హోం మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

ఏ దేశానికైనా అతి పెద్ద బలం, ఆస్తి యువతే. గొప్ప ఆశయాలు, నైపుణ్యాలున్న యువశక్తిని దేవుడి ఆశీస్సులతో భారత్‌ పొందింది: అమిత్‌ షా

ఎదురయిన అవకాశాలతో అద్భుతాలు సృష్టించే శక్తి నైపుణ్యవంతులు, ఉత్సాహవంతులైన యువతకు ఉంది: అమిత్‌ షా

నైపుణ్య భారత్‌, అంకుర భారత్‌, భారత్‌లో తయారీ, ఎన్‌ఈపీ వంటి కార్యక్రమాల ద్వారా, యువతలో దాగున్న అపారశక్తిని వెలికితీసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం సృష్టిస్తోంది: అమిత్‌ షా

ప్రధాని మోదీ కలలుగన్న 'నవ భారత్‌' కోసం యువత తప్పకుండా కష్టపడుతుంది: అమిత్‌ షా

నాడు పోస్టు చేయడమైనది: 12 AUG 2020 1:21PM by PIB Hyderabad

అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. ఏ దేశానికైనా అతి పెద్ద బలం, ఆస్తి యువతేనంటూ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప ఆశయాలు, నైపుణ్యాలున్న యువశక్తిని దేవుడి ఆశీస్సులతో భారత్‌ పొందిందని పేర్కొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కలలుగన్న 'నవ భారత్‌' కోసం యువత తప్పకుండా కష్టపడుతుందని అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

    తాము నడిచే దారిలో ఎదురయిన అవకాశాలతో అద్భుతాలు సృష్టించే శక్తి నైపుణ్యవంతులు, ఉత్సాహవంతులైన యువతకు ఉందని అమిత్‌ షా అన్నారు.

    నైపుణ్య భారత్‌, అంకుర భారత్‌, భారత్‌లో తయారీ, కొత్త విద్యావిధానం (ఎన్‌ఈపీ) వంటి కార్యక్రమాల ద్వారా, యువతలో దాగున్న అపారశక్తిని వెలికితీసే వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిరంతరం సృష్టిస్తోందని అమిత్‌ షా తన ట్వీట్‌లో వెల్లడించారు.

***


(రిలీజ్ ఐడి: 1645301) సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam