ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డిజిటల్ ఇండియా భారీ విజయం: రికార్డ్ స్థాయిలో 2 లక్షల టెలీ-కన్సల్టేషన్ సేవలు అందించిన ఆరోగ్య శాఖ ఈ-సంజీవని టెలిమెడిసిన్

Posted On: 19 AUG 2020 1:54PM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ‘ఈ-సంజీవని’ డిజిటల్ ప్లాట్‌ఫాం, 2 లక్షల టెలీకన్సల్టేషన్ సేవలను అందించింది. ఆగస్టు 9 వ తేదీ నుంచి పది రోజుల స్వల్ప వ్యవధిలో ఈ మైలురాయిని సాధించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్  ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి దార్శనికత అయిన 'డిజిటల్ ఇండియా' చొరవను సాకారం చేసే దిశగా, ఇ-సంజీవని ప్లాట్‌ఫాం ప్రస్తుత కోవిడ్ కష్టకాలంలో  సంరక్షకులకు, వైద్య సమాజానికి, ఆరోగ్య సంరక్షణ సేవలను కోరుకునేవారికి సులువుగా లభిస్తుందని నిరూపించింది.

ఈ-సంజీవానీ ప్లాట్‌ఫాం రెండు రకాల టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించింది. డాక్టర్-టు-డాక్టర్(ఈ-సంజీవని), పేషెంట్-టు-డాక్టర్ (ఇ-సంజీవని ఓ.పి.డి) టెలి-కన్సల్టేషన్స్. మునుపటిది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (ఎబి-హెచ్డబ్ల్యుసి) కింద అమలు ఆవుతోంది. గుర్తించిన మెడికల్ కాలేజీ ఆసుపత్రులతో కలిసి మొత్తం 1.5 లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో టెలి-కన్సల్టేషన్‌ను ‘హబ్ అండ్ స్పోక్’ నమూనాలో అమలు చేయడం దీని లక్ష్యం. ‘స్పోక్స్’, అంటే ఎస్‌హెచ్‌సిలు, పిహెచ్‌సిలు, హెచ్‌డబ్ల్యుసిలకు టెలి-కన్సల్టేషన్ సేవలను అందించడానికి మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులలో రాష్ట్రాలు ప్రత్యేకమైన ‘హబ్స్‌’ను గుర్తించి ఏర్పాటు చేశాయి. 

ఈ-సంజీవని ఇప్పటివరకు 23 రాష్ట్రాలు అమలు చేశాయి.ఇతర రాష్ట్రాలు దీనిని అమలు చేసే దిశగా కృషి చేస్తున్నాయి.

 

ఈ వేదిక ద్వారా ఈ-హెల్త్ సేవలను వినియోగించుకుంటున్న మొదటి ఐదు రాష్ట్రాలు తమిళనాడు (56,346 కన్సల్టెషన్లు), ఉత్తర ప్రదేశ్ (33,325), ఆంధ్రప్రదేశ్ (29,400), హిమాచల్ ప్రదేశ్ (26,535), కేరళ (21,433). 25,478 కన్సల్టేషన్ల తో అత్యధిక హెచ్‌డబ్ల్యుసి-మెడికల్ కాలేజీ పరస్పర చర్యలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా, తమిళనాడు 56,346 కన్సల్టేషన్లల తో ఒపిడి సేవల్లో ముందుంది

****



(Release ID: 1647011) Visitor Counter : 246