సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఉద్యోగాల ఎంపిక కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్.‌ఆర్.‌ఏ. నిర్వహించే ఉమ్మడి అర్హత పరీక్ష (సి.ఈ.టి) ను ఉపయోగించుకోవచ్చు : డాక్టర్ జితేంద్ర సింగ్.

Posted On: 22 AUG 2020 6:22PM by PIB Hyderabad

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఉద్యోగాల ఎంపిక కోసం జాతీయ నియామక సంస్థ (ఎన్.‌ఆర్.‌ఏ) నిర్వహించబోయే ఉమ్మడి అర్హత పరీక్ష (సి.ఈ.టి) ని ఉపయోగించుకోవచ్చు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎం.ఈ.ఆర్) శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), పి.ఎం.ఓ., సిబ్బంది; ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ విషయం తెలియజేస్తూ,  సి.ఈ.టి. స్కోర్ ‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల  ప్రభుత్వాలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థ (పి.ఎస్.‌యు) లు, ఆ తర్వాత ప్రైవేటు రంగాలకు చెందిన  రిక్రూటింగ్ ఏజెన్సీలతో పంచుకోవచ్చునని తెలియజేశారు.   వాస్తవానికి, ఇది, నియామకాలకు అయ్యే ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలతో సహా నియామక ఏజెన్సీలకు సహాయపడుతుంది,  అదే సమయంలో ఉద్యోగాలకోసం ఎదురుచూసే, యువతీ, యువకులకు సౌకర్యవంతంగా, ఖర్చు తగ్గించేదిగా కూడా ఉంటుంది. 

సి.ఈ.టి. స్కోర్‌ను ఉపయోగించడానికి, ఈ ఏజెన్సీలు, ఈ సంస్థలు, అవగాహనా ఒప్పందం (ఎమ్.ఓ.యు) రూపంలో ఒక అమరికను ఏర్పాటు చేసుకోవచ్చునని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  చివరికి, ఇది యజమానికి మరియు ఉద్యోగికి పరస్పరం ప్రయోజనకరమైన విధానంగా ఉపయోగపడుతుంది. 

ఉమ్మడి అర్హత పరీక్ష స్కోరును పంచుకునే ఏర్పాట్లలో భాగం కావడానికి తమ మొగ్గు చూపిన అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో డి.ఓ.పి.టి. తో పాటు తాను కూడా స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు, డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.  చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఈ సంస్కరణను అనుసరించడానికి చాలా ఉత్సాహంగా, అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత జోక్యం, చొరవ లేకుండా ఈ విప్లవాత్మక నిర్ణయం సాధ్యమయ్యేది కాదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.   కష్టపడుతున్న యువత మరియు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి జీవన సౌలభ్యాన్ని తీసుకురావడానికి ఇది ఒక పెద్ద సంస్కరణగా నిరూపించబోతోంది.  ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసే సున్నితత్వం మరియు చిత్తశుద్ధికి ఇది ఒక ప్రతిబింబం అని ఆయన అభివర్ణించారు. 

కొన్ని వర్గాలలో ఆందోళనను తొలగిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, పరీక్షకు హాజరయ్యే వారికి, ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం ఎస్.సి. / ఎస్.టి. / ఓ.బి.సి., ఇతర వర్గాల అభ్యర్థులకు అధిక వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుందని తెలియజేశారు.  కొన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న, అభ్యర్థులు నివసించే ప్రాంతం వంటి నియామక నియమాలతో ఈ ఉమ్మడి అర్హత పరీక్షకు పరస్పర సంబంధం లేదా అననుకూలతలను కలిగి ఉండదని ఆయన పునరుద్ఘాటించారు.  ఉమ్మడి అర్హత పరీక్ష కేవలం హిందీ మరియు ఆంగ్ల భాషలలో మాత్రమే నిర్వహించబటుతుందని, కొన్ని వర్గాల్లో నెలకొన్న అపోహలకు విరుద్ధంగా, ఈ పరీక్ష ప్రస్తుతం 12 భారతీయ భాషలలో నిర్వహించబడుతుంది. క్రమంగా 8 వ షెడ్యూల్ లోని ఇతర భాషలలో కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు.  

<><><>


(Release ID: 1647967) Visitor Counter : 159