ కి పంపడం జరుగుతోంది. అలాగే తీవ్రమైన, క్లిష్టమైన రోగులకు అవసరమైన క్లినికల్ చికిత్సను అందించారు.
టెస్టింగ్ వ్యూహం జాతీయ ప్రయోగశాల నెట్‌వర్క్ స్థిరమైన విస్తరణను కూడా నిర్ధారిస్తుంది. నేడు, ప్రభుత్వ రంగంలో 984 ల్యాబ్‌లు, 536 ప్రైవేట్ ల్యాబ్‌లతో, 1520 ల్యాబ్‌లు ప్రజలకు సమగ్ర పరీక్షా సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీటితొ పాటు:
• రియల్ టైమ్ ఆర్టి పీసీఆర్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 785 (ప్రభుత్వం: 459 + ప్రైవేట్: 326)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 617 (ప్రభుత్వం: 491 + ప్రైవేట్: 126)'
• సీబీనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 118 (ప్రభుత్వం: 34 + ప్రైవేట్: 84)
కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలకు అన్ని ప్రామాణికమైన, నవీకరించిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ మరియు @ MoHFW_INDIA.
కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక అంశాలకు ... covid19[at]gov[dot]in మరియు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva పై ఇతర ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ). COVID-19 లోని స్టేట్స్ / యుటిల హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద కూడా అందుబాటులో ఉంది.
***
(Release ID: 1648237)
Visitor Counter : 281