ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ ప్రజలను ఉద్దేశించి 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉపన్యాసంలోని ప్రధానాంశాలు

Posted On: 15 AUG 2020 2:09PM by PIB Hyderabad

1. నా ప్రియ‌ దేశ‌వాసులారా, స్వాతంత్య్రదినోత్సవ శుభసందర్భంగా మీకందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.

 

2. అసాధారణమైనటువంటి కరోనా కాలంలో, కరోనా యోధులు ‘సేవా పరమో ధర్మ:’ అనే మంత్రాన్ని అనుసరిస్తున్నారు. మన డాక్టర్ లు, నర్సు లు, పారామెడికల్ ఉద్యోగులు, ఆంబులెన్స్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రక్షకభటులు, అనేక మంది ప్రజలు రాత్రనక పగలనక ఎడతెగని రీతి లో శ్రమిస్తున్నారు.

 

3. ప్రకృతి విపత్తుల కారణం గా దేశం లోని వివిధ ప్రాంతాల లో వాటిల్లిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఆపత్కాలంలో ప్రజలకు తోటి పౌరుల సంపూర్ణ సాయం ఉంటుందని హామీ ఇచ్చారు.

 

4. భారతదేశం యొక్క స్వాతంత్ర్య సమరం యావత్తు ప్రపంచానికి ప్రేరణ నిచ్చింది.  విస్తరణవాదం అనే ఆలోచన కొన్ని దేశాల ను బానిసత్వం లోకి నెట్టివేసింది.  భీకర యుద్ధాల నడుమన సైతం, భారతదేశం తన స్వాతంత్ర్య సమరాన్ని విడనాడలేదు.

 

5. ప్రపంచవ్యాప్త కోవిడ్ మహమ్మారి నడుమ, 130 కోట్ల మంది భారతీయులు స్వయంసమృద్ధ భారత్ నిర్మాణానికి సంకల్పాన్ని పూనారు; వారి మనస్సు లో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆలోచన నాటుకొంది.  ఈ స్వప్నం ఒక శపథం లా మారుతున్నది.  ఆత్మనిర్భర్ భారత్ ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయులకు ఒక మంత్రం వలె అయిపోయింది.  నా తోటి పౌరుల శక్తి సామర్ధ్యాల పట్ల నాకు నమ్మకం ఉంది. ఒకసారి నిర్ణయం తీసుకొన్నాక మనం లక్ష్యాన్ని సాధించేటంత వరకు విశ్రమించం.

 

6. ప్రస్తుతం, ప్రపంచ దేశాల మధ్య అనుసంధానం పెరగడంతో, పరస్పరం ఆధారపడడం  కూడా పెరిగింది.   ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ముఖ్యమైన పాత్ర ను భారతదేశం పోషించవలసిన తరుణం ఇది.  వ్యవసాయ రంగం మొదలుకొని, అంతరిక్షరంగం నుండి ఆరోగ్యసంరక్షణ రంగం వరకు భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మాణానికి అనేక చర్యలను తీసుకొంటున్నాము.  ఈ చర్యల వల్ల యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, వారి నైపుణ్యాలను, సామర్ధ్యాలను ఇనుమడింపచేసుకొనేందుకు అవకాశాలు సమకూర్చుతాయన్న నమ్మకం నాలో ఉంది.

 

7. కేవలం కొద్ది నెలల క్రిందట, మనం ఎన్-95 మాస్కుల ను, పిపిఇ కిట్ లను, వెంటిలేటర్ లను విదేశాల నుండి దిగుమతి చేసుకొంటూ ఉండేవాళ్లము.  అటువంటిది మనం ఎన్-95 మాస్కుల ను, పిపిఇ కిట్ లను, వెంటిలేటర్ లను తయారు చేయడమే కాకుండా వీటిని పలు దేశాల కు ఎగుమతి చేయగల సామర్ధ్యాన్ని కూడా సమకూర్చుకున్నాము.

 

8. ‘మేక్ ఇన్ ఇండియా’ కు తోడు గా, మనం ‘మేక్ ఫర్ వరల్డ్’ మంత్రాన్ని కూడా ను అనుసరించవలసివుంది.

