పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రపంచ జీవఇంధన దినోత్సవం సందర్బంగా వెబినార్ నిర్వహణ

ఈ రంగానికి పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని రాష్ట్రాలకు పిలుపు ఇచ్చిన పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ కార్యదర్శి.మరియు వ్యర్ధాల యాజమాన్యంపై రైతులను, సాధారణ ప్రజానీకాన్ని ఉత్తేజితులను చేయాలని కూడా పిలుపు

Posted On: 10 AUG 2020 3:09PM by PIB Hyderabad

ప్రపంచ జీవఇంధన దినోత్సవం సందర్బంగా ఈ రోజు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబినార్ నిర్వహించారు.  వెబినార్ ఇతివృత్తం  "స్వయంసమృద్ధి కోసం బయోఇంధనాలు".  బయోఇంధన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన నిర్వహిస్తారు.  సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజేతర ఇంధనాల ప్రాముఖ్యత గురించి జాగృతి కలిగించడం, జీవ ఇంధన రంగం ప్రగతికి ప్రభుత్వం చేస్తున్న వివిధ యత్నాలను గురించి ప్రముఖంగా పేర్కొనడం జీవఇంధన దినోత్సవం ఏర్పాటు ఉద్దేశం.  ప్రపంచ జీవఇంధన దినోత్సవాన్ని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2015 నుంచి నిర్వహిస్తోంది.  

 

జీవఇంధన కార్యక్రమం భారత ప్రభుత్వ వినూత్న ప్రయత్నం ఆత్మ నిర్భర భారత్ తో సమన్వితమైంది.   తదనుగుణంగా ఈ ఏడాది ప్రపంచ దినోత్సవం ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం జరిగింది.   అంతేకాక  ప్రపంచ మహమ్మారి కరోనా / కోవిడ్ దృష్ట్యా ఈ ఏడాది ఉత్సవాన్ని వెబినార్ ద్వారా నిర్వహించారు.  

1893లో వేరుశెనగ నూనెతో ఇంజను నడిపిన సర్ రుడాల్ఫ్ డీజిల్ పరిశోధనా ప్రయోగాలను గౌరవిస్తూ ఆయన స్మృతిలో ఈ రోజును జరుపుతారు.  వివిధ యంత్రాలను నడిపేందుకు వచ్చే శతాభిలో శిలాజ ఇంధనాల స్థానంలో శాఖా తైలాలను ఉపయోగించడం జరుగుతుందని అయన  పరిశోధనల ప్రయోగాల ద్వారా ముందుగా ఊహించి చెప్పారు.   

 

ఈ సందర్బంగా పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ కపూర్ మాట్లాడుతూ  ఇండియా విశాలమైన వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థ. పెద్దఎత్తున వ్యవసాయ అవశేషాలు, వ్యర్ధాలు లభ్యమవుతాయి.  అందువల్ల దేశంలో బయో ఇంధనాల ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయి అన్నారు.  జీవ ఇంధనాలను చూసినట్లయితే మనకు మూడు ప్రధాన అంగాలు కనిపిస్తాయి.  అవి  ఈథేనాల్,  బయో డీజిల్ మరియు బయోగ్యాస్.   "ఒకవేళ మనం ఈ మూడింటిని బాగా ఉపయోగించుకోగలిగితే ముడి చమురు,  గ్యాస్  దిగుమతి చేసుకోవడం కూడా చాలావరకు తగ్గించవచ్చు"  అని అయన అన్నారు.  ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని,  నిపుణులైన పనివారిని,  వృత్తిపనివారిని ఉపయోగించాలి మరియు   ఆర్ధిక సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.   ఇందుకోసం ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వాల మద్దతును ఆయన కోరారు.  ఎందుకంటే వ్యవసాయ వ్యర్ధాలు మరియు అన్నిరకాల ఇతర అవశేషాలు,   మునిసిపాలిటీలలో ఘన వ్యర్ధాల నుంచి లేక ఇతర రకాల వ్యర్ధాల నుంచి వస్తాయి.   వాటిని సేకరించి, వేరుచేసి,  పర్యవేక్షించి భవిష్యత్తులో ఏర్పాటయ్యే ప్లాంట్లకు సరఫరా చేయాలి.  ఈ రంగంలో ఇతర భాగస్వామ్యపక్షాలు ప్రాధమికంగా వ్యర్ధాలను సృష్టించి వాటి యాజమాన్యం చేయని  రైతులు మరియు సాధారణ ప్రజానీకాన్ని కూడా  వాటిని సరైన రీతిలో అజమాయిషీ చేసి ఉపయోగకరమైన రూపంలోకి మార్చే విధంగా ఉత్తేజితుల్ని చేయాలని కూడా  శ్రీ కపూర్ పిలుపు ఇచ్చారు.   

 

జీవ ఇంధనాల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.  దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాక మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిశుభ్రంగా మార్చవచ్చు.  రైతులకు అదనపు ఆదాయం మరియు ఉపాధిని సృష్టించవచ్చు.  2014 నుంచి
భారత ప్రభుత్వం జీవ ఇంధనాల మిశ్రమం పెంచడం  కోసం అనేక ప్రయత్నాలు చేసింది.   వాటిలో ప్రధానంగా పేర్కొనవలసింది ఈథేనాల్ కు పరిపాలనా ధరల యంత్రాంగాన్ని రూపొందించింది.  చమురు మార్కెటింగ్ కంపెనీల సేకరణ పద్ధతులను సులభతరం చేసింది. పారిశ్రామిక చట్టం,1951 నిబంధనలను సవరించింది.  ఈథేనాల్  సేకరణకు దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించి ఈథేనాల సంధాన సామర్ధ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకున్నారు.  ఈథేనాల్ మిశ్రమ కార్యక్రమం కింద చమురు మార్కెటింగ్ కంపెనీలు 01.12.19 నుంచి  03.08.20 మధ్య కాలంలో 113.09 కోట్ల లీటర్ల బయోడీజిల్ సేకరించాయి.  అదే విధంగా బయో డీజిల్ మిశ్రమ కార్యక్రమం కింద చమురు మార్కెటింగ్ కంపెనీల సేకరణ  2015-16లో 1.1 కోట్ల లీటర్లు ఉండగా 2019-20 నాటికి 10.6 కోట్ల లీటర్ల పెరిగింది.  

***


(Release ID: 1644894) Visitor Counter : 340