రైల్వే మంత్రిత్వ శాఖ

రద్దయిన సాధారణ ప్రయాణీకుల రైళ్ల గురించి సమాచారం

నియమానుసారం నడిచే సాధారణ ప్రయాణీకుల మరియు సబర్బన్ రైలు సర్వీసుల రద్దు ఇదివరకే నిర్ణయించి తెలియజేసిన విధంగా తిరిగి ప్రకటించే వరకు కొనసాగుతుంది

Posted On: 11 AUG 2020 5:29PM by PIB Hyderabad

ఇందుమూలముగా సంబంధించిన వారందరికీ తెలియజేయడం ఏమనగా  ఇదివరకే నిర్ణయించి తెలియజేసిన విధంగా నియమిత కాలపట్టిక ప్రకారం నడిచే  సాధారణ  ప్రయాణీకుల మరియు శివారు ప్రాంతాల రైలు సర్వీసుల రద్దు తిరిగి ప్రకటించే వరకు కొనసాగుతుంది.

ప్రస్తుతం వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లు అదే విధంగా తిరుగుతాయి.  రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు  ముంబయి నగరంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో నడుస్తున్న  లోకల్ రైళ్లను  కూడా అదేవిధంగా నడుపుతారు.  

స్పెషల్ రైళ్లలో ప్రయాణీకుల సంఖ్యను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.  అవసరమైతే అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతారు.

అయితే లాక్ డౌన్ కు ముందు నడిచిన సాధారణ మరియు శివారు ప్రాంతాల రైలు సర్వీసుల రద్దు ప్రస్తుతానికి కొనసాగుతుంది.

***(Release ID: 1645228) Visitor Counter : 99