హోం మంత్రిత్వ శాఖ

బ్రిక్స్ కూటమి మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యాచరణ బృందం 4వ సమావేశం

డార్క్ నెట్ తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని మత్తు మందుల అక్రమ రవాణాకు వినియోగించడంపై భేటీ దృష్టి

మత్తు మందుల వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉండాలన్న సభ్యదేశాల అంకిత భావాన్ని పునరుద్ధాటిస్తూ తీర్మానం
ఆమోదం

Posted On: 16 AUG 2020 11:06AM by PIB Hyderabad

మాదక ద్రవ్యాలకు,, మత్తు మందులకు వ్యతిరేకంగా ఏర్పడిన కార్యాచరణ బృందం 4 సమావేశం వారం జరిగింది బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్. లకు బృందంలో సభ్యత్వం ఉంది. సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందానికి మాదకద్రవ్యాల నియంత్రణ  మండలి డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా నాయకత్వం వహించారు. మండలి డిప్యూటీ డైరక్టర్ జనరల్ బి. రాధిక, మరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కె.పి.ఎస్. మల్హోత్రా, మాస్కోలో భారత రాయబార కార్యాలయం వాణిజ్య విభాగం ఫస్ట్ సెక్రెటరీ వృందాబా గోహిల్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ డాక్టర్ వైభవ్ తాండాలే,..భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు. రష్యా అధ్యక్షతలో జరిగిన సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  2020 సంవత్సరం ఆగస్టు 12 తేదీన నిర్వహించారు.

    బ్రిక్స్ కూటమి సభ్య దేశాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పరిస్థితిపై, అంతర్జాతీయ, ప్రాంతీయ ధోరణులపై సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరిగాయి. మెదడుపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపే మత్తు మందులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ప్రభావితం చేసే పలు అంశాలపై కూడా భేటీలో చర్చ జరిగింది. సభ్యదేశాల ప్రతినిధులు పరస్పరం అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే అంశాలపై అంశాలపై సభ్యదేశాలు ఎప్పటికప్పుడు పరస్పరం సమాచారం అందజేసుకోవాలని, సముద్ర మార్గాల ద్వారా జరిగే అక్రమ రవాణాను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని  సభ్యదేశాలు అంగీకారానికి వచ్చాయి. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల అక్రమ రవాణాకోసం డార్క్ నెట్ తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగమవుతున్న అంశంపై సమావేశం దృష్టిని కేంద్రీకరించింది. చర్చించిన అంశాలన్నింటితో ఒక ఉమ్మడి తీర్మానాన్ని, ఉమ్మడి ప్రకటనను సమావేశం ఆమోదించింది.

   బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో బ్రిక్స్ కూటమి సభ్యదేశాల పాత్ర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ కూటమి ఒక చోధక శక్తిగా ఎదిగిందిబ్రిక్స్ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడం, సభ్యదేశాల ప్రకృతి వనరులు అంతర్జాతీయంగా ప్రభావం చూపడం ఇందుకు కారణం. మాదదక ద్రవ్యాలు, మత్తు మందుల అక్రమ రవాణా నియంత్రణపై సభ్యదేశాలన్నీ సహకారంతో ముందుకు సాగడం కూటమి ప్రత్యేకతగా నిలుస్తోంది.

*****

 


(Release ID: 1646317) Visitor Counter : 223