నీతి ఆయోగ్

అటల్ ఇన్నొవేషన్ మిషన్, డెల్ టెక్నాలజీస్ ప్రారంభించిన విద్యార్థి వ్యాపార దక్షత కార్యక్రమం

Posted On: 11 AUG 2020 6:16PM by PIB Hyderabad

విద్యార్థులలో వ్యాపార దక్షత పెంపొందించే కార్యక్రమం (ఎస్ ఇ పి) కార్యక్రమాన్ని ఈరోజు నీతి ఆయోగ్ లోని అటల్ ఇన్నొవేషన్ మిషన్ ప్రారంభించింది. ఇది అటల్ టింకరింగ్ లాబ్స్(ఎటిఎల్) కు చెందిన యువజనుల నవకల్పనలకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది. నిజానికి ఇది మొదటి దశ అద్భుత విజయం సాధించటంతో రెండో దశను నితి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజీవ్ కుమార్, డెల్ టెక్నాలజీస్ ఎండి, ప్రెసిడెంట్ అయిన అలోక్ ఓరీ, ఎయిమ్ సంస్థ మిషన్ డైరెక్టర్  శ్రీ ఆర్ రమణన్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చెయిర్ పర్సన్ డాక్టర్ అంజరీ ప్రకాశ్ సమక్షంలో ప్రారంభమైంది.

"యువత రూపొందించిన నవకల్పనలను చూస్తున్నప్పుడు భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా కనబడుతోంది. ఆలోచించే అవకాశమిస్తే ఈ దేశ యువత ఎంత అసాధారణంగా ఆలోచిస్తారో, ఎన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే స్థాయికి ఎదుగుతారో అర్థమవుతోంది. మొదటి విడత విద్యార్థి వ్యాపార దక్షత కార్యక్రమం ముగించి రెండో దశకు శ్రీకారం చుట్టటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. వీరి నవకల్పనల ప్రభావం దేశం మీద ఎంతగా ఉంటుందో అర్థమవుతోంది" అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు.

నవకల్పనల రూపకర్తలైన యువత ఈ రెండో విడత కార్యక్రమంలో డెల్ వాలంటీర్లతో కలిసి పనిచేస్తారు. వాళ్ళకు మార్గదర్శనంతోబాటు ప్రొటోటైపింగ్, టెస్టింగ్ లాంటి విషయాల్లో అవసరమైన మద్దతు అందుతుంది. వాడకం దారుల అభిప్రాయాలు, మేధో సంపత్తి హక్కుల నమోదు. ఆలోచనల పేటెంట్ రిజిస్ట్రేషన్, తయారీ మద్దతు లాంటివి కూడా పొందవచ్చు. ఉత్పత్తిని మార్కెట్లో విడుదలచేసే విషయంలోనూ సహకారం అందుతుంది.  


" సరికొత్త టెక్నాలజీలను విద్యార్థులకు వర్తింపజేస్తూ వారి అనుభవాలకు పదును పెట్టటానికి డెల్ కృషి చేస్తుందని డెల్ టెక్నాలజీస్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ శ్రీ అలోక్ ఓరీ చెప్పారు. దీనివలన వారి ఆలోచనాత్మక మెదళ్ళు మరింతగా వృద్ధి చెందుతాయన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థి వ్యాపార దక్షత కార్యక్రమం ఫలితాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతూ తరువాత బ్యాచ్ ఎలాంటి ఫలితాలనిస్తుందో మరింత ఆసక్తిగా ఉందన్నారు. నీతి ఆయోగ్ తో బలమైన భాగస్వామ్యం వలన మెరుగైన సమాజం కోసం టెక్నాలజీ ని ఎలా వాడుకోవచ్చునో చెబుతూ యువ వ్యాపారులను ప్రోత్సహించటం సాధ్యమవుతుందన్నారు. 
 ఈ సందర్భంగా ఎయిమ్ మిషన్ డైరెక్టర్ ఆర్ రమణన్ మాట్లాడుతూ, అటల్ ఇన్నొవేషన్ మిషన్ పది లక్షలమంది నవకల్పనల రూపకర్తలను సృష్టించటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీరు దేశంలో కొత్త ఉద్యోగాల్ సృష్టికర్తలు కూడా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అటల్ టింకరింగ్ లాబ్ ఆలోచనాపరులలో వ్యాపార దక్షత పెంపొందించటానికి  డెల్ టెక్నాలజీస్ తో భాగస్వామ్యం కుదురుకున్నామని చెప్పారు.  ఇలాంటి విద్యార్థుల ఆకాంక్షలకు వాస్తవరూపం ఇవ్వటానికి ఇదే సరైనమార్గమని కూడా అభిప్రాయపడ్దారు. దేశవ్యాప్తంగా ఇలాంటి యువత ఆలోచనలను పదును పెట్టటానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


గత సీజన్ లో నిర్వహించిన ఎ టి ఎల్ ఆమరథాన్ లో 1500 నవకల్పనలు సమర్పించగా రెండు రౌండ్ల పరిశీలన అనంతరం 50 జట్లను విద్యార్థి నవకల్పనల రూపకర్తల కార్యక్రమానికి ఎంపిక చేశారు. వీరిలో 75% పైగా బృందాలు చిన్నపట్టణాలు, గ్రామాలకు చెందినవారు కావటం విశేషం. పైగా 60% మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారున్నట్టు కూడా గుర్తించారు. విజేతలైనవారిలో 46% మంది బాలికలు. అలా ఎంపికైన జట్లకు అటల్ ఇన్ క్యుబేషన్ సెంటర్లలో  నెలల తరబడి శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత వారిలో   అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఎనిమిది జట్లను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లో 2019 నవంబర్ 14న సత్కరించారు. ఇప్పుడు ఆ జట్ల వారు తమ ఉత్పత్తుల  నమూనాలు తయారుచేస్తారు.

***



(Release ID: 1645230) Visitor Counter : 298