సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్సీ విద్యార్థులకు ఇచ్చే 'నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్'లో కీలక మార్పులు, 2020-21 నుంచి అమలు
నాడు పోస్టు చేయడమైనది:
13 AUG 2020 5:12PM by PIB Hyderabad
ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన 'నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్'ను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. విద్యార్థి ఎంపిక సంవత్సరమైన 2020-21 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయంగా ఉత్తమ ర్యాంకులున్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. కనీస అర్హత మార్కులను 55 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. విద్యార్థి ప్రగతి ఆధారంగా నిర్వహణ భత్యం ఇస్తారు. వివిధ పరిశీలన ప్రక్రియలను సరళతరం చేశారు. పోలీసు ధృవీకరణ రద్దు చేసి, విద్యార్థి స్వీయ ప్రకటనను తీసుకొచ్చారు.
ఈ మార్పుల వల్ల ఎంపిక ప్రక్రియ మరింత సులభంగా మారింది. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది అన్ని స్లాట్లు తక్కువ సమయంలోనే నిండే అవకాశం ఉంది. ఈ ఎంపిక ఏడాది తొలి త్రైమాసికంలో, దరఖాస్తుల స్వీకరణ ఆధారంగా, 100 స్లాట్లకు గాను 42 స్లాట్లు ఇప్పటికే నిండిపోయాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
***
(రిలీజ్ ఐడి: 1645577)
సందర్శకుల సూచీ సంఖ్య : : 108