రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నిర్మాణ సామగ్రి వాహనాలకు సంబంధించి

భద్రతా నిబంధనల ప్రణాళికపై

సూచనలు కోరిన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ

Posted On: 16 AUG 2020 12:08PM by PIB Hyderabad

భద్రతకు సంబంధించి అంశాలపై ఒక నోటిఫికేషన్ ముసాయిదాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020, ఆగస్టు 13 జారీ చేసిందిజి.ఎస్.ఆర్. 502() పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.

  నిర్మాణ పరికర సామగ్రి వాహనాల భద్రతాపరమైన అవసరాలు, రహదారులపై ఇతర వాహనాలతోపాటు నిర్మాణ సామగ్రి వాహనాలు నడుస్తున్నపుడు దశలవారీగా సంపూర్ణ స్థాయిలో తీసుకోవలసిన భద్రతా చర్యలపై ముసాయిదాను వెలువరించారు. ఏప్రిల్ 21నుంచి తొలిదశలో, ఏప్రిల్ 24నుంచి రెండవ దశలో చర్యలు తీసుకుంటారు.

  నిర్మాణ పరికర సామగ్రి వాహనాలకు సంబంధించి భద్రతాపరమైన అంశాలను నిర్దేశిస్తూ కొన్ని నిబంధనలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. 1989 సంవత్సరపు సి.ఎం.వి.ఆర్. నిబంధనల ప్రకారం అంశాలను అమలు చేస్తున్నారు. భద్రతాపరమైన నిబందనలను ప్రవేశపెట్టేందుకు వీటిని అమలు చేస్తున్నారు. నాన్ మెటాలిక్ ఇంధన ట్యాంకులు, ప్రజారవాణా మార్గాలనుంచి వెలుపలికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం, హ్యాండ్ రెయిల్, హ్యాండ్ హోల్డ్స్, గార్డులు, విజువల్ డిస్ ప్లే ఏర్పాట్లు, ప్రయాణానికి సంబంధించిన హెచ్చరికలు అందించే యాత్రికపరమైన అలారాలు, వాహనం నడిపేవారికి వారి సీట్ల వద్ద తగిన ఏర్పాట్లువిద్యుదయాస్కంతం ఆధారంగా పనిచేసే కంపాటిబిలిటీ ఏర్పాట్లు, వాహనం నడిపే ఆపరేటర్  సస్పెన్షన్ సీటుపై కంపనాల నియంత్రణ తదితర భద్రతా అంశాలతో నిబంధనలు అమలు చేస్తూ వస్తున్నారు.

 ఇపుడు అదనంగా,..మరిన్ని భద్రతా నిబంధనలను చేరుస్తున్నారు. ఇందుకోసం సి.ఎం.వి.ఆర్. 96, 98-- నిబంధనలను సవరించదలుచుకున్నారు. బ్రేకులు, స్టీరింగ్ ఏర్పాట్లకు సంబంధించి సవరణలు చేపట్టనున్నారు. 2000 సంవత్సరం జూలై 28 జి.ఎస్.ఆర్.642 () పేరిట జారీ చేసిన నోటిఫికేషన్ ను సవరించబోతున్నారు.

    మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టుల అమలుకోసం నిర్మాణ పరికర సామగ్రి వాహనాలను విస్తృతంగా వినియోగిస్తారు. సదరు వాహనాలు నడిపే డ్రైవర్ భద్రతను, ఇతర వాహనాలతోపాటు నిర్మాణ సామగ్రి వాహనాలు నడుస్తున్నపుడు పాటించవలసిన భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని పలు రకాల నిబంధనలను జారీ చేయాలని ప్రతిపాదించారు

 ఇందుకు సంబంధించి ఎవరైనా తమ సూచనలను, అభిప్రాయాలను పంపించవచ్చు. న్యూఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ లోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (ఎం.వి.ఎల్.)కి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు పంపించవచ్చు. నోటిఫికేషన్ విడుదలైన 30రోజుల్లోగా సూచనలను jspb-morth[at]gov[dot]in అన్న మెయిల్ ఐడీకి  పంపించవచ్చు.

***

 

 



(Release ID: 1646297) Visitor Counter : 147