ఉక్కు మంత్రిత్వ శాఖ

దేశ ప్రజలకు 74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెల్పిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 15 AUG 2020 1:57PM by PIB Hyderabad

కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు . ' భారత్ నుంచి ఆత్మ్ నిర్భర్  భారత్ దశలోకి దేశం అడుగుపెడుతోందని  చెబుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో మన ప్రాధాన్యాలు దేశీయ అంతర్జాతీయ స్థాయిలో భారీ మార్పులు చెందాయని అయన తన ట్వీట్ లో అన్నారు . అంతేకాకుండా తమ ప్రభుత్వ లక్ష్యమైన ఆత్మ్ నిర్భర్ భారత్ కు ప్రపంచీకరణ  వంటి వాటితో పోలికలు ఉన్నాయా అనే అంశంపై ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతోందని వెల్లడించిన అయన ప్రపంచీకరణ  వల్ల అనేక ప్రయోజనాలున్న దానికి పరిమితులు కూడా అనేకం ఉన్నాయని యావత్ ప్రపంచాన్ని  గడగడలాడిస్తోన్న కోవిద్ 19 మహమ్మారి సంక్షోభంతో ఈ పరిమితులు అందరికి తెలిశాయని  ప్రధాన్ అన్నారు . మహమ్మారి వల్ల కల్గిన సంక్షోభ నివారణకు ఏ దేశానికి ఆ దేశం తమ దారిని చూసుకొందని గుర్తు చేసిన అయన ,స్వావలంబన సాదించడమంటే అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికున్న నిబద్దత బాధ్యతలు, భాగస్వామ్యాలు , బాధ్యతలను విస్మరించడం ఎంతమాత్రం కాదని, జాతీయ రక్షణకు సంబందించిన అంశాలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమమని   ప్రధాన్ స్పష్టం చేసారు.  ఈ అంశంపై అయన ఇంకా మాట్లాడుతూ భారతదేశం ఒక బాధ్యత గల ప్రపంచ దేశమని  దేశ సంస్కృతి , నాగరికత ప్రపంచమంతా ఒకటే కుటుంబం (వసుదైక కుటుంబకం) అనే భావాన్ని నమ్ముతుందని, దేశ ప్రజలు ప్రకృతిని తమ తల్లిగా, భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని అయన అన్నారు . తమ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రకటించిన సంస్కరణలు పోటీతత్వ  మార్కెట్లకున్న  శక్తిని  బయటకు తీయడానికి అవసరమైన    పారిశ్రామికీకరణ, సంపద సృష్టి,  ప్రపంచ సాంకేతికతను సాధించడానికి  మరిన్ని సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించే అనువైన వాతావరణ కల్పనకై ఉద్దేశించినవని ప్రధాన్ అన్నారు.  దేశ ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం తన ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచుకుంటూనే ఉంటుందని అయన అన్నారు 

 

****



(Release ID: 1646377) Visitor Counter : 166