 

9. 110 లక్షల కోట్ల రూపాయల విలువైన జాతీయ మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఈ రంగానికి సంబంధించిన పథకానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.    మనం ఇప్పుడు కల్పనకు సంబంధించిన అనేక నమూనాలను అమలు చేయనున్నాము.   గిరి గీసుకొని పనిచేసే పద్ధతి ని ఇకపై మానివేయక తప్పదు.   సమగ్రమైన, మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి ని నిలపవలసివున్నది.  వివిధ రంగాల లో సుమారు 7,000 ప్రాజెక్టులను ఎంపిక చేశాము.  ఇది మౌలిక సదుపాయాల రంగం లో ఒక నూతన విప్లవాన్ని తీసుకువస్తుంది.

 

10. మన దేశం లోని ముడిపదార్థాలతో రూపు దిద్దుకొన్న వస్తువులు మన దేశానికి ఉత్పత్తుల రూపంలో తిరిగి రావడం ఇంకా ఎంత కాలం?  ఒకప్పుడు   మన వ్యవసాయ రంగం చాలా వెనుకబడి ఉండేది.   దేశ ప్రజలను పోషించడం  అనేది ప్రధాన సమస్యగా ఉండేది.   ఈ రోజు మనం అనేక దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్నాం.    స్వావలంబలన సాధించడమంటే  దిగుమతుల ను తగ్గించుకోవడం మాత్రమే కాదు, నైపుణ్యాలను, సృజ‌నాత్మక శక్తి ని కూడా పెంచుకోవడమని అర్థం.

 

11.  భారతదేశంలో అమలవుతున్న సంస్కరణల ను యావత్తు ప్రపంచం గమనిస్తోంది.  ఫలితంగా, విదేశీ పెట్టుబడులు రికార్డులను అధిగమించాయి.  భారతదేశం కోవిడ్ మహమ్మారి కాలం లో కూడా  విదేశీపెట్టుబడులు 18 శాతం వృద్ధి ని నమోదు చేశాయి.

 

12.   దేశం లోని పేదల జన్ ధన్ ఖాతాల లోకి లక్షలాది రూపాయలు రూపాయలు నేరు గా డిపాజిట్ చేయగలమని ఎవరైనా ఊహించారా?  రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన ఎపిఎంసి చట్టంలో అంత పెద్ద మార్పు రాగలదని ఎవరైనా అనుకున్నారా?   ప్రస్తుతం దేశం లో ‘ఒక దేశం-ఒక రేషన్ కార్డు  ఒక దేశం- ఒక పన్ను’, అప్పులు, దివాలాకు సంబంధించిన నియమావళి, బ్యాంకుల విలీనం వంటి ఎన్నో మార్పులు వాస్తవ రూపం దాల్చాయి.

 

13.   మహిళల సాధికారితకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాము.   నౌకాదళం, వాయుసేన వంటి పోరాట సర్వీసులలోకి  మహిళలను తీసుకొంటున్నాయి.  మహిళలు అనేక రంగాలలో నాయకత్వ స్థానంలో ఉన్నారు.  ముమ్మారు తలాక్ ద్వారా విడాకులు తీసుకొనే వ్యవస్థను రద్దు చేసుకొన్నాము.  ఒక్క రూపాయికే మహిళల కు శానిటరీ ప్యాడ్ ల ను అందించగలుగుతున్నాము.

 

14.   నా ప్రియ‌ దేశ‌వాసులారా,  మన కు ‘సామర్థ్యమూలం స్వాతంత్ర్యం, శ్రమమూలం వైభవమ్’ అని ఒక నానుడి ఉంది. ఒక దేశం యొక్క శక్తి ఆ దేశ స్వాతంత్య్రమని, ఆ దేశ సౌభాగ్యానికి, అభివృద్ధికి మూలం ఆ దేశంలోని శ్రామిక శక్తి అని దీని అర్థం.

 

 

15.   దేశం లోని 7 కోట్ల పేద కుటుంబాల కు గ్యాస్ సిలిండర్ లను ఉచితం గా ఇచ్చాము, 80 కోట్ల మందికి పైగా ప్రజల కు రేషన్ కార్డులు ఉన్నా, లేకపోయినా ఆహారధాన్యాన్ని ఉచితంగా అందించాము. సుమారు 90 వేల కోట్ల రూపాయల ను బ్యాంకు ఖాతాల లోకి నేరుగా డిపాజిట్ చేశాము. పేదల కు వారి గ్రామాలలోనే ఉపాధి ని కల్పించడం కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ను ప్రారంభించాము.

 

16.   ‘వోకల్ ఫర్ లోకల్’, ‘రి-స్కిల్ ఎండ్ అప్-స్కిల్’ ప్రచార ఉద్యమాలు, దారిద్య్ర రేఖ కు దిగువన ఉన్న ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుస్తాయి.   

