శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ(ఐఐఏ) వ్యవస్థాపకులు డా. వైను బప్పు గారి ఆశయాలను కొనసాగించడానికి విద్యార్థుల ఆలోచనలకు అనుభవజ్ఞులైనవారి అనుభవాలను కలపి పనిచేయాలి: ఐఐఏ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న వక్తలు

50వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ(ఐఐఏ)

Posted On: 12 AUG 2020 1:06PM by PIB Hyderabad

నవీన విద్యార్థులు నూతన ఆలోచనలకు ఖగోళ భౌతిక శాస్త్ర రంగంలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన భారతీయ ఖగోళ శాస్త్ర సంస్థలోని అనుభవజ్ఞులైనవారి ఆలోచనలను మిళితం చేయడం వలన సంస్థ వ్యవస్థాపకులు డా.వైనుబప్పుగారి ఆశయాలను సాధించవచ్చని ఐఐఏ 50వ వ్యవస్థాపక దినోత్సంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.  

గొప్ప దూరదృష్టితో భారతీయ ఖగోళ భౌతిక  శాస్త్ర సంస్థను డా. వైనుబప్పు గారు ప్రారంభించిన సంస్థకు ఈ సంవత్సరం 50వ సంవత్సరంగా  ఏంతో ప్రత్యేకమైనది.  ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పునర్నిర్మాణ దిశగా అడుగులేస్తున్న దేశానికి ఉన్నత ఆశయాలు కలిగిన నాయకుల అవసరం ఎంతో ఉంది.  వ్యవస్థాపకులు సంస్థను స్థాపించిన ఆశయాల సాధకు క్రొత్తవారి ఆలోచనలు మరియు గత ఐదు దశాబ్దాలుగా గడించిన అనుభశాలుర అనుభావలను మిళితంచేయవలసిన అవసరం ఉందని ఐఐఏ-50వ సంవత్సరాల సంబరాలను ప్రారంభించిన ఢిఎస్టి కార్యదర్శి ప్రొ. అశుతోష్ శర్మ అన్నారు.

 “ఇప్పటి వరకు ఐఐఏ నాణ్యమైన మానవ వనరులను, మౌళిక వనరులను మరియు ఖగోళ శాస్త్ర పరిశీలను శాస్త్రీయంగా లోతుగా పరిశీలించుటను మరియు సంస్థను నూతన దృష్టితో  మరింత ఎత్తుకుతీసుకు వెళ్ళడానికి  కృషి చేస్తుందని ఆయన అన్నారు.

భారత ప్రభుత్వపు శాస్త్ర మరియు సాంకేతిక విభాగం(డిఎస్టి) వారి  పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగి పనిచేస్తున్న భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ(ఐఐఏ) 10 ఆగస్టు 2020న ఆన్లైన్లో  50వ వ్యవస్థాక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ కె. విజయరాఘవన్ ఉపన్యాసించారు.

భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ(ఐఐఏ)కు తన విలువైన సేవలను అందించిన, వ్యవస్థాపకులైన డా. మనాలి కల్లత్ వైనుబప్పుగారి  జన్మదినోత్సవం రోజున సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సంవత్సరం సంస్థ 50వ సంవత్సరంలోనికి అడుగిడి 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.

ఐఐఏ విద్యార్థులు తమ వ్యాసాలతో కూర్చిన  సంచిక ’దూత్’ను ఐఐఏ పాలక మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ అవినాష్ సి. పాండే విడుదల చేసారు. శాస్త్ర సాంకేతిక విషయాలను సరళంగా సామాన్యులకు చేరే విధంగా విద్యార్థులు సృజనాత్మకతను జోడించడానికి ఈ సంచిక  మంచి వేదికను కూర్చుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐఐఏ పూర్వ సంచాలకుల యొక్క క్లుప్త సందేశాలను ఈ సందర్భంగా ప్రజలకు అందించారు సంస్థ ప్రస్తుత సంచాలకులు ప్రొ. అన్నపూర్ణి సుబ్రమణ్యం

 

 

 

*****

 



(Release ID: 1645314) Visitor Counter : 135