రక్షణ మంత్రిత్వ శాఖ
కర్టెన్ రైజర్ - నావికా దళ కమాండర్ల సమావేశం -2020
- రేపటి నుంచి మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో నిర్వహణ
Posted On:
18 AUG 2020 6:21PM by PIB Hyderabad
ఈ నెల 19 నుండి 21 వరకు న్యూ ఢిల్లీలో 'నావికా దళ కమాండర్ల సమావేశం -2020' జరుగనుంది. నావల్ కమాండర్ల మధ్య పరస్పర సంప్రదింపుల నిమిత్తం అత్యున్నత స్థాయి కార్యక్రమంగా ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్, కమాండర్స్-ఇన్-చీఫ్ తదితరులు పాల్గొననున్నారు.
గత సంవత్సరంలో చేపట్టిన వివిధ రకాల ప్రధాన కార్యాచరణలు, రక్షణ ముడి పదార్ధాలు, లాజిస్టిక్స్, హెచ్ఆర్, శిక్షణ మరియు పరిపాలనా కార్యకలాపాలను గురించి కూడా ఈ సమావేశంలో సమీక్షిస్తారు. దీనికి తోడుగా భవిష్యత్తులో నడిపించాల్సిన కోర్సుపై కూడా నిర్ణయం తీసుకొని ముందుకు సాగేందుకు గల మార్గాలపై చర్చించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఎదురవుతున్న అనూహ్యమైన సవాళ్లతో పాటు, ఉత్తర సరిహద్దుల్లో ఇటీవలి జరిగిన సంఘటనల నేపథ్యంలో సమావేశం ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహమ్మారి కొత్తగా ముందుకు తెచ్చిన కార్యకలాపాల నిర్వహణ, సుస్థిరంగా ఆస్తుల నిర్వహణ, సేకరణ సమస్యలు, కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మానవ వనరుల నిర్వహణ మొదలైన అంశాలు వేదికగా ఈ సమావేశంలో ఉన్నత నావికా దళ నాయకత్వం చర్చించనుంది.
గౌరవ కేంద్ర రక్షణ మంత్రి ప్రారంభ రోజున నావికాదళ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశం ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులతో నావల్ కమాండర్ల పరస్పర చర్చలకు వేదికగా నిలువనుంది. మిలటరీ వ్యవహారాల విభాగం (డీఎంఏ) మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) వ్యవస్థీకృతం చేసిన తరువాత జరుగుతున్న మొదటి నావల్ కమాండర్ల సమావేశం ఇదే కావడం గమనార్హం. ఉమ్మడి ప్రణాళిక నిర్మాణాలు, ట్రై-సర్వీస్ సినర్జీ మరియు కార్యాచరణ సంసిద్ధత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రియాత్మక పునర్వ్యవస్థీకరణను ఆప్టిమైజ్ చేసే మార్గాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. గౌరవ ప్రధాన మంత్రి దృష్టి కోణం 'సాగర్'కు (సెక్యూరటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్) అనుగుణంగా కమాండర్లు ఇండో-పసిఫిక్‌లోని పెద్ద భద్రతా అవసరాలపై కూడా ఈ సమావేశంనందు చర్చలు నిర్వహించనున్నారు.
***
(Release ID: 1646828)
Visitor Counter : 251