 

17.    దేశం లోని అనేక ప్రాంతాలు అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నాయి.  అటువంటి 110 కి పైగా జిల్లాల ను ఎంపిక చేసి, అక్కడి ప్రజలు మెరుగైన  విద్య, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు,  ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాము.

 

18.   దేశంలోని రైతులకు ఆధునిక మౌలిక సదుపాయాల ను సమకూర్చడం కోసం లక్ష కోట్ల రూపాయల తో ‘వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల నిధి’ ని ఏర్పాటుచేశాము.  వ్యవసాయరంగంలో స్వావలంబన సాధించడానికి ఇది మరో ముందడుగు.

 

19.   గత సంవత్సరం ఎర్ర కోట నుంచే నేను ‘జల్ జీవన్ మిషన్’ ను ప్రకటించాను.  ఈ మిషన్ లో భాగం గా, ఈ రోజు లక్షకు పైగా ఇళ్లకు  కొళాయి ద్వారా మంచినీళ్ళను అందిస్తున్నాము.   

 

20.   మధ్యతరగతికి చెందిన వృత్తినిపుణులు అనేక మంది భారతదేశంలోనే గాక, అనేక దేశాలలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు.  మధ్యతరగతి ప్రజలకు కావలసిందల్లా అవకాశం,  ప్రభుత్వ జోక్యం నుంచి స్వేచ్ఛ.

 

21.   ఇంటి రుణం తాలూకు ఇఎంఐ చెల్లింపులకు రూ. 6 ల‌క్ష‌ల వర‌కు రిబేటు ను పొందడం కూడా ఇదే ప్రథమం. అసంపూర్తి గా ఉండిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయ‌డం కోసం గత సంవత్సరం 25,000 కోట్ల రూపాయల తో ఒక నిధి ని ఏర్పాటు చేశాము.

 

22. ఆధునిక, స్వావలంబన భారత్ సాధనలో విద్యా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  ఆదునికమైన, స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణంలో విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ, నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాము.

 

23.   క‌రోనా కాలం లో, డిజిట‌ల్ ఇండియా ఎంత ప్రముఖమైన పాత్ర వహించిందో చూశాము.  ఒక్క భీమ్ యుపిఐ ద్వారానే, గ‌త నెల‌ రోజులలో  3,00,000 కోట్ల రూపాయల లావాదేవీ లు నమోదయ్యాయి.

 

24.  2014 సంవ‌త్స‌రానికి ముందు కేవలం 5 డ‌జ‌న్ ల పంచాయ‌తీలు అనుసంధాన‌మై ఉండేవి.  గ‌త ఐదేళ్ల కాలం లో 1.5 ల‌క్ష‌ల గ్రామ పంచాయ‌తీల‌ కు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ను విస్తరించాము.  దేశం లోని మొత్తం 6 ల‌క్ష‌ల గ్రామాలను రాబోయే 1000 రోజుల కాలం లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ సౌకర్యం కల్పిస్తాము.

 

25.   నా ప్రియ‌ దేశ‌వాసులారా, మ‌హిళలకు అవ‌కాశం అందిన‌ప్పుడ‌ల్లా వారు దేశాని కి కీర్తి ప్ర‌తిష్ఠ‌లను తీసుకు వ‌స్తూ దేశాన్ని ప‌టిష్ఠం చేశార‌ని మ‌న అనుభ‌వాలు చెబుతున్నాయి.  ఈ రోజు న మ‌హిళ‌ లు కేవ‌లం బొగ్గు గ‌నులలో ప‌ని చేయ‌డ‌మే కాదు, యుద్ధ విమానాలను సైతం న‌డుపుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.

 

26.  దేశంలో ప్రారంభ‌మైన 40 కోట్ల జ‌న్ ధ‌న్ ఖాతాలలో దాదాపుగా 22 కోట్ల ఖాతాలు మ‌హిళ‌లవే.  క‌రోనా కాలం లో, ఏప్రిల్‌, మే, జూన్ ఈ మూడు నెల‌ల్లో, సుమారు గా 30,000 కోట్ల రూపాయలను ఈ ఖాతాల లోకి నేరు గా డిపాజిట్ చేశాము.

