మంత్రిమండలి

భారతీయ విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థ కు చెందిన మూడు విమానాశ్రయాల ను- జయ్ పుర్, గువాహాటీ మరియు తిరువనంతపురం- పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ ద్వారా లీజు కు ఇచ్చే ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 19 AUG 2020 4:31PM by PIB Hyderabad

భారతీయ విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థ (ఎయర్ పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా-ఎఎఐ) కి చెందిన మూడు విమానాశ్రయాల ను- జయ్ పుర్, గువాహాటీ మరియు తిరువనంతపురం- పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ (పిపిపి) ద్వారా లీజు కు ఇచ్చే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
 
ఎఎఐ విమానాశ్రయాలు అనగా, జయ్ పుర్, గువాహాటీ ఇంకా తిరువనంతపురం విమానాశ్రయాల కార్యకలాపాల నిర్వహణ, యాజమాన్యం మరియు అభివృద్ధి ల కోసం యాభై సంవత్సరాల కాలానికి గాను లీజు కు ఇచ్చేందుకు మెస్సర్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు  కేంద్ర మంత్రివర్గం సమ్మతి ని ఇచ్చింది.  దీనికోసం ఎఎఐ నిర్వహించిన గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ లో మెస్సర్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ను సఫలమైన బిడ్డర్ గా ప్రకటించడం జరిగింది.
 
ఈ పరియోజన లు ప్రభుత్వ రంగం లో అవసరమైన పెట్టుబడుల ను సిద్ధం చేయడం తో పాటు సేవ ల అందజేత లో, నైపుణ్యం లో, వాణిజ్య సంబంధి వ్యవస్థ లో, ఇంకా వృత్తికౌశలం లో దక్షత ను తీసుకువస్తాయి.
 
పూర్వరంగం:

దిల్లీ మరియు ముంబయిల లో ఎఎఐ కి చెందిన విమానాశ్రయాల ను కార్యకలాపాల నిర్వహణ, యాజమాన్యం మరియు అభివృద్ధి ల కోసం ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం క్రితం లీజుకు ఇచ్చింది.
 
ఈ పిపిపి ప్రయోగాలు ప్రపంచ శ్రేణి విమానాశ్రయాల ను తీర్చిదిద్దడం లో సాయపడ్డాయి.  అలాగే, విమానాశ్రయ ప్రయాణికుల కు సమర్ధతతో కూడిన సేవల ను, ఇంకా నాణ్యమైన సేవల ను అందించడంలో కూడా తోడ్పడ్డాయి.  అంతేకాక ఎఎఐ తన ఆదాయాన్ని పెంచుకోవడం లోను, విమానాశ్రయాల ను, ఇంకా దేశం లోని మిగతా ఎయర్ నావిగేశన్ సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం పట్ల శ్రద్ధ వహించడం లో కూడాను తోడ్పడింది.  పిపిపి భాగస్తుల నుండి ఎఎఐ అందుకొన్న ఆదాయం రెండో అంచె నగరాల లో, మూడో అంచె నగరాల లో మౌలిక సదుపాయాల సంబంధిత సదుపాయాల ను ఏర్పాటు చేయడం తో పాటు వాటి విమానాశ్రయాల ను అంతర్జాతీయ ప్రమాణాల కు తగ్గట్టు గా ఉన్నతీకరించడం లోను ఎఎఐ కి వెసులుబాటు ను కల్పించింది.  భారతదేశం లోని పిపిపి విమానాశ్రయాలు  ఎయర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటి (ఎఎస్ క్యు) పరం గా ఎయర్ పోర్ట్ స్ కౌన్సిల్ ఇంటర్ నేశనల్ (ఎసిఐ) ద్వారా వాటి వాటి కేటగిరీల లో అగ్రగామి 5 స్థానాల లో నిలకడ గా కొనసాగుతూ వస్తున్నాయి.
 
అందువల్ల, ఎఎఐ కి చెందిన మరిన్ని విమానాశ్రయాల ను పిపిపి పరిధి లో కార్యకలాపాల నిర్వహణ, యాజమాన్యం మరియు అభివృద్ధి ల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ అప్రైజల్ కమిటీ (పిపిపిఎసి) ద్వారా లీజు కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పిపిపిఎసి పరిధి కి ఆవల ఉండే ఏ అంశం పైన అయినా నిర్ణయం తీసుకోవడం కోసం కార్యదర్శుల సాధికారిక సమూహాన్ని (ఇజిఒఎస్) ను కూడా ప్రభుత్వం నియమించింది.
 
లావాదేవీ తాలూకు దస్తావేజు పత్రాల ను పిపిపిఎసి ఆమోదించింది.  యావత్తు బిడ్డింగ్ ప్రక్రియ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్) కు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ), వ్యయ విభాగం ప్రతినిధుల తో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధుల తో ఏర్పాటు చేసిన ఇజిఒఎస్ నిర్దేశాల తో, పర్యవేక్షణ తో నిర్వహించడమైంది.  

ఎఎఐ 2018 వ సంవత్సరం లో డిసెంబర్ 14 వ తేదీ నాడు గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్ ను విడుదల చేసింది.  దీని లో ప్రయాణికుల లో ప్రతి ఒక్కరి కి రుసుం అనేది బిడ్డింగు కు పరామితి గా నిర్ధరించడమైంది.  సాంకేతిక బిడ్ లను 2019 వ సంవత్సరం లో ఫిబ్రవరి 16 వ తేదీ న తెరవడమైంది.  అర్హత పొందిన బిడ్డర్ ల తాలూకు ఫైనాన్శియల్ బిడ్ ల ను 2019 వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ న, ఇంకా అదే సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ న తెరవడం జరిగింది.  మెస్సర్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మూడు విమానాశ్రయాలు- జయ్ పుర్, గువాహాటీ మరియు తిరువనంతపురం- లకు అత్యధిక ప్యాసింజర్ ఫీ ని పేర్కొనడం ద్వారా అన్ని బిడ్ ల ను గెలుచుకొంది.

 

***



(Release ID: 1647040) Visitor Counter : 199