రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎఫ్ఏఐ ఎస్ఆర్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫాక్ట్ సీ అండ్ ఎండీ కిషోర్ రుంగ్తా ‌

Posted On: 19 AUG 2020 4:39PM by PIB Hyderabad

ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద‌క్షిణ ప్రాంత విభాగం (ఎఫ్ఏఐ ఎస్ఆర్) ఛైర్మన్‌గా 'ది ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్' (ఫాక్ట్) సీ అండ్ ఎండీ శ్రీ కిషోర్ రుంగ్తా బాధ్యతలు స్వీకరించారు. ఎరువుల తయారీదారులు, పంపిణీదారులు, దిగుమతిదారులు, పరికరాల తయారీ దారులు, పరిశోధనా సంస్థలు మరియు ఇన్‌పుట్‌ల సరఫరాదారులతో కూడిన ఒక మేటి ఉన్నత సంస్థ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ).
ఎఫ్ఏఐ ఎస్ఆర్ ప‌రిధిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల భాగ‌స్వామ్య పక్షాలు స‌భ్యులుగా ఉన్నారు. మేటి సేవ‌ల నిమిత్తం ఎరువుల ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు వాడకానికి సంబంధించిన వారందరినీ ఏకతాటి పైకి తీసుకురావాలన్న ల‌క్ష్యంతో ఎఫ్ఏఐ ముందుకు సాగుతోంది. ఎరువుల‌కు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా ప్రాంతీయ కార్యాలయం దృష్టి పెడుతుంది. ఈ ప్రాంతంలో పనిచేసే వివిధ ఎరువుల తయారీదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర స్థానిక అధికారులతో నిరంతర సంబంధాలు కలిగి ఉంటుంది.


 

****


(Release ID: 1647108) Visitor Counter : 108