నీతి ఆయోగ్

స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రంతో అటల్ ఇన్నవేషన్ మిషన్ భాగస్వామ్యం

క్రియాశీలకమైన స్టార్టప్ సానుకూల వాతావరణ విస్తరణే లక్ష్యం

Posted On: 20 AUG 2020 7:07PM by PIB Hyderabad

    దేశంలో సృజనాత్మక సంస్కృతిని విస్తరింపజేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా నీతీ ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎయిమ్), బిజినెస్ స్వీడన్ సంస్థ ఒక ముందడుగు వేశాయి. ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణా సృజనాత్మక కేంద్రం తరఫున పరస్పరం సహకరించుకోవాలని ఎయిమ్, బిజినెస్ స్వీడన్ అంగీకారానికి వచ్చాయి. భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సామర్థ్యాన్ని, దేశవ్యాప్తంగా క్రియాశీలకమైన స్టార్టప్ సానుకూల వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మేరకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న వర్చువల్ అనుమతి ప్రకటనా పత్రంపై అటల్ ఇన్నొవేషన్ మిషన్, ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం తరఫున బిజినెస్ స్వీడన్ సంతకాలు చేశాయి.  2020 సంవత్సరం ఆగస్టు 20 సంతకాలు జరిగాయి.

  నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ కింద అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ వస్తున్నాయి. అటల్ న్యూ ఇండియా చాలెంజ్ (.ఎన్..సి.), అటల్ ఇన్ కుబేషన్ సెంటర్ (..సి.), అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్ (.సి..సి.), అటల్ టింకరింగ్ ల్యాబ్ (..ఎల్.), అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ (.ఆర్..ఎస్..) వంటి వాటిని ఎయిమ్ నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా కుదిరిన అనుమతి ప్రకటనా పత్రం ద్వారా,   కార్యక్రమాలు, సంస్థలన్నింటికీ పలు రకాల మద్దతు లభిస్తుంది. పలు కార్యక్రమాాలు నిర్వహించడం, అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, ఉభయదేశాల్లో సృజనాత్మక సంస్కృతికి సదుపాయాలను ప్రోత్సహించడం కార్యక్రమాల లక్ష్యం.

   ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం అనేది ఢిల్లీ, జోధ్ పూర్ లలోని అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థలకు, బిజినెస్ స్వీడన్ కు మధ్య కుదిరిన సహకార ఒప్పంద ఫలితం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.), స్వీడన్ ఆరోగ్య, సామాజక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతదేశంలోని స్వీడన్ రాయబార కార్యాలయం ఉమ్మడిగా అందించే మార్గదర్శకత్వంలో సృజనాత్మక కేంద్రం పనిచేస్తుందిబహిరంగంగా సృజనాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యం కేంద్రానికి పలు సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఇన్వెస్ట్ ఇండియా, .జి.ఎన్..., స్టార్టప్ ఇండియా, ఆస్ట్రా జెనెకా, నాస్ కామ్, విన్నోవా వంటి సంస్థలతో వ్యవస్థ రూపొందింది.

  భారతీయ ఆరోగ్య రక్షణ వ్యవస్థలో ఎదురయ్యే కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్య రక్షణపై తొలి సృజనాత్మక కార్యక్రమాన్ని సృజనాత్మక కేంద్రం ఇటీవల ప్రారంభించింది. అటల్ ఇన్నొవేషన్ మిషన్ తో సహకారం ద్వారా ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం సానుకూల వాతావరణాన్ని మరింతగా బలోపేతం చేయబోతున్నారు. సృజనాత్మకంగా పనిచేసే ఔత్సాహికులకు అసరమైనంత మద్దతు అందించడమే లక్ష్యంగా చర్య తీసుకుంటున్నారు.

    “భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న సృజనాత్మక, ఔత్సాహిక సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసి, స్వీడన్ లో కూడా అలాంటి కృషి చేయడానికి వీలుకలిగించే ప్రయత్నంలో ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రంతో భాగస్వామ్యం కుదరడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రపంచ స్థాయిలో భారత స్టార్టప్ కంపెనీలు క్రియాశీలకంగా ఎదుగడానికి, ప్రపంచ స్థాయి అవకాశాలకు, స్వీడన్ కంపెనీల భాగస్వామ్య వ్యవస్థలతో సంబంధాలకు ఇది దోహదపడుతుందిఅని  అటల్ ఇన్నొవేషన్ మిషన్ కు చెందిన మిషన్ డైరెక్టర్ ఆర్. రమణన్  సందర్భంగా చెప్పారుఅంతర్జాతీయ సహకారం ద్వారా దేశంలో ఔత్సాహిక, సృజనాత్మక వ్యవస్థను బలోపేతం చేయడానికి అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఇటీవల తీసుకున్న పలు చర్యలకు అనుగుణంగా, ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం ఏర్పాటైనట్టు  చెప్పారు. తాజాగా కుదిరిన ఒప్పదంపై మరిన్ని వివరాలను ఆయన తెలియజేస్తూ, సృజనాత్మక రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే చర్యలకు, ఇన్ కుబేషన్, మెంటార్ షిప్, నిధులందించే వ్యవస్థలతో సంబంధాలు, సమావేశాల నిర్వహణ వంటి కార్యకలాపాలను తమ సంస్థ మద్దతు ఇస్తుందన్నారు.

  ఇదిలా ఉండగా, అటల్ ఇన్నొవేషన్ మిషన్ లక్ష్యాల సాధనకు తగిన మద్దతు ఇచ్చేందుకు ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం అంగీకరించింది. రెండు దేశాల మధ్య సృజనాత్మకతకు సానుకూలంగా స్థిరమైన ఔత్సాహిక వాతావరణాన్ని కేంద్రం కల్పిస్తుంది. ఇండియా స్వీడన్ సృజనాత్మక కేంద్రం తరఫున ఏర్పాటయ్యే స్టార్టప్ కంపెనీలకు అసరమైన నైపుణ్యాలను కూడా కేంద్రం అందిస్తుంది.

   వర్చువల్ అనుమతి పత్రంపై  ఎయిమ్ మిషన్ డైరెక్టర్ ఆర్. రమణన్ తో పాటుగా, ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ సృజనాత్మక కేంద్రం తరఫున భారతదేశంలో స్వీడిష్ వాణిజ్య వ్యవహారాల కమిషనర్ ఆండర్స్ విక్ బెర్గ్ సంతకాలు చేశారు. సందర్భంగా విక్ బెర్గ్ మాట్లాడుతూ, “భారత దేశంలో స్టార్టప్ సానుకూల వ్యవస్థను ప్రోత్సహించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్న ఆటల్ ఇన్నొవేషన్ మిషన్ తో మాకు భాగస్వామ్యం కుదరడం ఆనందం కలిగిస్తోంది. సహకార భాగస్వామ్యం ద్వారా ఇండియా స్వీడన్ ఆరోగ్య సృజనాత్మక కేంద్రం వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. కేంద్రం తరఫున త్వరితంగా స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడానికి, నిరాటంకంగా నైపుణ్యాన్ని అందించేందుకు ఇది వీలు కలిగిస్తుందిఅని అన్నారు.  అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతీ ఆయోగ్ తీసుకుంటున్న ఇలాంటి చర్యలు దేశవ్యాప్తంగా సృజనాత్మక ధోరణిని, స్టార్టప్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నామని ఆయన అన్నారు.

****


(Release ID: 1647449) Visitor Counter : 266