 

27.   క‌రోనా మొదలైన నాటికి, మన దేశం లో క‌రోనా పరీక్షల కోసం ఒకే ఒక్క ల్యాబ్  ఉండేది.  దేశం లో ప్రస్తుతం 1400 కు పైగా ల్యాబ్ లు ఉన్నాయి.

 

28. ఈ రోజు నుండి దేశం లో మ‌రో పెద్ద కార్య‌క్ర‌మం అమ‌లు కానుంది.  అదే నేషనల్  డిజిట‌ల్ హెల్త్ మిషన్.  దేశం లో ప్ర‌తి ఒక్కరి కి  హెల్త్ ఐడి ని ఇవ్వడం జరుగుతుంది.  నేషనల్  డిజిట‌ల్ హెల్త్ మిషన్ భార‌తదేశ ఆరోగ్య రంగం లో ఒక పెద్ద విప్ల‌వాన్ని తీసుకు వ‌స్తుంది.  ఏ వ్యాధికైనా స‌రే మీరు చేయించుకునే వైద్య ప‌రీక్ష‌లు, వైద్యులు మీకు ఇచ్చిన మందులు, మీ వైద్య నివేదిక లు ఎప్పుడు, ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి వంటి స‌మాచారం అంతా ఈ ఆరోగ్య ఐడి లో నిక్షిప్త‌మై ఉంటుంది.

 

29.  ఈ రోజు న, దేశం లో ఒక‌టి కాదు, రెండు కాదు, ఏకం గా మూడు క‌రోనా టీకామందు లు ప‌రీక్ష‌ల ద‌శ‌ కు చేరుకొన్నాయి.  శాస్త్రవేత్త‌ల  నుండి అనుమతి రాగానే ఆ వ్యాక్సిన్ లను పెద్ద ఎత్తు న ఉత్ప‌త్తి చేసేందుకు దేశం సిద్ధం గా ఉంది.

 

30.  ఇది జ‌మ్ము- క‌శ్మీర్ ను కొత్త అభివృద్ధి బాట‌ లో ప్ర‌వేశ‌పెట్టిన సంవ‌త్స‌రం.  జ‌మ్ము- క‌శ్మీర్ లో మ‌హిళ‌ లు, ద‌ళితుల‌ కు హ‌క్కులు క‌ల్పించిన సంవ‌త్స‌రం.  జ‌మ్ము- క‌శ్మీర్ లో శ‌ర‌ణార్థుల‌ కు గౌర‌వ‌నీయ‌మైన జీవ‌నాన్ని అందించిన సంవ‌త్స‌రం.  జ‌మ్ము- క‌శ్మీర్ లో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు నూతన అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్న సంవత్సరం.   

 

31.   గ‌త సంవత్సరంలో ల‌ద్దాఖ్ ను కేంద్ర‌పాలిత ప్రాంతం గా ప్ర‌క‌టించ‌డం ద్వారా ఎంతో కాలంగా అప‌రిష్కృతం గా ఉన్న ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేరింది.  హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల లో ఎత్తైన ప్రాంతం లో ఉన్న ల‌ద్దాఖ్ అభివృద్ధి లో నూతన శిఖ‌రాల‌కు చేరేందుకు ముంద‌డుగు వేస్తున్నది.  సిక్కిమ్ లాగా రానున్న రోజులలో ల‌ద్దాఖ్ కూడా కర్బ‌న ర‌హిత ప్రాంతం గా ప్ర‌త్యేక గుర్తింపును పొంద‌నుంది. ఈ దిశ‌ గా ప్ర‌య‌త్నం ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌యింది.

 

32.  దేశం లో ఎంపిక చేసిన 100 న‌గ‌రాలలో కాలుష్యాన్ని అదుపు లోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన ఒక సమగ్ర కార్యక్రమానికి  రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది.

 

33.  జీవ‌వైవిధ్యం పై భార‌తదేశాని కి సంపూర్ణమైన అవ‌గాహ‌న ఉంది. జీవ‌వైవిధ్యం ప‌రిర‌క్ష‌ణ‌ కు, ప్రోత్సాహాని కి భారత్ పూర్తి గా క‌ట్టుబ‌డి ఉంది.  ఇటీవ‌లి కాలం లో దేశం లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  ఆసియా ప్రాంత సింహాల సంత‌తిని ప‌రిర‌క్షించి అభివృద్ధి చేయ‌డానికి ఒక ప్ర‌త్యేక ప్రణాళిక కూడా ప్రారంభం కానుంది.  అదే విధం గా ప్రాజెక్టు డాల్ఫిన్ ను కూడా ప్రారంభిస్తున్నాము.

