రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

పానిపట్‌ ఎన్ఎఫ్‌ఎల్‌ యూనిట్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్‌ మాండవీయ

ఎరువుల వినియోగంలో సమతౌల్యం పాటించాలని సూచన

Posted On: 16 AUG 2020 6:19PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్‌ మాండవీయ, 'నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌' (ఎన్‌ఎఫ్‌ఎల్‌) పానిపట్‌ యూనిట్‌ను సందర్శించారు.

    యూనిట్‌లో సాగుతున్న పనులను కేంద్రమంత్రి సమీక్షించి, కరోనా సమయంలోనూ అంకితభావంతో సేవలందిస్తున్న 'ఎన్‌ఎఫ్‌ఎల్ కిసాన్‌' బృందాన్ని అభినందించారు. లాక్‌డౌన్‌ కఠిన ఆంక్షల మధ్య కూడా, ఎన్‌ఎఫ్‌ఎల్‌ అమ్మకాలు 71 శాతం పెరిగాయి.

    నాణ్యమైన గరిష్ట ఉత్పత్తి సాధనకు, భూసారాన్ని తగ్గకుండా కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర మంత్రి చెప్పారు. భూసార పరీక్షల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎరువుల వాడకంలో రైతులు సమతౌల్యం పాటించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అక్కడి అధికారులకు సూచించారు. సమావేశం తర్వాత, "అభివృద్ధి, బలం"కు గుర్తుగా ఒక మొక్కను నాటారు. మన్సుఖ్ మాండవీయ యూనిట్‌కు వచ్చిన సమయంలో, సంస్థ సీఎండీ వీరేంద్రనాథ్‌ దత్‌, ఇతర  ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.

    


    పానిపట్‌ ప్లాంట్‌ గురించి అక్కడి అధికారులు కేంద్రమంత్రికి సవివర ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా, ఎరువుల రంగ వ్యాపార అంశాలపై మంత్రి చర్చించి, కొన్ని సూచనలు చేశారు.

***



(Release ID: 1646331) Visitor Counter : 147