ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ టీకా లభ్యత, దాని చేరిక యంత్రాంగాన్ని నిర్ధారించే వ్యూహంపై సమాలోచనలు

Posted On: 12 AUG 2020 5:28PM by PIB Hyderabad

కోవిడ్-19 టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల గ్రూప్ తొలి సారి ఆగష్టు 12న సమావేశం అయింది. నీతి ఆయోగ్ సభ్యడు డాక్టర్ వి.కె. పాల్ అధ్యక్షతన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సహాధ్యక్షతన  సమావేశం జరిగింది. 

వ్యాక్సిన్ జాబితా పట్టిక నిర్వహణ, చేరవేసే యంత్రాంగం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన పై కోసం భావగ్రహణం, అమలు విధానాలపై నిపుణుల బృందం చర్చించింది, చిట్టచివరి మైలు రాయి వరకు చేరేలా  ప్రత్యేక దృష్టితో టీకా ప్రక్రియను ట్రాక్ చేయడంపై కూడా చర్చించింది. దేశానికి కోవిడ్-19 వ్యాక్సిన్ కాండిడేట్స్ ఎంపికకు మార్గనిర్దేశం చేసే విస్తృత పారామితులపై వారు చర్చించారు. రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టిఎజిఐ) స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ నుండి వివరాలను కోరారు. ఈ బృందం కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం సేకరణ విధానాలపై పరిశోధన చేసింది, ఇందులో స్వదేశీ, అంతర్జాతీయ తయారీతో పాటు టీకాలు వేయడానికి జనాభా సమూహాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి.

కోవిడ్-19 వ్యాక్సిన్ సేకరణకు అవసరమైన ఆర్థిక వనరులపై నిపుణుల బృందం చర్చించింది. డెలివరీ ప్లాట్‌ఫాంలు, కోల్డ్ చైన్ మరియు కోవిడ్-19 టీకాని  బయటకు తేవడానికి అనుబంధ మౌలిక సదుపాయాల పరంగా అందుబాటులో ఉన్న పరిస్థితులను ఈ సమావేశం కూలంకషంగా విశ్లేషించింది. ఇంకా, వ్యాక్సిన్ సమానమైన, పారదర్శక పంపిణీని నిర్ధారించడానికి సాధ్యమయ్యే అన్ని పరిస్థితులపై వ్యూహం తదుపరి చర్యలపై చర్చించారు. వ్యాక్సిన్ భద్రత, నిఘాకు సంబంధించిన సమస్యలను సమీక్షించారు. పారదర్శక సమాచారం, అవగాహన కల్పన ద్వారా సమాజ భాగస్వామ్య  వ్యూహం గురించి కూడా చర్చ జరిగింది. 

కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం భారతదేశం దాని ముఖ్య పొరుగుదేశాలకు, అభివృద్ధి భాగస్వామి దేశాలకు మద్దతు ఇవ్వడం గురించి చర్చకు వచ్చింది. భారతదేశం దేశీయ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని, భారత్ లోనే కాకుండా అల్పాదాయ, మధ్యతరగతి ఆదాయ దేశాలలో కూడా వ్యాక్సిన్లను త్వరగా పంపిణీ చేయడానికి అన్ని అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేయాల్సి ఉంటుందని నిపుణుల బృందం అభిప్రాయపడింది.
రాష్ట్రాలు ప్రత్యేక సేకరణకు వేరే మార్గాలలోకి వెళ్లవద్దని కమిటీ అన్ని రాష్ట్రాలకు సూచించింది.

 

****(Release ID: 1645430) Visitor Counter : 301