 

34.  ఎల్ఒసి నుండి ఎల్ఎసి వ‌ర‌కు దేశ సార్వ‌భౌమత్వాన్ని సవాలు చేసినవారు ఎవరైనా మన సైనిక బ‌లం స‌రైన స‌మాధానాన్ని ఇచ్చాయి.  భార‌తదేశ సార్వ‌భౌమ‌త్వం మనకు ఎంతో ప్రధానమైనది.  వాస్తవాధీనరేఖను దాటినప్పుడు మన వీర సైనికులు ఏమి చేయ‌గ‌ల‌రో లద్దాఖ్ లో ప్రపంచమంతా చూసింది.

 

35.  ప్ర‌పంచ జ‌నాభా లో నాలుగో వంతు ద‌క్షిణాసియాలోనే నివ‌సిస్తున్నారు.  స‌హ‌కారం, భాగ‌స్వామ్యం తో మ‌నంద‌రం అంత భారీ జ‌నాభా కు అప‌రిమిత‌మైన అభివృద్ధి అవ‌కాశాల ను, సుసంప‌న్న‌త ను అందించ‌గ‌లుగుతాము.

 

36.  మ‌న స‌రిహ‌ద్దులలో, తీర ప్రాంతాలలో ఉన్న మౌలిక సదుపాయాలు దేశ భద్రతకు ఎంతో కీలకం.  హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణులలోను, హిందూ మ‌హాస‌ముద్రం లోని దీవుల లోను... అన్ని ప్రాంతాలలోనూ ఇంత‌కు ముందు ఎన్న‌డూ క‌ని విని ఎరుగ‌ని రీతి లో రోడ్ల విస్త‌ర‌ణ‌, ఇంట‌ర్ నెట్ సౌకర్యం కల్పిస్తున్నాము.  

 

37.  మ‌న దేశం లో 1300 కి పైగా దీవులు ఉన్నాయి.  వాటి భౌగోళిక స్వ‌భావాన్ని బ‌ట్టి, ఎంపిక చేసిన ద్వీపాలలో కొత్త అభివృద్ధి ప‌థ‌కాలను ప్రారంభించేందుకు కృషి జ‌రుగుతోంది.  అండ‌మాన్‌, నికోబార్ దీవులతోపాటు, రాబోయే 1000 రోజుల కాలంలో ల‌క్ష‌ద్వీప్ దీవులను కూడా సబ్ మరీన్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్  నెట్ వర్క్ తో అనుసంధానించనున్నాము.    

 

38.  దేశం లోని 173 స‌రిహ‌ద్దు, కోస్తా జిల్లాల లో ఎన్ సిసి విస్త‌ర‌ణ జ‌రుగ‌నుంది.  ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా ఆయా ప్రాంతాల లో ల‌క్ష మంది కొత్త ఎన్ సిసి కేడెట్ లకు ప్ర‌త్యేక శిక్ష‌ణ నివ్వ‌డం జ‌రుగుతుంది.  వారిలో సుమారుగా మూడింట ఒక వంతు మంది బాలికలు ప్రత్యేక శిక్షణ పొందబోతున్నారు.

 

39.  మ‌న విధానాలు, మ‌న పద్ధతులు, మ‌న ఉత్ప‌త్తులు, అత్యుత్త‌మంగా ఉండాలి.  అప్పుడే  ‘ఏక్ భార‌త్‌- శ్రేష్ఠ్ భార‌త్’ ను సాధించుకోగలము.

 

40.  ‘అనేక సౌకర్యాలతో జీవించడం’ (ఈజ్ ఆఫ్ లివింగ్) కార్య‌క్ర‌మం తో అధికంగా ల‌బ్ధి పొందింది మ‌ధ్య‌ త‌ర‌గ‌తే; చౌక గా ఇంట‌ర్ నెట్ మొదలుకొని త‌క్కువ ధ‌ర‌ల‌ తో కూడిన విమాన టిక్కెట్ ల వరకు, తక్కువ ఖర్చు తో కూడిన గృహ‌ నిర్మాణ‌ం నుండి ప‌న్ను తగ్గింపు వరకు ఈ చ‌ర్య‌లన్నీ దేశం లో మ‌ధ్య‌ త‌ర‌గ‌తి స్థితిగతులను మరింత మెరుగుపరిచేవే. 

 

***



(Release ID: 1646112) Visitor Counter : 320