గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రముఖ అతిథులకు చేతి తయారీ విసనకర్రల సేవలు మరో సారి ఏర్పాటు చేయనున్న ట్రైఫెడ్
Posted On:
14 AUG 2020 2:44PM by PIB Hyderabad
గిరిజనుల ఆదాయాన్ని జీవనోపాధిని సుస్థిరం చేసే కృషిలో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థ (ట్రైఫెడ్) మరోసారి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో చేయీ చేయీ కలిపింది. ఈ సంవత్సరం జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యే ప్రముఖులైన అతిథులకు చేతి తయారీ విసనకర్రలు అందించేందుకు ట్రైఫెడ్ ఈ ఏర్పాటు చేసుకుంది. విసనకర్రల సరఫరా కోసం ట్రైఫెడ్ వరుసగా 3వ సంవత్సరం ఈ ఏర్పాటు చేసుకుంది.
రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు చెందిన గిరిజన హస్తకళా నిపుణుల ద్వారా తయారు చేయించిన ఈ విసనకర్రలు పర్యావరణ హితమైనవి. సహజసిద్దమైన, సేంద్రియ ఉత్పాదనలను ఉపయోగించి వీటిని తయారు చేశారు. ఈ విసనకర్రలు గతకాలపు స్మృతులను గుర్తుకు తెచ్చేలా ఉంటాయి. గతంలో మన ఇళ్లలో తీవ్రమైన ఎండ వేడిమినుంచి ఎంతో ఉపశమనం కలిగించిన జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఇవి దోహపడతాయి.


ట్రైబ్స్ ఇండియా ఫంకాలుగా పేర్కొనే ఈ విసనకర్రలు దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబ్స్ ఇండియా సంస్థ రిటైల్ దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. www.tribesindia.com అనే ఈ కామర్స్ సైట్ లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.
దేశవ్యాప్తంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న గిరిజనుల, గిరిజన సంఘాల ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ వారికి సాధికారత కల్పించే కృషిలో భాగంగా ట్రైఫెడ్ పలు చర్యలు తీసుకుంటోంది. వారి ఉత్పాదనలకు మార్కెటింగ్ సదుపాయం పెంచి, వారి నైపుణ్యాల స్థాయిని మరింత మెరుగుపరచడం ద్వారా ఆర్థిక సాధికారత కల్పించేందుకు ట్రైఫెడ్ ఎంతో పాటుపడుతోంది. గిరిజన సంక్షేమానికి సంబంధించి కేంద్ర సంస్థ హోదాలో ట్రైఫెడ్,..గిరిజన హస్తకళా ఉత్పాదనలను సేకరించడం, వాటికి తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ప్రారంభించింది. ట్రైబ్స్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన రిటెయిల్ దుకాణాల వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని మహదేవ్ రోడ్డులో 1999లో ఒకే ఒక దుకాణంతో మొదలైన ఈ వ్యవస్థ పరిధిలో ఇపుడు దేశవ్యాప్తంగా 121 రిటెయిల్ దుకాణాలు ఏర్పాటయ్యాయి.
గత కొంతకాలంగా ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయిన గిరిజనులకు తగిన పునరావాసం కల్పించేందుకు ట్రైఫెడ్ సంస్థ గత కొన్ని నెలలుగా తన పయత్నాను మూడు రెట్లు పెంచింది. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే, చేతి తయారీ విసనకర్రలను ప్రముఖులైన అతిథులకు కానుకలుగా ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ట్రైఫెడ్ చేపట్టింది.
అకస్మాత్తుగా విరుచుకుపడిన కరోనా వైరస్ మహమ్మారి, ఆ వెంటనే ఎదురైన లాక్ డౌన్ కష్టాలతో గిరిజన హస్త కళాకారులు తయారు చేసిన వందకోట్ల రూపాయల విలువైన ఉత్పాదనలు అమ్మకానికి నోచుకోకుండా అలాగే నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన గిరిజన ఉత్పత్తుల అమ్మకానికి భరోసా కల్పించేందుకు వీటిని ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి ట్రైఫెడ్ చర్యలు చేపట్టింది. www.tribesindia.com అనే ట్రైబ్స్ ఇండియా వెబ్ సైట్ ద్వారా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, GeM వంటి ఈ కామర్స్ సైట్ల ద్వారా భారీ ఎత్తున విక్రయాలకు ట్రైఫెడ్ చర్యలు తీసుకుంది.


ఇక, గిరిజన ఉత్పత్తిదారులు, ఆదివాసులు, హస్తకళా నిపుణులు తయారు చేసిన ఉత్పాదనలను మార్కెట్ చేసేందుకు త్వరలో ప్రారంభించబోయే ఈ మార్కెట్ వేదికకోసం ట్రైఫెడ్ ఇపుడు కృషి చేస్తోంది. హస్తకళా ఉత్పత్తులను, చేనేతలను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు సదపాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గిరిజనలు తమ సరకులను, ఉత్పత్తులను విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగానే కాక, అంతర్జాతీయంగా కూడా విక్రయించే ఏకైక వేదికగా, వారి సొంత ఈ షాప్ గా ఈ మార్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఇందుకోసం ట్రైఫెడ్ ఇపుడు దాదాపు ఐదులక్షల మంది గిరిజన ఉత్పత్తిదారులకు స్థానం కల్పిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖకు సరఫరా చేసే విసనకర్రలను కూడా ఇదే ఈ మార్కెట్ వేదికపై అందుబాటులో ఉంచబోతున్నారు.
గిరిజన ఉత్పత్తుల సరఫరాకు రక్షణ మంత్రిత్వ శాఖతో కుదిరిన ఈ ఏర్పాటు,..గిరిజనుల అభ్యున్నతి లక్ష్యంగా ట్రైఫెడ్ కొనసాగిస్తున్న కృషికి తార్కాణం. ఇప్పటికే అందుబాటులో ఉంచిన గిరిజజనుల చేతి తయారీ విసనకర్రలను ట్రైబ్స్ ఇండియా దుకాణాల్లో ఎవరైనా తిలకించవచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంటిలో వినియోగంలో ఉండిన ఈ విసనకర్రలు మన చిన్ననాటి స్మృతులను నెమరువేయిస్తాయి. ఈ నేపథ్యంలో,..74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్రైఫెడ్ బృందం ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది.
***
(Release ID: 1645857)
Visitor Counter : 176