సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ భారత ఉపరాష్ట్రపతి మూడేళ్ల పదవీ కాలం అనే ఈ-బుక్కు ను, కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.

Posted On: 11 AUG 2020 1:16PM by PIB Hyderabad

‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ భారత ఉపరాష్ట్రపతి మూడేళ్ల పదవీ కాలం అనే పుస్తకం ఈ-వెర్షన్ను, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్, ఈ రోజు విడుదల చేశారు.  ఈ పుస్తకం కాఫీ టేబుల్ వెర్షన్ను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు.  ఈ కార్యక్రమం న్యూఢిల్లీ లోని ఉప-రాష్ట్రపతి నివాస్ ‌లో జరిగింది. 

 

250 పేజీలతో ఈ పుస్తకాన్ని ప్రచురణల విభాగం రూపొందించింది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ, ఉపరాష్ట్రపతి చేసిన ప్రయాణాలతో సహా వివిధ రకాలైన కార్యకలాపాలను కధనాలు, చిత్రాల ద్వారా ఈ పుస్తకంలో పొందుపరిచారు.  రైతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత, నిర్వాహకులు, పరిశ్రమ నాయకులు మరియు కళాకారులతో, ఇతరులతో పరస్పర చర్చల సంగ్రహ స్వరూపాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

ఉపరాష్ట్రపతి విదేశీ సందర్శనలకు సంబంధించిన సంఘటనలు, ప్రపంచ నాయకులతో ఆయన జరిపిన సంభాషణలు మరియు వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

ఈ-పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం, శ్రీ జవదేకర్ మాట్లాడుతూ, కమ్యూనికేషన్ ద్వారా ప్రజలతో అనుసంధానం అవ్వడం గురించీ, భారతదేశాన్ని మార్చడం గురించీ, ఈ పుస్తకం తెలియజేస్తుందని పేర్కొన్నారు.  ఉపరాష్ట్రపతి ప్రసంగాలను అనుసరించాలనుకునే విద్యార్థులకు ఈ పుస్తకం 3వ ఎడిషన్ ఒక నిధి లాంటిదని ఆయన అభివర్ణించారు.  ఉపరాష్ట్రపతి ప్రసంగాలు ఆలోచనలు మరియు భావోద్వేగాలతో నిండి ఉన్నాయని, భాషలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని ఆయన అన్నారు.  కాఫీ టేబుల్ బుక్కు మరియు దాని ఈ-వెర్షన్ను రూపొందించి, విడుదల చేసినందుకు, ప్రచురణల విభాగాన్ని మంత్రి అభినందించారు.

 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, వక్తృత్వం ఒక కళ అనీ, ఉపరాష్ట్రపతి మనఃస్ఫూర్తిగా మాట్లాడుతారనీ, ఆయన ప్రసంగాలు ఆయన ఆలోచనలు మరియు భావోద్వేగాలకు ప్రతిబింబంగా ఉంటాయనీ పేర్కొన్నారు.   ఒక తరం మరొక తరానికి అందివ్వగల గొప్ప బహుమతి మంచి పుస్తకం అనీ, పాఠకులు ఈ పుస్తకాన్ని మళ్ళీ, మళ్ళీ చదువుతారని, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ సంకలనాన్ని రూపొందించినందుకు శ్రీ రాజ్ నాథ్ సింగ్ సమాచార, ప్రసార శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఉపరాష్ట్రపతి తరచుగా పేర్కొనే " కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్" అనే 3-సి యొక్క మార్గాన్ని ఈ సంకలనానికి పేరుగా పెట్టడం సముచితంగా ఉందని ఆయన అభినందించారు. 

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ప్రచురణ ప్రధానంగా తన ఉద్దేశ్యాలు, ఆదర్శాల రూపు రేఖలను, ఫలితాలను చక్కగా నిర్వచించిందని పేర్కొన్నారు.  కరోనా అసౌకర్యం వల్ల కలిగిన మంద గమనానికి ముందు ఒక ఏడాది పాటు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.  మొదటి దశలో నెలకు సుమారు 20 బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనగా మొత్తం 14 స్నాతకోత్సవాలలో ప్రసంగించారు, 70 బహిరంగ కార్యక్రమాలలో మాట్లాడారు.  ఆయన ప్రధానంగా రైతులు, యువత, శాస్త్రవేత్తలు, నిర్వాహకులు, పరిశ్రమల అధిపతులు, వైద్యులు మరియు ప్రవాస భారతీయులతో ఎక్కువగా సంభాషించారు. 

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ ఖరే వందన సమర్పణ చేస్తూ, ఈ పుస్తకం సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.  ప్రతి సంవత్సరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి యొక్క అన్ని ప్రసంగాలను రికార్డు చేసి, ఆన్ ‌లైన్ మరియు ఆఫ్ ‌లైన్ మాధ్యమం ద్వారా భవిష్యత్ తరాలకు వాటిని అందుబాటులో ఉంచడానికి, ప్రచురణల విభాగం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.  కాఫీ టేబుల్ బుక్కు ను ప్రచురించడానికి కృషి చేసినందుకు ప్రచురణల విభాగాన్ని శ్రీ ఖరే అభినందించారు.

ఈ పుస్తకం భౌతికంగా మార్కెట్లోనూ, ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానూ, అమ్మకానికి అందుబాటులో ఉంది.  పి-బుక్కు ధర 1500 రూపాయలు.  ప్రచురణల విభాగానికి చెందిన విక్రయ కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాని అధీకృత ఏజెంట్ల నుండి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.  ఆన్ ‌లైన్ ‌లో కావాలంటే భారత్ ‌కోష్ పోర్టల్, పబ్లికేషన్సు డివిజన్ వెబ్ ‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.  ఈ-బుక్కు ధర 1125 రూపాయలు (పి-బుక్కు ధరలో 75 శాతం). ప్రముఖ ఈ-కామర్సు వేదికలైన అమెజాన్.ఇన్ మరియు గూగుల్ ప్లే బుక్సు ద్వారా ఈ-బుక్కు కొనుగోలు చేయవచ్చు.  

పి-బుక్సు కోసం దయచేసి ఇక్కడ "క్లిక్" చేయండి. 

http://www.publicationsdivision.nic.in/index.php?route=product/product&product_id=3693

ఈ-బుక్సు కోసం ఇక్కడ "క్లిక్" చేయండి.

https://www.publicationsdivision.nic.in/index.php?route=product/product&product_id=3694

గూగుల్ బుక్సు లింకు కోసం ఇక్కడ "క్లిక్" చేయండి. 

https://books.google.co.in/books/about/CONNECTING_COMMUNICATING_CHANGING_ENGLIS.html?id=w2n2DwAAQBAJ&redir_esc=y

*****



(Release ID: 1645060) Visitor Counter : 233